Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో జూలై 11, 2021నాడు, క్యూబా ఒక అసాధారణమైన అలజడితో కూడిన ఉదయంతో మేల్కొంది. హవానా శివార్లలో కొందరు వ్యక్తులు బృందాలుగా వీధుల్లోకి వచ్చి నినాదాలతో నిరసనలు తెలియజేశారు. ఆహారం, మందులు, వ్యాక్సిన్, విద్యుత్తు మొదలైన నిత్యావసర సమస్యలపై ఆ నిరసనలు జరిగాయి. వందల వేల మంది ప్రజలు వివిధ నగరాల్లో మునిసిపాలిటీలలో గుమిగూడి రాజకీయ నాయకత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తూ నినాదాలు చేశారు. సుదీర్ఘకాలంగా ఆ స్థాయిలో అలాంటి నిరసనను క్యూబా ఎదుర్కొన లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ నినాదాలు అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టిని ఆకర్షించాయి. దానిలో ప్రధానమైనది ''యస్ఒయస్ క్యూబా (తక్షణ సహాయన్నందించండి)''. ఈ అలజడి ప్రారంభదశలో, నిరసనకారులు అంతర్జాతీయ సమాజానికి మానవత్వంతో సహకరించాలని, ఆహార కొరత, మందులు, వ్యాక్సిన్ విద్యుత్తును సమకూర్చుకోవడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. కానీ, మనం నిశితంగా పరిశీలించినట్టయితే అది ఆ ప్రాంతంలోని మితవాద శక్తుల ప్రోద్భలంతో నిర్వహిస్తున్నట్టు అర్థం అవుతుంది. అది కృత్రిమ యుద్ధంగా మారినట్టు తెలుస్తోంది. 12 జూలై 2021న ఫ్లోరిడా రాష్ట్రానికి సంబంధించిన డెమోక్రటిక్ కాంగ్రెస్కు చెందిన మహిళ వాల్ డెమింగ్స్(ప్రాముఖ్యత కలిగిన క్యూబన్ వలస వాద ఆలోచన కలిగిన వ్యక్తి) వైట్ హౌస్ వేగంగా కదలాలని విజ్ఞప్తి చేసింది. శతాబ్దానికి పైగా అమెరికా ప్రభుత్వం లాటిన్ అమెరికాలో అనుసరిస్తున్న విధానాన్నీ, ఇతర ప్రభుత్వాలలో జోక్యాన్నీ సమర్థిస్తూ (మిలటరీ ఇతర మార్గాల ద్వారా) జోక్యం చేసుకోవాలని సూచించింది.
కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రకటనలో, క్యూబన్ ప్రజలు ఒక నిరంకుశ ప్రభుత్వ పరిపాలన నుండి స్వేచ్ఛను కోరుతున్నారని ప్రకటించాడు. ఈ ప్రకటన, సత్యదూరమైనదే కాక, మోసపూరితమైనది. ఒక విధంగా అవమానకరమైనది. వాస్తవం ఏమంటే, అర్థ శతాబ్దానికి పైగా క్యూబా ప్రజల అంతులేని తీవ్ర విషాదానికి ప్రాథమికంగా వైట్ హౌస్ విధించిన నిషేధాలు, ఆర్థిక దిగ్బంధనాలే ప్రధాన కారణం. క్యూబా విషయంలో ప్రత్యక్ష జోక్యం వల్ల ఆ ప్రాంతంలో మరింత స్థిరత్వం కోల్పోవడమే కాక, అనిశ్చితి ఏర్పడుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అమెరికా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు తగినది కాదనే వాస్తవాన్ని బైడెన్ గ్రహించాడు. వాస్తవంగా మంగళవారం రోజున, క్యూబాలో కుటుంబ మూలాలున్న హౌమ్ ల్యాండ్ సెక్యూరిటీ అయి జాన్డ్రో మయోర్కాస్, క్యూబన్ జాతీయులను సముద్రమార్గం ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించ కూడదని ఆదేశాలు ఇవ్వవలసి వచ్చింది. ఇదే పద్ధతిలో యుఎస్ కోస్ట్ గార్డును కూడా, పై విధంగానే ఆంక్షలు విధించాలని ఒత్తిడి చేశారు. ఆసక్తికర