Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు అందరి బతుకమ్మ ఒక్కటే. ఒక్కటే పాట..ఆట. కాలం మారింది. ఇప్పుడు ఎవరి బతుకమ్మ వారిదే అయింది. ఆ బతుకమ్మ పాట తమ ప్రచారానికి ఆయుధమైంది. తమ గొప్పలు చెప్పుకునేందుకు, ప్రత్యర్థులను ఎండగట్టేందుకు అస్త్రమైంది. గత కొన్ని రోజులుగా బతుకమ్మ పాటలతో రాష్ట్రం మారుమోగింది. ప్రకృతిని ఆరాధించే పండుగను సైతం రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలను విమర్శించేందుకు ఉపయోగించుకున్నారు. బతుకమ్మ పాటలను వినే ప్రజల ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలను అన్ని పార్టీల నాయకులు అందిపుచ్చుకున్నారు. ధరల పెరుగుదల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ల వరకు, ఇంట్లో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిన దగ్గర నుంచి నల్లచట్టాలతో రైతులకు కలిగే ఇబ్బందుల వరకు పాటలతో కడిగి పాడేశారు. కూర్చున్న చోటే ఆయా పార్టీల వారి విధానాలు, పాలకులు అమలు చేస్తున్న కార్యక్రమాలు సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన భాషలో సాగిన పాటలివి. పాటలకొస్తున్న క్రేజీతో ఇవి హుజురాబాద్ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారాయి. అయితే నర్మగర్భంగా అన్ని పార్టీల బతుకమ్మ పాటలు వింటున్న ప్రజలు మాత్రం ఏ పార్టీ బతుకును ఏమి చేస్తారో వేచి చూడాలి.
-కె.ప్రియకుమార్