Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అశోక్ సింఘాల్ నేతృత్వంలోని నాల్గవ వేతన సంఘం తన నివేదికలో పెన్షన్ గురించి ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. ''వృద్ధాప్యంలో సంపాదనాశక్తిలేక, ప్రమాదవశాత్తు లేక మరి ఏ ఇతర విధంగానయినా అంగవైకల్యం చెంది, జీవించలేని పరిస్థితులలో ఆర్థిక తోడ్పాటును అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో పెన్షన్ చెల్లించబడింది. సామాజిక భద్రత కల్పించుటకు ఆర్థికంగా నిలబడటానికి, అతను జీవించ డానికి పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది.''
భూస్వామ్య వ్యవస్థ నుండి సంక్షేమ రాజ్యంగా సమాజం మార్పుచెందిన కాలంలో సోషలిస్టు ఆలోచనలతో, వృద్ధాప్యంలో భద్రత కోసం, గత సేవలకు బహుమతిగా పెన్షన్ చెల్లించబడింది. వృద్ధాప్యంలో పదవీ విరమణ చెందిన తదుపరి ఆర్థికంగా ఉద్యోగికి సహాయపడే ఉద్దేశ్యంతో చెల్లించబడింది.
మన దేశ స్వాతంత్య్రానంతరం దేశంలోని పెన్షనర్లు, పెన్షనర్ల సమస్యలు, పెన్షన్ నిర్మాణంలో సానుకూలమయిన మార్పులను జాతీయ ప్రభుత్వం చేస్తుందని ఆశించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు సరికదా, దానికి బదులుగా బ్రిటిషు ప్రభుత్వం యొక్క వైఖరినే అనుసరించారు. పెన్షనర్లు నిర్లక్ష్యం చేయబడ ినారు. సమాజంలో అనవసర, ఉత్పాదకతలేని వర్గంగా, ప్రభుత్వానికి ఆర్థిక భారం కలిగించే తలనొప్పిగా ప్రభుత్వం భావించింది. పెన్షనర్ల సమస్యలను ప్రాధాన్యతా జాబితాలోకాకుండా, అతి తక్కువ స్థానంలో ఉంచారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366(17)లో పెన్షన్హక్కును అంగీకరించి నప్పటికీ 1932 వరకు పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 1982లో గౌరవ సుప్రీంకోర్టు భారత దేశంలో పెన్షన్ హక్కును సమర్థించింది. నకారా కేసులో 17.12.1982న భారత సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల గౌరవ రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమయిన తీర్పుఇచ్చింది.
ఈ చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుతో ప్రేరణ పొందిన పెన్షనర్స్ అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ జేసీఎం స్టాఫ్సైడ్ కూడా సుప్రీంకోర్టు తీర్పు యొక్క ప్రాముఖ్యతను గుర్తించాయి. నేషనల్ కౌన్సిల్ జేసీఎం స్టాఫ్సైడ్, పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్ సంయుక్త డిమాండ్ అయిన పెన్షన్ సవరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇతర పెన్షనరీ ప్రయోజనాల గురించి 1, 2, 3వ వేతన సవరణలలో చేర్చని విధంగా 4వ వేతన సంఘం నియమ నిబంధనలలో కూడా చేర్చకపోవటంవల్ల వాటిని చేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసాయి.
తదుపరి ''డిసిఆర్జితో సహా ఇప్పటికే ఉన్న పెన్షన్ నిర్మాణాన్ని పరిశీలించడం, అవసరమైన, ఆచరణ యోగ్యమయిన సిఫార్సులు చేయమని నిబంధనలలో చేర్చారు.''
సుప్రీంకోర్టు మాజీ జడ్జి రత్నవేల్ పాండియన్ నేతృత్వంలోని అయిదవ కేంద్ర వేతన సంఘం ''పెన్షన్ అనేది వాయిదాపడ్డ వేతనం. పెన్షన్ వారి చట్టబద్ధమైన విడదీయరాని, అమలుచేయగల హక్కు. ఇది వారి యొక్క స్వేదంతో, కష్టించి సంపాదిం చినది'' అని పెన్షన్ విషయంలో పేర్కొంది.
