Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మహిళలు ఎక్కడ గౌరవింపబడరో.. పూజింపబడరో.. ఆ సమాజం ఎన్నటికీ అభివృద్ధి చెందదు'' టిఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాటలివి. మహిళలు చైతన్యవంతులై ముందుకొస్తే ఎదిగేందుకు అవకాశాలు ఇవ్వాలనీ, ఆ దిశగా టీఆర్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందనీ చెప్పారు. మంచి మాటే. అది నిజమే. కానీ ఆచరణ ఏది. గొప్పగా మాటలు ఎన్నైనా చెప్పొచ్చు గాని అమలు అవుతుందనుకోవడం ప్రశ్నార్థకమే. అదే ప్లీనరీలో ఓ మహిళ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని టీఆర్ఎస్ నేత మోసం చేశాడనీ మూడు లక్షలు వసూలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ ప్లీనరీ సాక్షిగా సీఎం కేసీఆర్కు చెప్పుకుందామని వస్తే నిరాశే ఎదురయింది కదా. ఇక మహిళకు గౌరవం ఎక్కడీ మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆమె ప్లీనరీ వేదిక వరకు రాగలిగింది కానీ, పోలీసులకే సీఎంకు తన సమస్య చెప్పుకుంటానని ఎంత వేడుకున్నా కనికరం కలగలేదు. మహిళల గురించి సీఎం గొప్పగా చెప్పటాన్ని అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో పోలీసులు ఆమెను నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించడాన్ని ఏమనాలి? ఈ తతంగం ఎమ్మెల్యే గ్యాలరీ పక్కనే జరుగుతున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నీతులు ఏన్నయినా చెప్పొచ్చు గానీ పాలకులు ఆచరణలో పెట్టరనేది ఈ విషయం ద్వారానే అవగతమవుతోంది.
-అచ్చిన ప్రశాంత్