Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక, భారతదేశంలో హిందూత్వ ఉగ్రవాద తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అక్కడికి తామేదో సెక్యురిస్టులు అయినట్టు మోడీ సర్కారును ప్రశ్నించేవాళ్లందరూ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లొచ్చంటూ, బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియాలో పోస్టుల్ని వండి వారుస్తున్నారు. పాత, కొత్త వీడియోలను షేర్ చేస్తూ దేశభక్తి, హిందూత్వ అజెండాతో భారతీయుల్ని మతం, కులం పేర్లతో విభజించే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రారంభోత్సవంలో చార్మినార్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లను ఉదహరించారు. ఎంఐఎం పేరు చెప్పి, హిందూ, ముస్లింల మధ్య మత ప్రాతిపదికగా చీలికతెచ్చే ప్రయత్నం చేశారు. ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తామంటేనే నానా సందేహాలతో షరతులు విధించే పోలీసు శాఖ చార్మినార్ దగ్గర వేదిక ఏర్పాటుకు ఉదారంగా అనుమతి ఇచ్చేసింది. బండి సంజరు ప్రసంగం ఆద్యంతం ప్రజాసమస్యల్ని గాలికొదిలి, మత విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణిలోనే సాగింది. ఫలితంగా పాతబస్తీలో ఉద్రిక్తతను సృష్టించే ప్రయత్నం చేశారు. 'ప్రజా సంగ్రామం' అంటూ ప్రజలను మతం పేరుతో విభజించి, వారిపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంగ్రామం ప్రకటించినట్టు ఉంది. ఆయన 'వ్యాహ్యాళి'తో గ్రామగ్రామాన మత విద్వేష బీజాలు నాటడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ మతానికి చెందిన ఉగ్రవాదులు ఉంటే, భారతదేశంలో హిందూత్వ పేరుతో బీజేపీ చేస్తున్నది ఏంటనేదే ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న. అక్కడ వాళ్లు చేస్తుందే కదా...ఇక్కడ వీళ్ళూ చేస్తున్నది! మతం, ఆవుమాంసం పేరుతో దేశంలో కాషాయమూక చేస్తున్న అరాచకాలకూ, ఆఫ్ఘన్ తాలిబన్లకూ తేడా ఏముంది? మనం చేస్తే... 'దేశం కోసం-ధర్మం కోసం'...పక్కోడు చేస్తే 'ఉగ్రవాదం...తీవ్రవాదం. ఇద్దరూ ఇద్దరేరా అయ్యా! ముందు మనసున్న మనుషులుగా బతకడం నేర్చుకోండి... ప్రజల్ని ప్రశాంతంగా 'బతకనివ్వండి'!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి