Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్మల్ని కాపాడాలనుకునే
పర్యావరణ పరిరక్షకులపై దాడి జరుగుతుంటే
ఎవరూ నోరెత్తరే
చెట్లంటే ప్రాణ దాతలనే
నిజం తెలుసుకదా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న
హత్యాకాండను గర్హించరేం
మీకు నీడ నిస్తున్నా
మీ పిల్లలు మా కొమ్మలకుయ్యాలలాడుతున్నా
పండ్లను అనుభవిస్తున్నా
కలపను పరికరాలుగా
కాటిలో బూదిగా
ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందుతున్నారే కానీ
మా విధ్వంసాన్ని అడ్డుకోరే
మాకు రక్షణలేదు
మా రక్షణకోరే వారిని సైతం
రక్షించరేం
మా ఘోష వినిపించుకోండి
ఇకనైనా రక్షణకు
నడుము కట్టండి
లేదా మానవజాతి వినాశాన్ని
మీరు ఆహ్వానించినట్టే
తస్మాత్ జాగ్రత్త!
- కపిల రాంకుమార్
9849535033