Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయనో మంత్రి, విద్యావ్యాపార వేత్త, కొత్తగా ప్రయివేటు యూనివర్సిటీ అనుమతి కూడా తెచ్చుకున్నారు. ప్లేస్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యాసంస్థల్నీ ఆయన నడిపిస్తున్నారు.. వాటికోసం ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల కబ్జాల సంగతి సరే...విచక్షణ కోల్పోయిన విద్యావేత్త, మీడియా ముందు తొడలు కొట్టుడు, తిట్ల దండకం అందుకొనుడే ఇప్పుడు హాట్ టాపిక్. అయన్నో జోకర్‌గా ప్రతిపక్షాలు ప్రకటించేశారు. ఈ తిట్లు, తొడగొట్టడాలే ఆయన యూనివర్సిటీలో సిలబస్‌గా నేర్పిస్తారనే సోషల్ మీడియా చమక్కులు, చురుక్కుమంటున్నాయి. ఇక మల్కాజ్‌గిరిలో అధికారపార్టీ ఎమ్మెల్యే...'అసభ్య సమాజం' కూడా తలదించుకొనే స్థాయిలో మీడియా ముందు బూతు పురాణం అందుకున్నారు. ప్రజాప్రతినిధుల హౌదాలో ఆదర్శంగా నిలవాల్సిన ఇలాంటి నాయకులను ఎన్నుకున్న స్థానిక ఓటర్లు తలలెక్కడ పెట్టుకోవాలో అర్ధంకాక సతమతమవుతున్నారు. కాస్త విజ్ఞత ప్రదర్శించండి పెద్ద సార్లూ...ప్రజల్ని తలెత్తుకు తిరిగేలా ప్రవర్తించండి! మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా ఇండ్లలో పోరోళ్లు కూడా ఇదే భాష నేర్చుకుంటే...మాతోపాటు మీకూ కష్టమే!!
- కె.ఎన్. హరి