Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేహన్నీ
అమ్ముకుంటుంది
''ఆమె''..!
దేశాన్నే
అమ్ముకుంటాడు
''వాడు''..!
ఖర్మ ..
ఆమె
నేరస్థురాలట..!
వాడు
నాయకుడట ..!!
అంతేనా ...
బస్టాండ్
హౌర్డింగ్
వెలుగుల్లో
వాడట ....!
ఆ పక్కన చీకట్లో
ఆమె నట...!!
ప్చ్....
తన
మాంసాన్ని
నమ్ముకుంటే
వేశ్య ..!
మంది
రక్తాన్ని
దోచుకుంటే
నేత...!!