Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ఎంతో మధురమైనది.. ఆహాల్లదకరమైనది. అందమైనది.. వైవిద్యమైనది..! ఆ ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు కూడా అనేక వైవిధ్యాలు, వైష్యమ్యాలు, వివక్షతను కలిగి ఉండడం గమనార్హం. ఈ ప్రకృతి, మనిషి ధర్మాధర్మాలను పరిశీలిస్తే.. రెండు వైవిధ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ప్రకృతి మనిషి, జంతువులు బతకడానికి అనేక పంటలు, పండ్లు, కూరగాయలను ఇస్తుంది. వాటిలో ప్రధానంగా ఇసుకనేలలు , చౌడు నేలల్లో సైతం నీళ్లు లేకున్నా, అడపా దడపా వానలు కురుస్తేచాలు, పంటలు పండి బలమైన పదార్థాలు ఇవ్వటం ప్రకృతి యొక్క గొప్పదనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వీటిలో గోధుమలు, జొన్నలు, రాగులు కొర్రలు, ఆరుకలు రాగులు, చిరుధాన్యాలు పెసర్లు, కందులు, ఉలవలు చాలా ముఖ్యమైన ఆహారధాన్యాలు. ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ మంచు ఆవిరిని గ్రహించి ఎదుగుతాయి. బలవర్థకమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలను మనకు అందిస్తాయి. మనకు ఆరోగ్యానిస్తాయి. రెండు, అదే ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు అనేక అసమానతలకు, వినాశనానికి దోహదపడుతున్నాడు. తినే ఆహారంలోనూ, జీవన విధానంలోనూ, సంస్కృతిలోను విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటున్నాడు. ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాల్లో విలాసవంతమైనటువంటి ఆహార పదార్థాలు మాంసాహారాలు, రాఫుడ్స్, జంక్ ఫుడ్ అమితంగా తీసుకుంటు అనారోగ్యకరమైనటువంటి జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఎంత ఎక్కువ స్టేటసుంటే అంత ఎక్కువ డ్రా ఫుడ్స్, బర్గర్లు తీసుకున్నారు. దీంతో తినే ఆహారంతో మైండ్ సెట్ మారుతుంది. ఇటు ప్రకృతి ఇచ్చినటువంటి చిరుధాన్యాలతో శ్రామికులు, దళితులు, కార్మికులు చిరుధాన్యాలు తింటు అనారోగ్యం లేకుండా, బలిష్టంగా, పటిష్టంగా ఆరోగ్యంగా బతుకుతుండటం ఆశ్చర్యకరం. నాణ్యత కు, నమ్మకానికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ప్రకృతిలో స్వేచ్ఛగా పెరుగుతున్న పంటల్లో ఎలాంటి వివక్షత, అసమానతలు లేవు. కానీ ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న మనిషి మాత్రం సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా తోటి మనిషి పట్ల అసమానతలు ప్రదర్శించడం, వివక్షతో చూడటం ఆధునిక మానవుని వ్యక్తిత్వానికి, హౌదాకు తీరని కలంకం. అటు ప్రకృతి, ఇటు మానవునికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో మనిషి తన జాతినీ తానే నరుక్కుంటుంన్నాడు. పకృతేమో పచ్చని నీడనిస్తుంది. పున్నమి వెన్నెలలో సేదతీర్చుతుంది. నిఖిల లోకానికి సోయపరిమాళానిస్తుంది. నిజమైనటువంటి మిత్రునిగా, ఆత్పునిగా, సహాయకునిగా, ప్రాణధాతగా పరిఢవిల్లుతుంది..!!
- డి.కృష్ణయ్య(హిమబిందు), వీపనగండ్ల.