Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించిన 20రోజుల లోపే సంస్థ ఛైర్మన్‌ను కూడా నియామకం చేసింది. సెప్టెంబర్ 20న ఛైర్మన్గారు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన 48 గంటలలోపే '4 నెలలలోపు ఆర్టీసీ లాభాలలోకి రాకపోతే ఆర్టీసీని ప్రయివేటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు' అని నేరుగా ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు 'గుసగుస'లుగా ఉన్న విషయాన్ని ఛైర్మన్ దృవీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మనుగడ, దాని స్థితిగతులపై ప్రజలలో చర్చజరిగేలా సమస్య మరోసారి ముందుకు వచ్చింది. అందుకోసం కొన్ని వాస్తవాలను ప్రజలముందుంచే ప్రయత్నం చేద్దాం.
ఆర్టీసీకి ప్రభుత్వం బాగా నిధులు ఇచ్చి సహకరిస్తున్నదని అటు ప్రభుత్వం, మంత్రివర్యులు, కార్మిక సంఘ నాయకులమని చెప్పుకొనే కొంతమంది పదేపదే ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమేనా? మరి నిజమే అనుకుందాం, అయితే సంస్థ బస్సుల కొనుగోలుకు నిధులు ఎందుకు లేవు? తన కాళ్ళను తానే నరుక్కొన్నట్లు 1000 బస్లకుపైగా ఎందుకు తగ్గించుకున్నది? టైర్లు కొనలేక రోజుకి 400బస్‌లకు పైగా గ్యారేజీకే ఎందుకు పరిమితమవుతున్నాయి? ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్న కార్పొరేటు ఆసుపత్రులు కార్మికులకు వైద్యం ఎందుకు చేయడం లేదు? ఆయిల్ కంపెనీలు సక్రమంగా ఆయిల్ సప్లయి చేయనందున బస్‌లు నడపలేని స్థితి ఎందుకు ఉంది? వాటికి తోడు కార్మికుల జీతాలే సక్రమంగా చెల్లించటంలేదు. 2013 వేతన ఒప్పందం బకాయిలు చెల్లించలేదు. ఐదు డీఏలు అమలు చేయలేదు. గత సంవత్సరం నుండి పండుగ అడ్వాన్స్ కూడా నిలిపివేశారు. 2017, 2021 ఏప్రిల్ నెలల్లో అమలు కావలసిన నూతన వేతన ఒప్పందం నేటికీ ఎందుకు అమలుజరగలేదు? భవిష్యనిధి ట్రస్ట్ నిధులు 1400 కోట్లు, సీసీఎస్ నిధులు 1000 కోట్లు ఆయా సంస్థలకు చెల్లించకుండా ఆర్టీసీ సంస్థ ఎందుకు వాడుకొంటున్నది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వమే అంతా ఇస్తున్నదని చెప్పే 'సోకాల్డ్ లీడర్స్' కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ వారు ఆ పని చేయడం లేదు. ఈ క్రింది టేబుల్‌ను పరిశీలిస్తే నిజమేమిటో తెలుస్తుంది.
2014-15 నుండి 2020-21 మార్చి వరకు ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావలసినవి 5276.93 కోట్లు (ఆర్టీసీ క్లెయిమ్ చేసినవి ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి) రూపాయలు. చెల్లించినవి 6284.97 కోట్లు. ఏడేండ్లలో ప్రభుత్వం నుండి అదనంగా వచ్చినవి 1008.04 కోట్లు మాత్రమే. సగటున సంవత్సరానికి 144 కోట్లు మాత్రమేఆర్టీసీకి ఇచ్చి, మేమిస్తేనే ఆర్టీసీ సంస్థ, కార్మికులు బతుకుతున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర బడ్జెట్లో 1శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించాలని కార్మిక సంఘాలు కొద్ది సంవత్సరాలుగా డిమాండు చేస్తున్నాయి. 2021-22 సం|| బడ్జెట్లో 1500 కోట్లు (850 కోట్లు నగదు, 650 కోట్లు గ్యారెంటెడ్ లోన్స్) కేటాయించారు. అందులో జులై ఆఖరి వరకు 487.50 కోట్లు ఆర్టీసీకి విడుదల చేశారు. బడ్జెటేతర వనరుల ద్వారా మరో 1500 కోట్లు సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. అందులో 1000 కోట్లు అప్పు ఇప్పించారు. ఈ 1500 కోట్లు అప్పును ఆర్టీసీ సంస్థే తీర్చుకోవాలి. అంటే ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోవడమే అవుతుంది. ఇదేనా ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకోవడమంటే?
