Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ టైమ్స్ సెప్టెంబరు14, 2021న ప్రచురించిన వ్యాసంలో, భారత ప్రభుత్వం ప్రమాదకరమైన కోవిడ్ రెండవ దశలో సైన్సుకంటే రాజకీయాలకు ఏవిధంగా ప్రాధాన్యత నిచ్చిందో విపులంగా వివరించింది. ఈ వ్యాసం యువశాస్త్రవేత్త డాక్టర్ అనుప్ అగరవాల్ చేసిన పోరాటం ఆధారంగా రాయడం జరిగింది. ఆయన అత్యున్నతమైన శాస్త్రీయ ఆరోగ్య విభాగమైన ''ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్''(ఐసియమ్ఆర్)ను రెండవ దశను గూర్చి హెచ్చరిస్తూ, సూపర్ మోడల్‌గా పిలువబడే విధాన నిర్ణయాలు, దేశానికి ఆపదను కలిగిస్తాయని హెచ్చరికతో కూడిన అభ్యర్థనను చేశారు. అప్పటి నుండి డాక్టర్ అగరవాల్ దేశాన్ని వదలి వెళ్ళాడు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన వారిలో కేవలం అగరవాల్ ఒక్కరే కాదు, ఇతర శాస్త్రవేత్తలు, సైన్స్‌కు సంబంధించిన విభాగాలు, రెండవదశ రాబోతోందని హెచ్చరించాయి. కానీ ప్రభుత్వం తమిళనాడు, కేరళ, అసోం, పశ్బిమ బెంగాల్లో జరగబోయే ఎన్నికలపై దృష్టిని సారించింది. జనవరి2021న దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌లో మోడీ విజయాన్ని ప్రకటించిన తర్వాత, ప్రభుత్వ సంస్థలు దానికి భిన్నమైన ఏ సూచనలనూ వినడానికి సిద్దంగా లేవు. సహజంగానే మహమ్మారి వ్యాపిస్తుందని తెలిసికూడా, హరిద్వార్‌లో కుంభమేళాను అనుమతించారు.
ఏప్రిల్ 2021లో, రెండవ మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్న సమయంలో, వైద్యశాలలు తీవ్రమైన బెడ్స్, ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో కూడా మోడీ, అమిత్ షాలు బెంగాల్లో ఎన్నికల ప్రచారంలోనే నిమగమై ఉన్నారు. బెంగాల్లో వామపక్షాలు, ఇతర పార్టీలు బహిరంగ ప్రచారాన్ని విరమించుకున్న తర్వాత మోడీ తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. ఏమైనా, ఎలక్షన్ కమిషన్ దేశంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేనట్లుగా బెంగాల్లో ఎన్నికలను సుదీర్ఘ కాలం నిర్వహించడం వల్ల, మహమ్మారి ఆ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించడానికి దోహదపడింది. రెండవ దశ మహమ్మారిని ఏ విధంగా నిరోధించాలనే నిర్ణయాలలో శాస్త్రీయమైన చిత్తశుద్ధి లోపించింది.
భారతదేశంలో ప్రధానమైన సైన్స్ సంస్థలు తక్షణ రాజకీయాలకు ఏ విధంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నాయో న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. అది అంతర్గత విషయాలను ముందుకు తెచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏ విధమైన అధికారిక కథనాలను ప్రశ్నించవద్దని ఏవిధంగా నిరుత్సాహపరిచిందో కూడా వివరించింది. శాస్త్రీయమైన గొంతుకలు మూగబోయేలా క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అధికారిక కథనాలకు అనుకూలంగా మద్దతు ఇవ్వని పేపర్లను ముద్రించడానికి అనుమతి ఇవ్వకపోవడమే కాక, రద్దు చేశారు. కానీ శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రభుత్వ అసంతృప్తికి భయపడకుండా మహమ్మారి సమయంలో దానిని గూర్చి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం శత్రుత్వంతో వ్యవహరించినా, భారత వార్తా సంస్థలు గానీ, సాంప్రదాయ, డిజిటల్ ప్లాట్ ఫార్మ్ గానీ మోడీ ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారిని నిర్వహించిన తీరును, లోపాలను ప్రభుత్వానికి అయిష్టత ఉన్నప్పటికీ, విమర్శనాత్మక అభిప్రాయాలను కొనసాగించాయి. పీపుల్స్ డెమోక్రసీలో ''సైన్సు - అభివృద్ధి'' అనే శీర్షిక కూడా భాగస్వామి అయింది. ఈ కాలంలోనే ప్రజాసైన్స్ ఉద్యమం, జనస్వాస్థ్య అభియాన్ అనేక ప్రకటనలను ఇచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ వెలిబుచ్చిన మహమ్మారికి సంబంధించిన అనేక అంశాలను, ఆందోళనలను పై సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి.
