Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాలిబాన్. పెపంచమంతా హడలు వుట్టించిన మనుషులు. తాలిబ్ అంటే అరబిక్‌లో చదువుకునేటోళ్ళంట. మరి ఆళ్ళేమో తుపాకులు పట్టుకున్నరేందని అందరూ ఒకటే పరేషాన్. అరే మనకంటే బలపాలు, పెన్నులున్నారు బై. ఆళ్ళకు అమెరికోడు గన్నులే ఇచ్చిండంటడు ఓ పెద్ద సారూ. గీ మధ్యనే అఫ్గాన్ నుంచి అమెరికా మిలిట్రోళ్ళు ఎళ్ళిపోవడంతో తాలిబాన్గాళ్ళు సర్కారు మీద సమరం జేసిండ్రు. అరాచకం జేస్తమని బెదిరిచ్చి అధికారం లాక్కున్నరు. ఆ దేశ అధ్యచ్చుడు ఘనీ సారే పైసల కట్టలతో పారిపోయేంత పని చేసిండ్రు. దీంతో ఇగ మన ప్రాంతీయ రిపోర్టర్ల నుంచి ప్రాశ్చాత్య మీడియా దాకా అందరూ తాలిబాన్ అంటే ముదనష్టపోళ్ళు, మూర్ఖులు, ముష్కరులు... ఔలాగాళ్ళు, ఆటంకవాదలంటూ రాసిపారేసిర్రు. ఆళ్ళ పాలన గంతకుముందు గట్లనే ఉండేదటలేర్రి. అయితే ఒక్క మినిట్ మనం ఓ ఈషయం కూడా సోచాయించాలె. ఆళ్ళంతా గన్‌తో పవర్లోకి వచ్చిండ్రు. గట్లనే పాడైతరు. మనందరి సేత బేవార్సు, బేకారుగాళ్ళని పిలువబడుతున్న తాలిబాన్ తమ్ముళ్ళు చేసిన సాహసోపేతమైన పనేందో తెలుసానుల్లా? చెబితే నిజంగా ఔనా మల్ల అంటరు మీరయితే. ఏంటో అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? ఏంటీ. ఆగుర్రి నేనే సెప్తా. కాందహార్‌లో పుట్టి అడ్డదిడ్డంగా ముందుకు కదిలి కాబూల్నే స్వాధీనం చేసుకున్న తాలిబాన్... అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత చేసిన గొప్ప పని, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాణం అరసేతిలో పెట్టుకొని బతుకుతున్న పెజలకి సందేశం ఇవ్వడం. ఏందీ గీయన గింత సోది చెప్పి... ప్రెస్‌మీట్ పెట్టుడే సాహసోపేతమైన చర్య అంటాడని ఆగం అవుతుర్రా. అరే భారు... ప్రెస్‌మీట్ పెట్టుడు చిన్న విషయమైతే.... గీన్ని ఏండ్ల సంది మన పెధాని మోడీ ఎందుకు ఒక్క మీడియా సమావేశం కూడా ఎందుకు పెట్టలేదో, జర సోచాయించుండ్రి. అయినా మన సారు ఇప్పుడు పెట్రోల్ రేట్లు, గ్యాస్ ధరలు, నూనె పాకిట్ల రేట్లు... ఆఖరికి గడ్డం కూడా తెల్లగ గట్టిగనే పెంచవట్టే. ఇగ ఈలేకర్లతో ఎక్కడ భేటీ వెడతడులేండ్రి. సరేగని, మోడీజీ... ఆప్ మీడియాకే సామ్నే క్యూ ఆరా నై! అనే క్వశ్చన్‌గా సారు ఎక్కువగా ఉండే ట్విటర్ పిట్టనో... ఇన్స్టాగ్రాము, ముఖపుస్తకంలోనో అడుగుతే పోలే. అడిగినా లాభం లేదులే. వాళ్ళు తాలిబాన్ అయితే... ఈయన మీడియాబాన్ కదా. మిగతాది అంతా సేమ్ కదా.
- సాగర్ వనపర్తి.