ప్రభుత్వాలు దండుకొన్నది ఎంత ? : ఆర్టీసీ తన అవసరాల కోసం చాసెస్లను కొంటుంది. వాటిపైన బాడీ కట్టిస్తుంది. అందులోని సీట్లు కొంటుంది. అలాగే పెద్ద మొత్తం ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఇతర అనేక రకాల విడిభాగాలను కొనుగోలు చేస్తుంది. వీటన్నింటిపైన పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. డీజిల్ ధరల పెంపు తీవ్రభారంగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసికి సప్లై చేస్తున్న డీజిల్ (ఆగస్టు 2021) బేసిక్ ధర లీటరు రూ.42లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ 31.80 రూపాయలు (బేసిక్ ధరలో 76శాతం కేంద్ర పన్ను), రాష్ట్రం విధించే వ్యాట్ 27శాతంతో కలుపుకొని రూ.95కు పైగా చెల్లిస్తున్నది. ఈ పన్నులలో రాష్ట్రం వ్యాట్ నుండి రాయితీ ఇచ్చినా లీటరుకు రూ.20లు భారం తగ్గుతుంది.
రాష్ట్రానికి చెల్లించిన కేంద్రానికి చెల్లించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు
వ్యాట్ ఎక్సైజ్ పన్ను చెల్లించిన జిఎస్టి
చాసెస్ పైన 26.24 21.05 3.43
బస్ బాడీస్ పైన 15.41 10.93 9.38
బస్ సీట్స్ పైన 1.63 1.28 9.38
సిఎన్జి గ్యాస్ 11.25 10.13 -
డీజిల్ ఆయిల్ 1635.06 1959.25 -
ఇతరములు 67.16 - 11.88
1756.75 2002.64 134.12
ఏడేండ్లలో రాష్ట్రానికి వ్యాట్ రూపంలో 1756.75 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్రానికి 2002.64 కోట్లు, జీఎస్టీ రూపంలో 134.12 కోట్లు చెల్లించింది. వీటికి అదనంగా ఎం.వి.టాక్స్ రూపంలో 1456.92 కోట్లు చెల్లించింది. వెరసి మొత్తం 5350.43 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వాలకు చెల్లించింది.
మరో కోణంలో చూసినప్పుడు ఆర్టీసీకి వస్తున్న మొత్తం ఆదాయంలో పన్నుల వాటా 2014-15లో 19.24శాతం ఉండగా, 2020-21 నాటికి ఆ వాటా 26.03శాతానికి చేరింది.
ఈ పన్నుల భారాన్ని గనుక తగ్గిస్తే ఆర్టీసీకి నష్టం ఉండకపోగా లాభాల్లో కూడా ఉంటుంది అని ఈ క్రింది విశ్లేషణ చూస్తే అర్ధం అవుతుంది.
సంవత్సరం వచ్చిన మొత్తం మొత్తం ఖర్చులు మొత్తం పన్ను
ఆదాయం ఖర్చు శాతంలో(%) శాతంలో(%)
2014-15 3239.43 3593.97 109.09 19.24
2015-16 4336.29 5486.77 127.00 15.16
2016-17 4233.05 4987.33 117.70 19.91
2017-18 4570.37 5319.27 136.39 19.93
2018-19 4882.72 5811.38 119.01 18.64
2019-20 4592.93 5594.95 121.81 16.65
2020-21 2455.51 4784.74 195.45 26.03
నోట్ : 2020-21 కరోనా కాలం కావడం వల్ల ఆదాయం పడిపోయింది.