విషయమేమంటే, మైమీలో నివసిస్తున్న వారు కూడా ప్రయివేటు పడవలలో సముద్ర మార్గంలో ప్రయాణించి క్యూబాలోకి ప్రవేశించ వద్దని కోరారు. గతంతో పోల్చుకున్నట్టయితే, 1994లో సోవియట్ పతనం తర్వాత, ఆ దేశం నుండి దిగుమతి అవుతున్న, ఆహార ఉత్పత్తులు, దిగుమతులు, ఆయిల్ యంత్రాలపై తీవ్ర ప్రభావం పడింది. క్యూబా, అమెరికాలో కొందరిపైనా ఈ ప్రభావం పడింది. ఇటీవలి సంఘటనలు ''మెలకానోజో'' నాటి సంఘటనను గుర్తు చేస్తున్నాయి. ఆ సందర్భంలో కొందరు ప్రాణాలను పణంగా పెడుతూ చిన్న తెప్పల ద్వారా అమెరికా భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
కోవిడ్-19 మానవత్వానికి సంక్షోభం సామ్రాజ్యవాదానికి అవకాశం!
అమెరికా ప్రభుత్వం 20వ శతాబ్దంలో అత్యంత పేరుగాంచిన సామ్రాజ్యవాద దేశం. కోవిడ్-19 మహమ్మారిని అవకాశంగా తీసుకొని, క్యూబాను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక చక్కటి అదునుగా తీసుకుంది. లాటిన్ అమెరికన్ ప్రాంతంలో దీర్ఘ కాలంగా ఆర్థికంగా, సైద్ధాంతికంగానేకాక, లాటిన్ అమెరికా దేశాల్లో తమ ఆర్థిక ప్రయోజనాలకు, విదేశీ విధానానికి ప్రమాదకారిగా పరిగణించబడే క్యూబాపై ఆంక్షలు విధించడానికి అవకాశంగా తీసుకుంది. క్యూబాలో పరిపాలనా మార్పు బైడన్ పరిపాలనకు, ఆ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయాలను అడ్డుకోవడానికి ఉపకరిస్తుంది. వామపక్ష అధ్యక్ష అభ్యర్థి విజయం తర్వాత సాంప్రదాయికంగా అనుకూలంగా ఉన్న పెరూలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ మార్పులకు, పరిణామాలకు సూచనలు కనబడు తున్నాయి. మెక్సికోలో ఆన్ డ్రెస్ మాన్యువల్లో పెనజ్ అబ్రేటర్ నాయకత్వంలో అమెరికా, మెక్సికో ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన మార్పుకు గురైయినవి. సోమవారంనాడు అమెరికా యొక్క ప్రత్యక్ష ప్రస్తావన లేకుండా, మెక్సికో అధ్యక్షుడు, సర్వసత్తాక దేశమైన క్యూబా అంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకునే ఆలోచనలకు తీవ్ర అభ్యంతరం తెలిపాడు. 2020 చివరిలో వామపక్ష అభ్యర్థి లూయిస్ ఆర్స్ ఎన్నికల విజయంతో, బొలీవియాలో ప్రజాదరణ పొందిన ఈవో మోరల్స్ లాంటి నాయకులకు వ్యతిరేకంగా పౌర తిరుగుబాట్లు జరిగినప్పటికీ, ఎలాంటి సానుకూలమైన ఫలితాలు రాలేదని గతంలోనే బొలీవియా నిరూపించింది. అర్జెంటీనాలో 2019 చివరిలో, మితవాద అభ్యర్థి మరీసియో మాక్రిపై ఆల్ సెట్లో ఫెర్ నాండెజ్ ఎన్నికల విజయం కూడా లాటిన్ అమెరికాలోని దక్షిణ ప్రాంతంలోని, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రధానమైన ఘటన. చిలీ నూతన రాజకీయ ప్రారంభ దశలో ఉన్నది. నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. 2021 తర్వాత సాధారణ ఎన్నికలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా సెహాస్టియన్ పినెరా నాయకత్వంలోని మితవాద ప్రభుత్వం ఎదురుదెబ్బలు తినడం దేశంలోని ప్రజాస్వామ్య, అభివృద్ధి కాముక శక్తులు అధికారాన్ని పొందడానికి దోహదపడింది.