ప్రధానమైన వైఫల్యం ఈ సమస్యను ప్రజారోగ్య, సాంక్రమిత రోగ విజ్ఞానానికి సంబంధించిన (అంటువ్యాధికి సంబంధించిన) సవాలుగా కాక, ఒక పరిపాలనా సంబంధమైన అంశంగా చూడడం. ఈవైఫల్యమే మొదటి దశ ఘోరమైన మహమ్మారిని అరికట్టడంలో లాక్డౌన్ వైఫల్యాలను ప్రతిబింబించింది. మే 25, 2020న వారి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మార్చి 25, 2020 నుండి మే 31, 2020 వరకు విధించిన లాక్డౌన్ అత్యంత కఠినమైనదని, అయినప్పటికీ కేసులు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయని, మార్చి 25న ఉన్న 600 కేసులు, మే 24కు ఒక లక్ష 38 వేల 845కు పెరిగాయని తెలిపారు. తరువాత వారు ప్రకటించిన విధంగా అసంబద్ధంగా, మార్పు చెందే ప్రణాళికలు, విధానాలు, ప్రధానంగా జాతీయ స్థాయిలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించలేక పోవడం, విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోవడం, విధాన రూపకల్పన చేసే వారి వద్ద నచ్చజెప్పగల్గే ప్రణాళికలు గానీ, వ్యూహాలు గానీ లేకపోవడంతో ఈపరిణామాలు సంభవించాయి.
కోవిడ్ విషయంలో నిరంతరం అసమర్థంగా చేస్తున్న పొరపాటు ఏమంటే, ఔషధాల విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసే ప్రతిపాదనలు. హైడ్రో క్లోరోక్విన్, ఇవర్ మెక్టిన్తో విరివిగా చేసే ప్రయోగాలు వారికి ఎలాంటి సమర్థత లేదని తెలుపుతున్నాయి. అయినప్పటికీ వారు ఈ నాటికి కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మే 17, 2021నాడు జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలను కొనసాగిస్తూ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన విధంగా ఆ రెండు ఔషధాలను కోవిడ్-19 చికిత్సకోసం అనుమతించారు. ట్రంప్, బోల్సనారో ప్రభావం మోడీపై ఉందని కూడా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఈ సమయంలో మోడీ ప్రభుత్వం సైన్స్ పట్ల వ్యవహరించిన తీరు ఏవిధంగా ఉన్నదనే దానికి రెండు కీలక అంశాలను ఉదహరించవచ్చు. మొదటిది, సూపర్ మోడల్‌గా చెప్తూ కోవిడ్-19పై పూర్తి విజయం సాధించినట్లు ప్రకటించడం. రెండవది ఈ సంవత్సరం ప్రారంభంలో, శాస్త్రీయమైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయడం. ఒక సమాచారం ప్రకారం మోడీ ప్రభుత్వం ఒక ప్రచార బందాన్ని ఏర్పరుచుకుంది. వారి పని ఏమంటే మహమ్మారిపై విజయం సాధించామని ప్రచారం చేయటం. డీయస్టీ(డే లైట్ సేవింగ్ టైమ్) సూపర్ మోడల్‌కు నాయకత్వం వహించే ముగ్గురు వ్యక్తులు ఒక పేపర్‌ను రచించి ఇండియన్ జనరల్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో ప్రచురించారు. దానిలో ఆశ్చర్యంగొలిపే అంశాలు. వారు 2019 చివరి భాగంలో కోవిడ్ మహమ్మారి క్షీణ దశలోకి ప్రవేశించిందని, ఫిబ్రవరి 21కి భారతదేశం నుండి అదృశ్యమవుతుందని చెప్పారు. భారతదేశంలో ఇంత క్రితమే 380 మిలియన్ ప్రజలకు వ్యాధి సోకిందని, సామూహిక నిరోధకశక్తి వైపునకు పయనిస్తోందని చెప్పారు.