అంతర్గత సామర్ధ్యం ఇంకా పెంచుకోవచ్చా ? : బట్టలు ఉతికినప్పుడు నీళ్లు పోవాలంటే ఒక మేరకు పిండాలి. అంతకంటే ఎక్కువ పిండితే ఆ బట్ట చిరిగిపోతుంది. చెరుకును గానుగలో వేసి ఎక్కువసార్లు పిండితే చెరకు రసం బదులుపిప్పి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఆ స్థితికి చేరారు. ఇంకా వారి నుండి ఏం పిండుకుంటారు.
భారతదేశంలోని 56 ఆర్టీసీలలో రోజుకి చేరవేస్తున్న ప్రయాణీకుల సంఖ్యలో టిఎస్ ఆర్టీసీ 10,000 బస్లతోనే 95లక్షల మందిని చేరవేస్తూ ప్రథమస్థానంలో ఉంది (ఎస్ఆర్టియు 2016-17 లెక్కల ప్రకారం సంవత్సరానికి 34879.97 లక్షల మంది). మన పక్కనే ఉన్న తమిళనాడులో 19,400 బస్‌లలో 1కోటి 26 లక్షల మందిని చేరవేస్తున్నారు. 2018-19 సం|| ప్రకారం హైదరాబాద్ నగరంలో రోజుకి 30 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం.
అదే నివేదిక ప్రకారం ఆదాయంలో దేశంలో మూడవ స్ధానంలో ఉంది. ఖర్చులు తగ్గించుకోవడంలో మూడవ స్ధానంలోను, నష్టాలు వస్తున్న సంస్థలలో 4వ స్థానంలో కొనసాగుతున్నది. గడచిన ఐదేండ్లలో సిబ్బందిపైన అవుతున్న ఖర్చు పెరగకుండా, దాదాపు నిలకడగా ఉంది. అంటే ఆ మేరకు కార్మికుల ఆదాయాలలో ఐదేండ్లుగా పెరుగుదల లేదు.
2016-17 2178.16 కోట్లు నెలకు 182 కోట్లు
2017-18 2253.00 కోట్లు నెలకు 188 కోట్లు
2018-19 2380.77 కోట్లు నెలకు 198 కోట్లు
2019-20 2361.00 కోట్లు నెలకు 197 కోట్లు
2020-21 2367.00 కోట్లు నెలకు 197 కోట్లు
గత 5 సంవత్సరాలుగా కార్మికులు జీతం కోసం పెడ్తున్న ఖర్చు పెరగకపోగా, స్థిరంగా ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే కార్మికుల పని గంటలు 8 గంటల బదులు 10, 12, 16 గంటలు పని చేయిస్తున్నారు. సింగిల్ క్రూ డ్యూటీలు ఓవర్ టైమ్‌ను కుదిస్తున్నారు. దూరప్రాంత సర్వీసులలో పని దినాలను తగ్గిస్తూనే ఉన్నారు. స్పేర్‌పార్ట్స్ లేక, పాత బస్లవి తీసి రిపేరు చేయమంటున్నారు. 6565 ఆర్టీసీ బస్సులలో 4000 బస్‌లకు పైగా కాలం చెల్లినవే అయినా 99.97శాతం బస్‌లను రోడ్‌పైన తిప్పేలాగా మెకానికల్ సిబ్బంది కృషి చేస్తున్నారు. 2014-15లో కొత్తటైరు 1.64 లక్షల కిలో మీటర్లు తిరిగితే, 2020-21 నాటికి 2.44 లక్షల కి.మీ. తిరిగేలా చేశారు. గత 2014-15 నుండి 2019-20 వరకు 70శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంది. 2014-15లో ప్రతి లక్ష కిలో మీటర్లకు 0.08 ప్రమాదాలు రికార్డు అయితే, 2017-21 మధ్య 0.06కే పరిమితం చేశారు. ప్రతి లీటరు డీజిల్‌కు 5.14 కి.మీ. తిప్పుతూ అనేక అవార్డులు పొందారు. క్యాన్సిలేషన్ 1.5శాతం నుండి 1.1శాతం తగ్గేలా చేశారు.