క్యూబా వ్యతిరేక దిగ్బంధనం
దీనిని గూర్చి సమగ్రమైన అవగాహనకు రావాలంటే, రెండు రకాల నినాదాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆదివారపు నినాదాలను లోతుగా పరి శీలించినట్టయితే, క్యూబా గత కొంత కాలంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నట్లు అర్థమవుతుంది. లాటిన్ అమెరికా యొక్క రాజకీయ కార్యకలాపాలను రోజు వారీ అవగాహన చేసుకొనే వారెవరైనా, ఈ సంక్షోభాన్ని కేవలం కోవిడ్-19వలన ఏర్పడిన ఆరోగ్య సంరక్షణ నేపథ్యంలో తలెత్తిన, తీవ్రమైన మందుల కొరత, వైద్యం, వాక్సిన్ లాంటి అత్యవసర పరిస్థితి కాదని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ, దానికంటే ఎంతో లోతైన, విస్తృతమైన, సూక్ష్మమైన ప్రధానాంశమేమంటే 1959 తరువాత విప్లవ క్యూబన్ ప్రభుత్వం అనుసరించిన సైద్ధాంతిక రాజకీయ విధానాలు ఆకర్షణీయమైన వేగాక, ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడినవి. మానవ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత తీవ్రంగా, క్రూరంగా, అమానుషంగా, అమెరికా క్యూబాపై నిషేధం విధించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో, క్యూబాను ఊపిరాడకుండా చేసి సొమ్ము చేసుకోవడం కోసం ఆతృతగా వేచి చూస్తున్నది. కేవలం సామాజిక ఆర్థిక విషయాల్లోనే కాక, ఒక విధంగా రాజకీయంగా కూడా, ప్రజల అశాంతిని క్యూబన్ ప్రభుత్వం ఎదుర్కోవడానికి వీలులేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్నది. గమనించదగిన విషయమేమంటే, రోనాల్డ్ ట్రంప్ బెదిరింపు ధోరణితో, దూకుడుగా ఊపిరాడకుండా చేయగల క్యూబా వ్యతిరేక విదేశీ విధానంతో, 243 రకాలైన ఆర్థిక పరమైన ఆర్థిక, వాణిజ్య సంబంధమైన తీవ్ర ఆంక్షలు విధిస్తూ, అనుమతులకు సడలింపు ఇవ్వకుండా చేశాడు. ట్రంప్ వ్యవహరించిన విధంగానే, జో బైడన్ ప్రభుత్వం కూడా కోవిడ్ మహమ్మారి సమయంలో అలాంటి కట్టడినే చేసింది. ఫిబ్రవరి 22కు క్యూబాపై అమెరికా నిషేధం విధించి 60 సంవత్సరాలు పూర్తి అవుతుంది. నిషేధానికి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 29 సందర్భాలలో తీర్మానాలు చేసింది. ఈ మధ్యకాలంలో జూన్ 2021న తీర్మానం చేసింది. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ రెండు దేశాలు మాత్రమే తిరిగి నిషేధానికి అనుకూలంగా ఓటు వేశాయి.
