Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాటికిపోయినా కులవివక్ష నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రపంచంలో వర్ణ వివక్ష.. ఇండియాలోకులవివక్ష, అంటరానితనం దళితులను పట్టిపీడిస్తూనే ఉన్నది. ఎందెందువెతికినా ఆ కంపుకొడుతూనే ఉన్నది. అంతరిక్షంలోకి టూరిస్టు ప్రయాణం. ఆధునిక యుగం వైపు ప్రపంచం దూసుకెళ్లుతున్నది. ప్రపంచమే ఒక కుగ్రామం అని చెబుతున్న దిశలోనూ దళితులపై దుర్మార్గమైన కులపడగ విప్పుతూనే ఉన్నది. అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నా. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోస్తున్నా...రాష్ట్రపతి, స్పీకర్ హౌదాలో ఉన్నా వారిలో కనపడేది వినపడేది కులమే. ఈ దుస్సాప్రదాయం దళితులను వేటాడుతూనే ఉన్నది. తాజాగా టోక్యో ఒలంపిక్స్‌లో హాకీ మహిళా టీమ్ ఓటమిపాలైంది. ఆ ఓటమికి హాకీ జట్టు సభ్యురాలు దళిత సామాజికతరగతికి చెందిన వందన కతరియ కారణమంటూ కొంత మంది ముర్ఖులు ఆమె ఇంటి వద్ద నానాయాగీ చేశారు. ఆమె ఇంటి ముందు బాణసంచా పేల్చి అవమానించారు. కులవివక్ష వ్యాఖ్యలు చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వందన స్పందిస్తూ దేశం కోసం ఆడుతున్నానంటూ హుందాగా మాట్లాడి చెంపచెల్లుమనిపించింది. దేశానికి స్వతంత్య్రం వచ్చిన తర్వాత అగ్రకుల అధిపత్య శక్తులే శాస్తున్నాయి. ఇది కులం అధిక్యత కాదా? ఎవరైనా గొంతెత్తితే ప్రతిభా అంటున్నారు. నిజంగా అంత ప్రతిభ ఉంటే..ఫైరవీలు ఎందుకు? రాజకీయాలెందుకు? రికమండేషన్లు ఎందుకు? వారికే ప్రమోషన్లు ఎందుకు? సమానావకాశాలు కల్పించడాలంటే అందరినీ ఎందుకు ప్రోత్సహించడం లేదు. క్రికెట్లో టీమిండియా రెండేరెండుసార్లు ప్రపంచకప్ సాధించింది. దీనికి ఏ కులంకారణం? 41 ఏండ్ల తర్వాత పురుషుల జట్టు హాకీలో కాంస్యం గెలిచింది. జవాలింగ్త్రోలో వందేండ్ల తర్వాత స్వర్ణం పతకం సాధించాం. ఇన్నేండ్లపాటు ఓడిపోతూనే ఉన్నాం. దీనికి ఏ కులాన్ని బాధ్యులను చేద్దాం? మీరే చెప్పండి. మహిళల హాకీ జట్టు ఓటమికి గెలుపోటములు సహజమనే సూత్రం వర్తించదా? ఇక్కడ కులవివక్షతోపాటు పురుషాధిక్యత కూడా రాజ్యమేలుతున్నది. ఆటల్లోనూ కులాన్ని వెతికే ముర్ఖులే.. ముష్కరులై వందన ఇంటి వద్ద హంగామా సృష్టించారు.
- గుడిగ రఘు