Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒలంపిక్ ఐస్క్రీమ్ సంబరంలో
ఐపీఎల్ బాదుడు హౌరులో
రైతుల నిరసన రోజుల స్కోర్ ఎంతో
ఆఫ్ఘనిస్తాన్ అయోమయంలో
అంత ర్జాతీయ హడావిడి వార్తల్లో
ఆక్సిజన్ అందని ప్రాణాలు ఎన్నో
పెగాసిస్ పార్లమెంట్ లొల్లిలో
పెరిగిన పెట్రోలు గ్యాస్ మోతలో
పస్తులు ఉంటున్న కుటుంబాలు ఎన్నో
వజ్రోత్సవపు ఉత్సాహములో
వలస వెళ్లిన కంపెనీల చిట్టాలో
ఊడిన ఉద్యోగాలు ఎన్నో
లైఫ్ సైజ్ కవర్ పేజి అడ్వర్టైజ్మెంట్లో
ప్రభుత్వ పబ్లిసిటీ బాజాలో
దిగ జారిన జీడీపీ ఎంతో
సోషల్ మీడియా ప్రచార హౌరులో
అభివద్ది నగారాల మత్తులో
అతివల ఆర్తనాదాలు ఎన్నో
ఏమోషన్తో పదవిలోకి వచ్చి
ఈవింట్లతో పాలన జరి పే పాలకులకు
మిగిలిన నెలలు ఇంకా ఎన్నో
దాసరి మోహన్
సెల్: 9985309080