క్యూబా, ఆ దేశ ప్రజలు ఇంతటి పెద్ద సంక్షోభాన్ని, ఒత్తిడిని ఎదుర్కొని నిలబడడం వాస్తవంగా మొదటిసారి కాదు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత సందర్భం యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత ఏమంటే, ఈ సామాజిక అశాంతి కాస్ట్రో తదుపరి కాలంలో జరిగింది కాబట్టి, ఈ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, క్యూబాకు ఆకర్షణీయమైన క్యాస్ట్రో లాంటి నాయకుడు లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది. క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోలిట్ బ్యూరో సమావేశం, విప్లవానంతరం అశాంతి నెలకొన్న నేపథ్యంలో రాహుల్ క్యాస్ట్రో క్రియాశీలక రాజకీయాల నుండి రిటైర్ అయినప్పటికీ, యువ రాజకీయ నాయకత్వానికి మార్గ దర్శకత్వం వహించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాలని సూచించింది.
విప్లవ ప్రభుత్వాన్ని జనవరి 1, 1959లో ఏర్పాటు చేసిన నాటి నుండి సుదీర్ఘకాలం 20వ శతాబ్దం రెండవ దశలో, లాటిన్ అమెరికాలో ప్రధానమైన సామాజిక రాజకీయ ఉద్యమాలకు క్యూబా మార్గదర్శకం వహించింది. దాదాపు మూడు తరాలు క్యూబా ప్రజలు నిర్వహించిన పోరాటాల నుండి ఉత్తేజాన్ని, అనేక పాఠాలను తీసుకున్నారు. కేవలం తమ భూభాగంలోనే కాక అనేక ఇతర దేశాల్లో కూడా అంతర్జాతీయ వాదాన్ని అనుసరించారు. వెనెజులా, బొలీవియా, ఈక్వెడార్, అర్జెంటీనా చిలీ, ఉరుగ్వే, పెరు, మెక్సికో మొదలగు దేశాల గౌరవాన్ని పొందడమే కాక వామపక్ష, ప్రజాస్వామిక, అభివృద్ధి కాముక ప్రభుత్వాలకు, సంస్థలకు మరియు సామాజిక రాజకీయ ఉద్యమాలకు ప్రేరణనిచ్చారు. ప్రధానంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రెండు దశాబ్దాలపాటు అమెరికా నుండి అనేక అవరోధాలు ఉన్నప్పటికీ క్యూబా సైద్ధాంతికంగా గాని, రాజకీయంగా గాని, నికరమైన మార్గదర్శకం వహించడంలో వెనుకబడలేదు. ఈ నేపథ్యంలో, క్యూబా పాత్ర వైట్ హౌస్కు తీవ్రమైన అసౌకర్యాన్ని కలుగజేసింది. ప్రధానంగా ప్రచ్చన్న యుద్ధం తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది. క్యూబా ప్రస్తుత నాయకత్వం ప్రెసిడెంట్ మైఖెల్ డీయాజ్ కాజల్(61సంవత్సరాలు) ప్రధానమంత్రి మాన్యువల్ మారినో (58సంవత్సరాలు), విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రీగిజ్ ప్యారిలా ్ల(63సంవత్సరాలు) వీరు విప్లవానంతర తరానికి చెందినవారై ఉన్నారు. క్యూబన్ విప్లవంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనివారుగా, విప్లవానంతర తరానికి చెందిన వారుగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని వారు ఏవిధంగా ఎదుర్కొంటారనే దానిని బట్టి, తమ దేశంలో సొంత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడమే కాక, వామపక్షానికి, ప్రజాస్వామ్య, అభివృద్ధికాముక ఉద్యమాలకు మార్గ దర్శకంగా ఉండే స్థాయిని లాటిన్ అమెరికాలో కొనసాగించగలరా లేదా అనేది నిర్ణయించబడుతుంది.
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు,
- సురేంద్ర సింగ్ నేగి
సెల్: 9490300111