Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టుల ప్రాణత్యాగాలు, త్యాగనిరతి, సేవాగుణం, పోరాటాల చరిత్రను జైభీమ్ సినిమాలో గొప్పగా చూపించారు. కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగా ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అనేకాంశాల్లో ప్రపచానికి దిశా నిర్దేశం చేస్తున్న ఆయా పార్టీల ప్రభావం తగ్గుదున్నదంటూ నోరు పారేసుకుంటున్న మతోన్మాదులు, కులోన్మాదులకు కనీసం ఇప్పుడైనా కనువిప్పు కలగాలి. కమ్యూనిస్టుల చరిత్ర గురించి, వారి అమోఘ పోరాటాల గురించి తెలియని, నేటి తరానికి ఈ సినిమా ఒక దిక్సూచి. హీరో సూర్య ప్రముఖ పాత్ర పోషించిన ఈ సినిమాలో అంతర్లీనంగా కమ్యూనిస్టు పార్టీల త్యాగాలు, వారి సమరశీలత దాగున్నాయి. వామపక్ష భావజాలానికి ప్రభావితమైన ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు. ఉద్యోగులు అణగారిన వర్గాలకు సేవ చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితుల వెంట ఉండి పోరాడుతున్నారు కమ్యూనిస్టులు. ఈ కథాంశాన్నే ఇతి వృత్తంగా తీసుకుని తీసిన సినిమాయే జైభీమ్. ఇదిప్పుడు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటున్నది. అందుకే మనందరమూ తప్పక చూడాల్సిన సినిమా జై భీమ్.
-గుడిగ రఘు