Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరే కాక ఫలానవాడు ఎక్కడ ఉంటాడు రా? అని ఎవరినైనా మన మిత్రుడిని అడిగితే ఆ రచ్చబండ దగ్గరో... ఫలానా చౌరస్తా వద్దనో... బాబారు టీ స్టాల్ దగ్గరో లేదా ఆంటీ టిఫిన్ సెంటర్ చెంతనో ఉన్నాడనే సమాధానం గతంలో వింటుండేవాళ్ళం. కమ్యూనికేషన్ విప్లవం పుణ్యమా అని పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక అసలు మనుషుల అడ్రసులే అర్థంకాని విధంగా తయారు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. అరేరు చిచ్చా మన సత్తిగాడు ఏడ ఉన్నాడిరా, అని ఇటీవల ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అడిగిన. హ... మామ ఒక్క సెకన్ రా అన్నాడు అవతలి నుంచి నా మిత్రుడు. ఏంటీ వీడు, వాడు ఎక్కడ ఉన్నాడని అడిగితే ఒక్క సెకన్లో చెబుతా అంటున్నాడని సంకట సందేహం వచ్చింది. బహుశా, వీడు... వాడు బాగా క్లోజు కావచ్చనీ, ఫోన్ చేసి కనుకుంటాడని అనుకున్నా. వెంటనే మళ్ళీ నా ఫ్రెండ్ కాల్ చేసి... మామ సత్తిగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఆన్లైన్లోనే ఉన్నాడు రా అందులో పింగ్(మేసెజ్ పంపు అని అర్థం) చేరు అని సమాధానం ఇవ్వడంతో నా బుర్ర కొద్దిసేపు బ్లాక్ అయింది. సాటి దోస్తు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే వాడితో మాట్లాడి అడగాల్సిన పనేలేదన్నమాట. వాడి సోషల్ మీడియా అకౌంట్లో చెక్ చేస్తే సరిపోతదట. ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చాడు... ఆఫ్‌లైన్ అయి ఎంతసేపు అవుతుందన్నది తెలుస్తుందట. అదండీ పరిస్థితి. ఇటీవల కాలంలో మన మనుషులంతా సోసైటీకి దూరంగా... సోషల్ మీడియాకి దారుణంగా దగ్గరై ఎలా బతుకుతున్నారో చూశారు కదా. వాడేంటీ, ఇంచుమించు నా పరిస్థితి అదే విధంగా తయారైంది.నా పరిస్థితి మాత్రమేనా... కుయ్యిమనకుండా చదువుతున్నా, మీరు కూడా ఆ బాపతే కదా. సోషల్ మీడియాకి దూరంగా ఉంటే నడిచే కాలమా ఇది... ఎందుకంటే మనిషి ''సోషల్'' యానిమల్ అని ఎవరో ఫిలాసర్ ఎక్కడో దేశంలో ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పిన విషయమే కదా. హ్హ హ్హ హ్హ.
- సాగర్ వనపర్తి