Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాపార సమూహాల్లో బిజినెస్ కమ్యూనిటీ (పెద్ద వ్యాపార వ్యవస్థలు), ట్రేడ్స్‌మెన్ (చిరు వ్యాపారులు), వెండర్స్ (వీధి వ్యాపారులు) అనబడే మూడు వర్గాలుగా వర్గీకరించారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా మహావిపత్తుతో ఇండియాలో ఏర్పడిన ఆర్థిక నష్టాలు, కుదుపులతో పలు రకాల బిజినెస్ (వ్యాపార వర్గాలు) చేస్తున్న ప్రజలు కరోనా లాక్డౌన్లు (25 మార్చి నుంచి 31 మే 2020 వరకు), క్రమశిక్షణలతో నష్టాల పాలుకావడంతో 2019లో 10,677 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2020లో 11,716 మంది బలవంతంగా మరణించారని తేలింది. వీరిలో ట్రేడ్స్‌మెన్ వర్గాల ప్రజల ఆత్మహత్యలు 50శాతం పెరిగాయని, రైతుల కన్నా వ్యాపారులే అధికంగా జీవితాలను చాలించుకున్నారని ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (యన్‌సిఆర్‌బి) విడుదల చేసిన 'ఇండియాలో నేరాలు-2020 (క్రైమ్స్ ఇన్ ఇండియా-2020)' 68వ నివేదిక (1953 నుంచి ప్రతి ఏట) తెలియ జేస్తున్నది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 19 మెట్రో నగరాలు (20 లక్షల జనాభా మించినవి), 34 మెట్రో నగరాల (10 లక్షల జనాభా దాటినవి) నేర వివరాలను యన్‌సిఆర్‌బి క్రోడీకరించి ఇటీవల విడుదల చేసింది. బిజినెస్ వర్గాల 11,716 ఆత్మహత్యల్లో 4,356 ట్రేడ్స్‌మెన్, 4,226 వెండర్స్, మిగిలిన ఆత్మహత్యలు ఇతర వ్యాపార వర్గాల వారు ఉన్నారు. 2019తో పోల్చితే 2020లో వ్యాపార వర్గాలు 29శాతం, ట్రేడ్స్‌మెన్ వర్గాలు 49.9శాతం అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 2019లో ట్రేడ్స్‌మెన్ 2,906 ఆత్మహత్యలు రికార్డుకాగా, 2020లో 4,356 మంది (49.9 శాతం) మరణించారు. 2020లో మొత్తం వ్యాపార వ్యవస్థలో 10శాతం ఆత్మహత్యలు పెరగడం గమనించారు. కోవిడ్-19 కోరల్లో చిక్కిన ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వ్యాపారాలు నడవక, నష్టాలను చవిచూస్తూ, రుణాలు కట్టలేక ఆఖరు అస్త్రంగా ఆత్మహత్యలకు పూనుకున్నారని యన్‌సిఆర్‌బి నివేదిక తెలియజేస్తున్నది. చిరువ్యాపారులు కరోనాతో పూర్తిగా చితికి పోయారని, రైతుల ఆత్మహత్యల కన్న ఈ వర్గాలు అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించింది.
