Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఒక అంశంపై సర్కారు కమిటీ వేసిందనో... కమిషన్ నియమించిందనో నిత్యం మనం వార్తలు చదువుతుంటాం. దాన్ని పత్రికలు, పలు ఛానెళ్ళు పతాక శీర్షికల్లో పెట్టడం గమనిస్తుంటాం. అయితే, ఈ కమిటీలు... కమిషన్ల కథాకమామీషుని నీటి పారుదల రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పిన తీరు వింటే ఎంతటి స్థితప్రజ్ఞత కలిగినవారైనా నవ్వకుండా ఉండలేరు. అదేంటో తెలుసుకుందామా మరి? పురాణేతిహాసాల్లో శాంతనుడు అనే చక్రవర్తి హస్తినా రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఏదో పని మీద ఆయన ఒకసారి గంగా నది దాటాల్సి వచ్చింది. అక్కడ పడవ చొదకురాలుగా ఒక మత్య్స మహిళని చూశాడట మన హస్తినా చక్రవర్తి. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో శాంతనుడు అక్కడిక్కడే సదరు మహిళపై మనసు పారేసుకున్నాడు. తను క్షత్రియుడు, ఆమేమో మత్స్య మహిళా. ఆమెని పరిణయమాడితే ఈ సమాజమంతా నన్ను సంకరజాతి అంటారేమోనని, తన ఆస్థానంలోని ముగ్గురి మంత్రులతో ఒక కమిటీ వేశాడట మన మహారాజు. కమిటీని నియమించే ముందే తాను ఆ మత్స్య మగువని పరిణయమాడుతానని వారికి తెగేసి చెప్పాడట. దీంతో ఆ మంత్రులకి ఏం చేయాలో పాలుపోక ఒక బూటకాన్ని తెరపైకి తీసుకొచ్చారట. అదేంటంటే... శాంతనుడు పూర్వ జన్మలో శ్రీకష్ణడనీ, ఆ మత్స్య మహిళ కష్ణుడు రోమాన్స్ చేసిన 16 వేల మంది గోపికల్లో ఒకరని నివేదిక ఇచ్చారట. గదీ సంగతి. గీ కమిటీల నివేదిక కూడా గట్లనే ఉంటదని ఆ వాటర్ ఎక్స్పర్ట్ చెప్పడంతో సభంతా నవ్వుల్లో మునిగితేలింది.
- సాగర్