Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ హృదయమనే మందిరంలో ఎన్నో
బాధలు గుమిగూడి నిను కలవరపెట్టినా...
నీ కలచెదరకుండా కాలంవెంట పరుగెడతావు.
నీ ఎదలోని ఆశల గవాక్షం తలపులు
ఎప్పుడూ తెరుచుకొని చూస్తుంటాయి.
విజయపు వికాసాల పరిమళాలకోసం.
నీ ఆశయ సాధన సాగరంలో
ఎప్పుడు ఈదుతూనే ఉంటావు.
తొణికిసలాడుతున్న నీరులా.
నీ ఎదచిత్తమునందు నువ్వెంచుకున్న
లక్ష్యం ఉబుకివస్తూనే ఉంటుంది.
ఊరిస్తున్న తీరాన్ని ముద్దాడాలని.
మనసును ఛత్రంలాపరిచి.. మంచుగడ్డలాకరిగించి
ఉపిరినుండి విత్తనాలను తీసి
స్వేధపు చుక్కలను నీటిదారలుగా మలిచి
నింగికి నేలకు మధ్య బతుకుతీగలను మొళిపించి
వెలుగు పూలను పూయిస్తావు.
రెక్కలు తొడిగిన పక్షివై..
నింగి అంచుల్లోకి ఎగురుతూనే ఉంటావు.
చెమట చుక్కల్లా నీ జీవిత స్వప్నాలు రాలుతున్నా...
బక్కచిక్కిన దోసిళ్ళతో నీ కన్నీళ్లను ఒడిసిపట్టుకొని..
నీ రుధిరాన్ని చమురుగా మలుచుకొని...
నీ నరాలను దీపపు వత్తులుగా పేనుకొని..
గుండెల్లో మండేబాధను
నిప్పురవ్వల్లా వెలుగించుకొని..
ప్రమిదవై కాంతులీనుతావు.
లోకానికి వెలుగై దారిచూపుతావు.
విజయం సాధించడంలో ఒడిపోతావేమోకాని
ప్రయత్నంలో మాత్రం నువ్వోడిపోవు.
అందుకే ...నువ్వెప్పుడూ గొప్పోడివే.
అశోక్ గోనె, సెల్:9441317361