ఈ నమూనా విధానం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఇది ఒకరకంగా విలువైన అంచనాలను మరుగు పర్చడమే. గతంలో క్రిష్టియన్ కళాశాల వైరాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న టి.జాకోబ్ జాన్ ప్రముఖ ప్రచురణ సంస్థ ''సైన్స్''తో మాట్లాడుతూ జాతీయ అంటువ్యాధుల నమూనాలు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. జాతీయ అంటువ్యాధులు అనేవి ఊహాజనిత లెక్కలు మాత్రమేనని, దానికి బదులుగా 100కంటే ఎక్కువ అంటువ్యాధులు విభిన్న రాష్ట్రాలలో, పట్టణాల్లో ఉన్నాయని, ఆయా కాలాల్లో అభివృద్ధి అవుతూ, తగ్గుతూ ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ విభాగాల లోపల వెలుపల, అనేక శాస్త్రీయమైన వాదనలు తెలియజేసేది ఏమంటే, సూపర్ మోడల్‌ను ప్రత్యేకమైన అధికారం కలదిగా ప్రచారం చేస్తూ, ప్రభుత్వం ఏమి వినదల్చుకున్నదో లేక ప్రజలకు ఏమి వినిపించదల్చుకున్నదో చెప్పే విధానం ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది..
వ్యాధిని వ్యాప్తి చేస్తూ రూపాంతరం చెందే లక్షణంతో మనమిప్పుడు డెల్టా వేరియంట్‌గా పిలిచే సార్స్ కోవిడ్-2 అభివృద్ధిని గూర్చి మోడీ ప్రభుత్వానికి మార్చి 2021న మరొక్కమారు ముందుగానే హెచ్చరికలు అందాయి. అయినప్పటికీ ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదు. కోవిడ్‌కు సంబంధించి ప్రమాదకరమైన కేసులలో అత్యంత ప్రధానమైన వైద్యానికి అవసరమైన ఔషధం, ఆక్సిజన్‌ను ఎందుకు సరఫరా చేయలేదు. దీనికి బదులుగా పబ్లిక్ ర్యాలీలు, ప్రజలతో ఊరేగింపులు, లైట్లు వెలిగించడం ఎన్నికల సందర్భంలో బీజేపీ నాయకులను ఎక్కువ రాష్ట్రాలను సందర్శించడానికి అనుమతించడం, అనేక ఊరేగింపులనుద్దేశించి ప్రసంగించడానికి అనుమతించడం, కోవిడ్-19 సందర్భంలో వేదికలపై గాని, ఊరేగింపులలో గాని ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు.
న్యూయార్క్ టైమ్స్ నివేదికలు, మనకు తెలిసిన విధంగానే సైన్స్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ధృవీకరించాయి. రాయిటర్స్‌కు చెప్పబడిన, రెండు శాస్త్రీయమైన ఆలోచనల గురించి చెప్పి ముగిస్తాను. విధానాలను నిర్ణయించడంలో సైన్స్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని తాను ఆందోళన చెందుతున్నానని, సైంటిఫిక్ సలహా బృందానికి అధ్యక్షుడైన షాహిద్ జమీన్ తెలిపారు. డైరెక్టర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీకి అధిపతి అయిన రాకేష్ శర్మ దేశంలోని శాస్త్రీయ సమాజాన్ని నిరాశకు గురి చేశారని తెలిపారు. సైన్సుకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే మనం మరింత మెరుగ్గా పని చేయగలిగే వాళ్ళం. మనం గమనించిన అంశమే మంటే.. ఏచిన్న అవకాశం ఉన్నా మనం సక్రమంగా వినియోగించకో గలిగి ఉండే వాళ్ళం. మోడీ ప్రభుత్వం వల్ల దేశంలో బలైన వాటిలో శాస్త్రీయ విజ్ఞానం కూడా ఒకటి.
(''పీపుల్స్ డెమోక్రసీ'' సౌజన్యంతో)
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
- ప్రబీర్ పురకాయస్థ
9490300111