Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన హదయ హారతి
సాహిత్య రథ సారథి
ప్రజా ఉద్యమ వారధి
అతడే
దాశరథి కృష్ణమాచార్యులు
తెలంగాణ దాస్య విముక్తికి
కలం పోరు సాగించిన వీరుడు
నిజాం నిరంకుశ పాలనపై.
అక్షర గళం విప్పిన విప్లవుడు
రజాకారుల గుండెల్లో
కవన ఖడ్గం దింపిన ధీరుడు
రాజరికపు అరాచకాలపై
పద్య ఫిరంగి పేల్చిన శూరుడు
జమీందారుల దాష్టికాలపై
అగ్నిధార కురిపించిన రౌద్రుడు
దొరతనపు ఆధిపత్యంపై
రుద్రవీణ మోగించిన విక్రముడు
గాలీబు గజళ్ళు, షాయరీలతో
హృదులు గెలిచిన సాహితి రేడు
తెలంగాణ కోటిరత్నాల వీణంటూ
ఎలుగెత్తి చాటిన మహా యోధుడు
తరాల బూజు నిజాం రాజంటూ
నిక్కచ్చిగ నినదించిన కవి ధీరుడు
అభ్యుదయ కవితా జలది
కరుణాపయోనిథి దాశరథి
తెలంగాణ తల్లి నుదుట
వీర తిలకమై ప్రకాశిస్తాడు
తూరుపు కనుమల్లో...
కవన సూరీడై ప్రజ్వలిస్తాడు
(జులై 22 న దాశరథి జయంతి సందర్బంగా )
- కోడిగూటి తిరుపతి
సెల్:9573929493