1971లో సుప్రీంకోర్టు డియోకినందన్ ప్రసాద్ వర్సస్ బీహార్ రాష్ట్రంకు సంబంధించిన కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 31(1) ప్రకారం, పెన్షన్ అనేది ఒక ఆస్తి అని ప్రకటించింది. కేవలం కార్యనిర్వహణ ఉత్తర్వుల ప్రకారం, దానిని నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు లేదని కూడా పేర్కొంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించిన పర్యవసానంగా నాలుగు, అయిదవ కేంద్ర వేతన సంఘం సూచనల ప్రకారం పెన్షన్, పెన్షనరీ ప్రయోజనాల సవరణకు సవరించిన నిబంధనలను చేర్చాలని ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. ఆరవ కేంద్ర వేతన సంఘం జనవరి 2004 ఒకటో తేదీ ముందు నియామకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణాన్ని పరిశీలించమని సూచించే విధంగా విధి విధానాలు సవరించబడ్డాయి. ఈ విధంగా 1.1.2004 తర్వాత జాయిన్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆరవ వేతన కమిటీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించబడ్డారు. 1.1.2004 తర్వాత సర్వీసులో జాయిన్ అయిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాల అమలు ఫలితంగా, పెన్షన్‌పై దాడులు ప్రపంచవ్యాప్తంగా మొదలయినాయి. భారత ప్రభుత్వం కూడా ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క అంతర్జాతీయ ఆదేశాలను అనుసరించింది. పూర్వపు బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలోని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో 2001-2002 కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ప్రవేశించే కొత్తవారికి నిర్వచించిన పెన్షన్ ప్రయోజనానికి బదులుగా నిర్వచించిన షేర్ ఆధారంగా నూతన పెన్షన్ వ్యవస్థ కోసం రోడ్‌మ్యాప్‌ను అందించడానికి 25 జూన్ 2001న ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. ''పెన్షన్ సంస్కరణలపై భట్టాచార్యకమిటీ'' అని పిలువబడే ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా బీజేపీ ప్రభుత్వం 1.1.2004న లేదా తరువాత ఉద్యోగ నియామకాలు పొందిన వారికి కొత్త పెన్షన్ పేరుతో 17.12.2003న ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులకు శాసనసభ అనుమతి ఇవ్వడానికి భారత ప్రభుత్వం 2004 డిసెంబరు 4న న్యూపెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు పార్లమెంటులో ఆర్డినెన్స్ జారీచేసింది. భారతదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించాయి. పార్లమెంటులో ఆ చట్టాన్ని ఆమోదించడానికి యూపీఏ ప్రభుత్వం పదేపదే చేసిన ప్రయత్నం అప్పటి ప్రభుత్వానికి మద్దతిస్తున్న వామపక్షాల వ్యతిరేకతవలన సాధ్యంకాలేదు. చివరగా వామపక్షాల మద్దతు లేని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ ఫండ్ రెగ్యురేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటి యాక్టు (పీఎఫ్ఆర్డీఏ) 2013 సెప్టెంబరు 18న పార్లమెంటులో ఆమోదించబడింది.
పిఎఫ్ఆర్డిఏ చట్టం యొక్క క్లాజు 12(5), సబ్ సెక్షన్ 3 యొక్క క్లాజ్ 'సి' ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ ద్వారా ఈ చట్టంను మరే ఇతర పెన్షన్ పథకానికి మినహాయింపు, నోటిఫై చేసిన ఇతర పెన్షన్ పథకాలతో సహా పొడిగించవచ్చు. అనగా దానికోసం పార్లమెంటు లో ప్రత్యేక చట్టం ఏదీ చేయనవసరంలేదు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆరవ వేతన సంఘం ఛైర్మెన్ రిటైర్డ్ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీకి ప్రభుత్వం యొక్క మొత్తం పెన్షన్ బాధ్యతను గణనీయంగా తగ్గించటానికి పాత పెన్షన్ స్కీమ్(ఓపిఎస్) కింద వచ్చే ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్ బాధ్యతను స్వయంగా సమకూర్చుకోడానికి అవసరమైన సూచనలను అమలుకోసం అంచనావేయమని కోరింది. ''ఒకవేళ వారి మొత్తం పెన్షన్ బాధ్యత అంటే... ఓపీఎస్ పెన్షనర్లు, ఓపీఎస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ఫండ్ నుండి పెన్షన్ పొందే అవకాశం లేకుండా పాత పెన్షన్ పథకం పరిధికి వచ్చే పెన్షనర్లు, ఉద్యోగులను నిధుల పెన్షన్ పథకం క్రిందకు తీసుకువచ్చుటకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వారు పిఎఫ్ఆర్డిఏ చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా కొనసాగబడతారు. అనగా వారి పెన్షన్ వాటా షేర్ మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి చెల్లించబడుతుంది. షేర్ మార్కెట్లో పెన్షన్ ఫండ్ పతనం అయితే వారి పెన్షన్ చెల్లింపునకు గ్యారంటీలేదు. 30 సంవత్సరాల వయసు నిండినప్పుడు అదనపు పెన్షన్, పదవీ విరమణ తర్వాత, మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్, పే కమిషన్ల సిఫార్సుల ఆధారంగా పెన్షన్ పునరుద్ధరించబడానికి కూడా అర్హులు కారు. అవకాశంలేదు.
పాత పెన్షన్ విధానం నుంచి నూతన పెన్షన్ విధానం వర్తించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాంఘిక భద్రత ప్రమాదంలో పడింది. ఈ నయా ఉదారవాద పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, పెన్షనర్లను సమీకరించి పోరాడాలి.
- ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్