Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ని పర్వతం బద్ధలైంది
కాబుల్ రగులుతున్న మంటల్లో
ఆకాశం నిశ్శహాయముగా
బేలా చూపులతో మూగ బోయింది...
నేలతల్లి భయం తో వణికిపోతుంది...
జనం గుండెల్లో తూపాకీ గుండ్లు
తాలిబాన్ల భీకర దాడులతో అల్లకల్లోలం
అఫ్ఘానిస్తాన్‌లో దయనీయ స్థితి
ప్రాణభయంతో ఇళ్లను వదిలి
కాలిబాట పట్టారు
''తాలిబాన్లు ఒక నాన్నను
ఒక అన్నను చంపేశారు
స్కూలులో పరీక్ష రాస్తుంటే బుల్లెట్ దాడి
అమ్మ తోడు లేని నాన్న అనాధ
నాన్న తోడు లేని బిడ్డలు అనాధ
ఎరుపెక్కిన సూర్యుడు
మౌన మునిలా నిశ్శబ్దం
ఆఫ్ఘన్ మహిళలు చీకటి
శ్వాస లోకి జారుతున్నారు....
గడప దాటని మహిళా
ప్రాణ భయంతో చంటి పిల్లలతో
సరిహద్దుల్ని దాటు తుంది...
విమాన రెక్కలను వెళ్ళాడుతూ
అంతిమ శ్వాస గాల్లో శాశ్వతముగా
వదులుకుంటున్నారు..
జీవిత చక్రంలో
బంది అయినారు...
గాలి మోటారు చక్రంలో
మాంసం ముద్దయితే
విశ్వం నిర్వరియం అయింది...
మనిషిలో మృగం
మరో మనిషి రక్తంతో
దాహార్తి తీర్చుకుంటున్నాడు...
అభాగ్యుల జీవితం
ఆకాశం కింద ఒంటరైంది...
పైన ఆకాశం
మధ్య అభాగ్య జీవితం
కాళ్ల కింద భూమి మనిషి వికృత చర్యకు
కంపిచిపోతుంది.....
- ఎలాగొండ రవి
సెల్: 9848770345