Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు చికిత్సకు ఉన్న సౌకర్యాలు తక్కువ... మరో వైపు పెరుగుతున్న రోగుల సంఖ్య ఎక్కువ. అంత మందికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రాత్రికి రాత్రే ఏర్పాట్లు చేయటం, మానవ వనరులను సమకూర్చుకోవటం కష్టం. కరోనా విషయంలో వైద్యారోగ్యశాఖ అధికారుల్లో ఇదే గుబులు పట్టుకుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్‌ల సమయంలో బెడ్లు, వైద్య సిబ్బంది కొరత కొట్టిచ్చినట్టు కనిపించింది. ఇక సెకెండ్ వేవ్ సమయంలో రోగులు ఎక్కువ మంది పాజిటివ్ కాకుండా కొంతకాలం తిరిగి లాక్ డౌన్ విధించారు. ఈ లోపు పండుగలు, మళ్లీ రాజకీయ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు పెరగటంతో మరోసారి కేసులు పెరుగుతాయోమో అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ప్రజలు కూడా మాస్కులు ధరించకుండా గుంపులు, గుంపులుగా చేరుతుండటం పెరిగిపోతున్నది. ఇక కరోనా కట్టడి అందరి సమిష్టి బాధ్యత అంటున్నది సర్కార్. ధర్డ్ వేవ్ వస్తే అందుకు కారకులు ఎవరవుతారనేదే ప్రశ్న.
-కొత్తూరు ప్రియకుమార్