ముఖ్యమైనది కార్మికుని ఉత్పాదకత. 2016-17 వరకు 55 కి.మీ. ఉత్పాదకత ఉంటే, 2017-18లో 60 కి.మీ.కు, 2019-20లో 61కి పెరిగింది. దీనిని ఆర్థిక భాషలో చూస్తే కార్మికుడిపై ఎంత భారం మోపారో అర్థం అవుతుంది. 2017-18లో కిమీ అయిన ఖర్చు రూ.40.33లు. అంటే ఒక కార్మికుడు ఒక కిలో మీటర్ ఉత్పాదకత పెంచితే అతను రూ.40.33 ఖర్చు తగ్గించినట్లు. 2017-18 నాటికి కార్మికుని ఉత్పాదకత ఎంత? 49733×5×40.33 (కార్మికులు × పెరిగిన ఉత్పాదకత × కాస్ట్పర్ కిలో మీటరు) రోజుకి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 365 కోట్లు ఉత్పాదకతను సాధించి, ఖర్చును తగ్గించారు.
2018-19లో ఉత్పాదకత 60నుండి 61 కి.మీ. పెరిగింది. (49733× 1× 44.40×365) 80.59 కోట్లు ఉత్పాదకత సాధించారు. 2016-17, 2017-18లలో కలిపి 445.59 కోట్లు ఖర్చును తగ్గించగలిగారు. అది చాలదని ఇంకా పిండితే కార్మికులు పని చేయలేకపోగా, సంస్థకు లాభం కూడా జరుగదు. అలాగే 2015-16లో సగటు బేసిక్ ఫేర్ కి.మీ.కు 75.75 పైసలు ఉంటే 2019-20 నాటికి 106.21 పైసలుకు పెరిగింది. అందుకని ప్రయాణీకుల ఛార్జీలు పెంచడం కూడా సంస్థకు లాభదాయకం కాకపోగా, ప్రయాణీకులను ఆర్టీసీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వం ఆర్టీసీని లాభనష్టాల ప్రాతిపదికన కాకుండా విద్య, వైద్యం లాగా సామాజిక బాధ్యతగా చూసి అవసరమైన మేరకు నిధులు సమకూర్చి, ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలి. సంస్థ నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కార్మిక సంఘాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం వద్ద నిధులు తెచ్చేందుకు కృషి చేయాలి. సంస్థ అంతర్గత నిర్వహణలో ఏమైనా లోపాలు గమనిస్తే వాటిని సరిచేసుకొని ప్రజలకు విశ్వాసం కలిగేలా కృషి చేయాలి.
సంవత్సరం బస్‌పాస్‌ల ప్రభుత్వ హామీలోన్స్ ప్రభుత్వం నుండి వివిధ పద్దుల క్రింద ఎక్కువ
రాయితీల విలువ తిరిగి చెల్లించడం రావలసినది ప్రభుత్వం నుండి వచ్చినవి తక్కువ
2014-15 441.4 175.99 617.13 689.75 +72.62
2015-16 535.64 219.46 755.10 1113.03 +357.93
2016-17 553.71 254.82 808.53 752.15 -56.38
2017-18 560.59 311.87 872.46 776.84 -95.62
2018-19 644.42 306.05 950.47 898.57 -51.90
2019-20 712.10 170.72 884.95 924.40 +39.45
2020-21 260.70 129.72 409.09 1130.20 +721.11
3708.30 1568.63 5276.93 6284.97
- పుష్పా శ్రీనివాస్