Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని మోడీ సర్కారు అనేక అంశాల్లో దంద్వనీతికి పాల్పడుతుండటం ఇటీవల కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజలను విభజించి పాలించి తమ హిందూత్వ రాజ్యస్థాపనకు అడుగులేస్తున్నది. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కులగణన చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2021 వచ్చేసరికి అధికారంలో బీజేపీనే ఉన్నా, ఇప్పుడు కులగణన చేయలేమని సుప్రీంకోర్టుకు చెప్పడం ద్వంద ప్రమాణాలు పాటించడమే. కులగణన ద్వారా ఐక్యత చెదిరిపోతుందనీ, అది హిందూత్వ రాజ్యానికి ఆటంకంగా మారుతుందనే భయంతోనే కులగణనకు కేంద్రం మొకాలడ్డుతున్నది. సాంకేతికత, సంక్లిష్టత పేరుతో పేదల ఉనికిని ప్రశ్నార్థకం చేసే దిశగా నడుస్తున్నది. సంక్షేమ రాజ్యం స్థానంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూత్వకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండటం గమనార్హం.
- బి.బసవపున్నయ్య