Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు వీరుడా
కదనరంగ శూరుడా
మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ...
నాటి నల్లగొండ జిల్లా నీర్మాల గ్రామము
వీరుడిగా నీకు జన్మనిచ్చిన ప్రదేశము
పదారేండ్ల వయసులో పాఠశాల చదువులు
పక్కనెట్టి బక్క పేద జనం బతుకు చదివినోడ
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
నైజాం దొర సేనలూ పల్లెలొ భూస్వాములూ
అలారు బలారు దీసుకొనీ చెలరేగే రోజులు
పూటకు లేనోళ్ల బట్టి వెట్టిలోన ముంచితే
పట్టించనవెర్రజెండ పట్టిడువని విక్రమార్కు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
సాహసమనె విద్యలో నీకు నీవే సాటిలే
సహచరులను జైలు నుండి తప్పించినవూ భలే
గన్ను చూపి తన్నితే కాపలదారుల దిమ్మతిరిగె
కన్ను తెరిచెలోపల కామ్రేడ్లను విడిపించినోడ
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
బాంచన్ కాల్మొక్తనే బతుకులు వద్దన్నవు
సాయుధ రైతాంగ తెలంగాణ పోరువైనవు
దున్నెటోళ్లకే భూములు దక్కాలని దండెత్తి
జమిందార్ల భూముల్లో జెండాలై ఎగిరినవు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
మనకోసం ఆలోచించే తత్వం తగదన్నవు
నిస్వార్థం నిరుపేదల సేవ ధర్మమన్నవు
రైతుకూలి జనమంతా రాగన్న అని పిలుచుకుండ్రు
రాగి సజ్జ జొన్నంబలి తాపీ బతికించుకుండ్రు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
ఒక చేతగన్ను మరో చేత పెన్ను బడితివి
ఉద్యమ ఉత్తేజానికి పోరుపాటవైతివి
సభలో నీ మాట పాట తూటాలై దూసుకెళ్లి
సమరానికి సై అంటూ సత్తువనిచ్చింది నిజం
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
కమ్యూనిజం అజేయం కాపాడగ బతుకుతాం
నీ ఆశయ సాధనకై ఎర్రబాట సాగుతాం
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
( కామ్రేడ్ కృష్ణమూర్తి వర్థంతి సందర్భంగా)
తండ్రీ నిను తలంచి...
కమ్యూనిస్టు వీరుడా
కదనరంగ శూరుడా
మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ...
నాటి నల్లగొండ జిల్లా నీర్మాల గ్రామము
వీరుడిగా నీకు జన్మనిచ్చిన ప్రదేశము
పదారేండ్ల వయసులో పాఠశాల చదువులు
పక్కనెట్టి బక్క పేద జనం బతుకు చదివినోడ
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
నైజాం దొర సేనలూ పల్లెలొ భూస్వాములూ
అలారు బలారు దీసుకొనీ చెలరేగే రోజులు
పూటకు లేనోళ్ల బట్టి వెట్టిలోన ముంచితే
పట్టించనవెర్రజెండ పట్టిడువని విక్రమార్కు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
సాహసమనె విద్యలో నీకు నీవే సాటిలే
సహచరులను జైలు నుండి తప్పించినవూ భలే
గన్ను చూపి తన్నితే కాపలదారుల దిమ్మతిరిగె
కన్ను తెరిచెలోపల కామ్రేడ్లను విడిపించినోడ
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
బాంచన్ కాల్మొక్తనే బతుకులు వద్దన్నవు
సాయుధ రైతాంగ తెలంగాణ పోరువైనవు
దున్నెటోళ్లకే భూములు దక్కాలని దండెత్తి
జమిందార్ల భూముల్లో జెండాలై ఎగిరినవు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదు కీర్తీ
మనకోసం ఆలోచించే తత్వం తగదన్నవు
నిస్వార్థం నిరుపేదల సేవ ధర్మమన్నవు
రైతుకూలి జనమంతా రాగన్న అని పిలుచుకుండ్రు
రాగి సజ్జ జొన్నంబలి తాపీ బతికించుకుండ్రు
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
ఒక చేతగన్ను మరో చేత పెన్ను బడితివి
ఉద్యమ ఉత్తేజానికి పోరుపాటవైతివి
సభలో నీ మాట పాట తూటాలై దూసుకెళ్లి
సమరానికి సై అంటూ సత్తువనిచ్చింది నిజం
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
కమ్యూనిజం అజేయం కాపాడగ బతుకుతాం
నీ ఆశయ సాధనకై ఎర్రబాట సాగుతాం
కష్టజీవుల తండ్రీ కృష్ణమూర్తీ
కలకాలం నిలుచునయ్య నీదుకీర్తీ
( కామ్రేడ్ కృష్ణమూర్తి వర్థంతి సందర్భంగా)
- బండి సత్తెన్న
సెల్: 9398307803