2020లో మొత్తంగా 1.92 ఫిర్యాదుల్లో, 66 లక్షల నేరాలకు యఫ్ఐఆర్ నమోదు అయ్యాయని, 2019తో పోల్చితే 28శాతం (52 లక్షలు) నేరాలు పెరిగాయని తెలుస్తున్నది. ఒక లక్ష జనాభాకు 2019లో 386 నేరాలు నమోదుకాగా, 2020లో 488 నేరాలు గమనించబడ్డాయి. అధిక కేసుల్లో మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్ వర్గాలు ఉండగా, దోపిడీ, దొంగతనాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2019తో పోల్చితే 2020లో హత్యలు ఒక శాతం, యస్సీలపై నేరాలు 9శాతం, యస్టీలపై 9శాతం, శాంతి భద్రతల నేరాలు 12శాతం, పర్యావరణ నేరాలు 78శాతం పెరిగాయని తెలుస్తున్నది. అదే విధంగా 2019తో పోల్చితే 2020లో కిడ్నాపులు 19శాతం, మహిళలపై నేరాలు 8శాతం, పిల్లలపై 13శాతం, బాలల నేరాలు 8శాతం, వృద్ధులపై నేరాలు 11శాతం, ఆర్థిక నేరాలు 12శాతం, లంచగొండి నేరాలు 27శాతం, సైబర్ క్రైమ్స్ 12శాతం, ఆస్తి తగాదాలు 27శాతం, విదేశీయులపై నేరాలు 53శాతం, మానవ అక్రమ రవాణ 22శాతం, మిస్సింగ్ కేసులు 15శాతం, ఆస్తులపై దాడులు 25శాతం తగ్గడం గమనించారు. గత ఏడాదితో పోల్చితే 2020లో మత అల్లర్లు 96శాతం, కుల ఘర్షనల్లో 50శాతం, వ్యవసాయ గొడవల్లో 38శాతం, ఆందోళన ఘర్షనల్లో 33శాతం, గ్రూపు తగాదాల్లో 70శాతం నేరాలు పెరగడం గమనించారు. యూపీలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంస కేసుల్లో పెరుగుదల గమనించబడింది. ఇండియాలో రోజుకు సగటున 80హత్యలు, అత్యధికంగా యూపీలో నమోదు అవుతున్నాయి.
మెట్రో మహానగరాల్లో నేరాలు/కేసుల వివరాలు:
జనాభా 20 లక్షలు దాటిన 19 మెట్రో నగరాల్లో అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఢిల్లీ, ఘాజుయాబాద్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పూనె, కాన్పూర్, కొచ్చి, కోలకత్తా, కోజీకోడ్, లక్నో, ముంబారు, నాగపూర్, పాట్నా, సూరత్‌ల నేర వివరాలను అధ్యయనం చేశారు. నగరాల్లో 2019తో పోల్చితే 2020లో నేరాల సంఖ్య 7.6శాతం, మహిళలపై 21శాతం, పిల్లలపై 29శాతం, బాలల నేరాలు 13శాతం, వృద్ధులపై 17శాతం, యస్స్సీలపై 11శాతం, యస్టీలపై 14శాతం, ఆర్థిక కేసులు 21శాతం తగ్గడం గమనించారు. వీటిలో హత్యలు 8.3శాతం, కిడ్నాపులు 30శాతం, ఆస్తి ధ్వంసం 28శాతం తగ్గడం గమనించారు. పబ్లిక్ శాంతి భంగ కేసులు 14శాతం, సైబర్ క్రైమ్స్ 1శాతం పెరగడం జరిగింది. సైబర్ నేరాలు బెంగుళూరులో అత్యధికంగా ఉండడం గమనించారు. ఫేక్ కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లో 208 నమోదు అయ్యాయి. పూనెలో వద్ధులపై కేసులు, యూపీలో యస్సీ/యస్టీ కేసులు అత్యధికంగా గమనించబడ్డాయి. క్రైమ్ రేటు (లక్షకు) తమిళనాడులో గరిష్టంగ 1809, కనిష్టంగా 69 రికార్డు అయ్యింది.
తెలుగు రాష్టాల్లో నేరాల/కేసుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జనాభా 5.26కోట్లు, తెలంగాణ జనాభా 3.75కోట్లు, హైదరాబాదు జనాభా 78లక్షలుగా అంచనా వేశారు. రాష్ట్రాల సగటు ఐపిసి చార్జిషీట్ నేరాల రేటు లక్షకు 80 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 89, తెలంగాణలో 84 నమోదైనాయి. రాష్ట్రాల యస్యల్యల్ నేరాల సగటు రేటు 94 ఉండగా, ఏపీలో 96, టియస్లో 81 ఉన్నది. ఫేక్ కేసుల రేటు అత్యధికంగా తెలంగాణలో 273 నమోదైంది.
- డాక్టర్ బుర్ర మధుసూదనరెడ్డి
సెల్:9949700037