Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమిపుడు సుప్తావస్థలో ఉంది
బలమైన అసమ్మతి
మందుబిళ్ళేదో కావాలిప్పుడు
జవసత్వాలు ఊదడానికి
రాజ్యపు కళ్ళు
మసకబారిపోయినవి
మేలిమైన సులోచనాలేవో
కావాలిప్పుడు
పాలనా లోపాలు
స్పష్టంగా చూపడానికి
రాజ్యంగపు జీవిపుడు
రాజ్యపు సీసాలో
బంధించబడి వుంది
విడిపించు
ప్రజా యుద్ధమొకటి కావాలిప్పుడు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోడానికి
రాజ్యం
''ఉపా'' ఉరితాళ్ళు పేనుకొని ఉంది
దేశభద్రత, రాజద్రోహం మాటున
నిలదీసే, నినదించే
వారి ఉసురు తీయడానికి
ఈ వరుసలో...
నిన్న స్టాన్ స్వామి
నేడు నేను కావొచ్చు..
రేపు నువ్వు కావొచ్చు
మేలుకోకుంటే...
- వి. దిలీప్
సెల్ :8464030808