Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఏందీ ఈయన అచ్చేదిన్ అంటూ టైటిల్ బెట్టి ఇదేందో పేరుతో షురూ జేసిండని పరేషన్ అవుతున్నరా? అయ్యో... ఇది మన పెధాని మోడీ సార్ పూర్తి పేరు కదా. మీకు తెల్వదానుల్లా? ఆయన పెధాని మాత్రమేనా? మాంచి మాటల మాంత్రికుడు. అంతకిమించి అద్భుతమైన వేశధారి. గంటకో గెటప్. పూటకో ఏశం...రాష్ట్రానికో డ్రెస్సు, ఎన్నికలకో ఎజెండా తెరపైకి తీసుకురావడంలో సినీతారలను మించిన ఆర్టిస్టు అంటూ మన మోడీ సాబ్పై కొంతమంది అవాకులు చవాకులు నిత్యం పేల్చుతుంటరు కదా. గయితే గీటీవల సోషల్ మీడియాలో ఒక లొల్లి నడుస్తున్నది. గదేంటంటే... మోడీజీ అచ్చేదిన్ కిస్కో అయేగా? అని ఒక కలం యోధుడు ప్రశ్న పోస్టు కొట్టిండు. దీనికి వేరేటోళ్ళంతా ఇగ కామెంట్ల మీద కామెంట్లు రాస్తనే ఉన్నారు. ఆ అచ్చేదిన్ అదానీ, అంబానీలకు వచ్చాయని ఒకలు... అమిత్ షా కొడుకు జైషాకి వచ్చాయని ఇంకొకలు... లేదుల్లా బీజేపీ నేతలకు వచ్చినయని మరొకలు సెబుతనే ఉన్నారు. ఇంతలో ఒకాయన స్పందిస్తూ... మన మోడీ సారు అచ్చేదిన్ ఆమాద్మీ తెచ్చిండో లేదో తెల్వదు గానీ సచ్చేదిన్ అయితే తెనేతెచ్చిండని కామెంట్ పెట్టిండు. ఇగ ఆ కామెంటు బెట్టినోడి మీద బూతులు, తిట్లదండకం, ప్రశ్నల వరదతో ఊకుంటరా? మన భక్తజనం. ఈ మధ్యలోనే ఒక మంచి బత్తాయి రెస్పాండ్ అవుతూ... సచ్చేదిన్ ఎలా వచ్చాయో సవివరంగా జెప్పాలని ఏదో లాజికల్‌గా అడిగినట్టు క్వశ్చనేసిండు. వాళ్ళ ఎవరికీ స్పందించని సదరు కామెంట్మేకరు... ఈరోజు తను బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునే ముందు దాని రేటు రూ. 105.83 ఫొటో కొట్టి పెట్టి కౌంటర్ పోస్టు కొట్టిండు. ఇగ గా ఫొటో చూసిండా భక్తుడు, కుయ్యిమంటే ఒట్టు. బత్తాయి భక్తుడే ఆ కామెంట్‌ను భరిస్తూ ఉన్నడంటే సచ్చేదిన్ వచ్చినట్టే కదా మిత్రోమ్. సోచో జరా! అచ్చేదినో... సచ్చేదినో. హహ.
- సాగర్ వనపర్తి.