Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 12 నెలలుగా గడ్డకట్టే చలిలో, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, సొంత ఊరు వదిలిపెట్టి లాఠీ దెబ్బలు తింటూ ఈ దేశ ప్రజల ఆకలి తీర్చడం కోసం, ఆహార భద్రత కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరం నవంబర్ 26న మొదలైన రైతు ఉద్యమం ఈ నవంబర్ 26 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అయితే ఇంత వరకూ రైతుల ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. అవసరమైతే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల దాకా ఉద్యమం కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. భారతదేశం మౌలికంగా వ్యవసాయ ఆధారిత దేశం. నూటికి 70శాతం మంది ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం మన ఆర్థిక వ్యవస్థకు ఇరుసు, ఆక్సిజన్ వ్యవసాయమే. ఇంతటి ప్రాధాన్యత గల ఈ వ్యవసాయ రంగాన్ని దేశ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విధానాలు చేపట్టారు. రైతు వ్యతిరేక విధానాలు రానురాను తీవ్రమై నేటి ఈ దుస్థితికి దారితీసింది. దేశానికి అన్నం పెట్టే రైతులు 12 నెలలుగా రోడ్లపై నిలబడి పోరాడుతున్నారు.
2020 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన మోడీ దేశ ప్రజల ఆహార, ఆరోగ్య భద్రత, జీవించే హక్కులను కాలరాసే దుర్మార్గపు చట్టాలు తీసుకొచ్చారు. ఈచట్టాల ద్వారా ఆదానీ, అంబానీ లాంటి బడా బాబులకు ఈ దేశ ప్రజల సర్వం దోచిపెట్టాలని పూనుకున్నారు. ఎందుకంటే భారతీయ వ్యవసాయ రంగాన్ని ఈ బడా బాబుల చేతిలో పెడితే ప్రజలకు ప్రాథమికంగా జీవించడానికి అవసరమైన ఆహారాన్ని నియంత్రించవచ్చు. అలాగే విత్తనాలను నియంత్రిస్తే భూమి మీద జీవాన్నే నియంత్రించవచ్చు. తద్వారా మొత్తం సమాజాన్ని నియంత్రించి, తమ గుప్పిట్లో పెట్టుకొని, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవచ్చనేది కార్పొరేట్ల వ్యూహం. ఈ కుట్రకు వత్తాసు పలికే యంత్రాంగమే ఈ మోడీ ప్రభుత్వం. ఈ చట్టాలు అమలులోకి వస్తే మొత్తం వ్యవసాయం, నదులు, అడవులు, చెట్లు, భూగర్భ జలాలు, ఖనిజాలు మొత్తం సమస్త ప్రకృతి సంపదను కార్పొరేట్లు కొల్లగొడతారు. తద్వారా ఈ దేశ ప్రజల జీవించే హక్కును కాలరాస్తారు. ఇక ప్రజలకు మిగిలేది ఆకలి చావులే. మోడీ ఈ రెండున్నర ఏండ్ల పాలనలో 39వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.1998 నుండి రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్య కృత్యమైనాయి. దీనికి తోడు విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలు ప్రయివేటీకరణ చేయ బడ్డాయి. వీటి మీద కూడా రైతులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇటు పెరిగపోతున్న ఖర్చులు, వ్యవసాయ సంక్షోభం, కరోనా విలయతాండవం కారణంగా మొత్తం వ్యవస్థే ఒక విష వలయంలో చిక్కుకున్న వేళ ఈ నల్ల చట్టాలు రైతులపై మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా భూమి నుంచి రైతును దూరం చేయడానికి వచ్చాయి. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగి యువత పొట్టచేత పట్టుకొని నగరాలకు అడ్డ కూలీలుగా వలసపోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. కరోనా విలయం 20 కోట్ల మంది ప్రజలు వలస కూలీల రూపంలో నిరాశ్రయులైన విషయం బయట ప్రపంచానికి చాటింది. 2020 ఏప్రిల్‌లో లాక్డౌన్ సమయంలో వలస కూలీల సంక్షోభం కళ్ళారా చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. ఇలాంటి స్థితిలో ప్రజలకు తిండి పెట్టే వ్యవసాయ రంగం బడా బాబుల చేతిలోకి పోతే కలిగే దుష్ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల అవసరాలకు కాకుండా వ్యాపారం, లాభాల కోసం చేయబడతాయి. దేశీయ అవసరాల కొరకు ఆహార పంటలు పండించకుండా, ఎగుమతుల కొరకు వాణిజ్య పంటలు సాగుచేయబడతాయి.
వ్యవసాయం కార్పొరేట్ బహుళజాతి కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. పెట్టుబడిదారీ విధానంలో వ్యాపారం తప్ప మానవీయతకు తావు ఉండదు. విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వలన భూమి నిస్సారమైపోతుంది. జన్యు మార్పిడి పంటల ద్వారా నేల, నీరు, గాలి కలుషితం అవుతాయి. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. క్యాన్సర్, కరోనా లాంటి కొత్త కొత్త వ్యాధులు విజంభిస్తాయి. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆహార, ఆరోగ్య భద్రతలు దెబ్బతింటాయి. మానవ నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాలలో వ్యవసాయం నుంచే పుట్టినాయి. వ్యవసాయం చేయడం ఒక సజనాత్మక జీవన విధానం. ప్రాణాధార భూ వనరులు బడా బాబులకు అందించడం అంటే ఆకలిని సష్టించడమే.
ఇప్పటికే దేశంలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఈ ఆకలి మరింత తీవ్రమవుతుంది. ఈ అన్యాయపు చట్టాలు ప్రజల ఆహార భద్రత, జీవించే హక్కును కాలరాస్తాయి. ఇవి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును (ఆర్టికల్ 21) హరించే చట్టాలు. ఇవి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలు జీవించే సహజమైన మౌలిక హక్కును హరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. కాబట్టి ఈ చట్టాలు చెల్లవు. ఇక్కడ మనుషులు బతకాలి అంటే పోరాడాల్సిందే. ఆ మట్టి చేతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిందే. మోడీ రైతు వ్యతిరేక విధానాలను ఓడించాల్సిందే.
అందుకే రైతన్నలు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. కానీ ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు .రైతుల ఆందోళనలను చిన్నచూపు చూస్తూ, బల ప్రయోగంతో అణచాలని చూస్తున్నది. ఇందులో భాగమే హర్యానాలోని కర్నాల్ ఘటన. ఈ ఘటనతో ఉద్యమాన్ని ఉధతం చేసే క్రమంలో యుపిలోని ముజఫర్ నగర్లో సెప్టెంబర్ 5న జరిగిన రైతుల మహా పంచాయత్ విజయవంతం అయింది. వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ బడా బాబులకు అందిస్తున్న సేవలను రైతులు అర్థం చేసుకున్నారు. 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన మత కలహాల ఆసరాగా 2017లో యోగీ సర్కార్ యుపిలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ముస్లింల మీద దాడి చేసినవారే ఇప్పుడు రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ కుట్రలు ఎంత ప్రమాదకరమో రైతులు గ్రహించారు. ఈ నల్ల చట్టాలు అన్ని మతాల వారి జీవించే హక్కును హరిస్తాయని గుర్తించారు.
అందుకే ఈ పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యతా నినాదాలు హౌరెత్తుతున్నాయి. బీజేపీ హిందూత్వ విధానాలు బడా బాబుల ప్రయోజనాల కోసమేనని రైతులే కాక మిగతా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఈ మహా ఉద్యమం దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనని రైతులు ప్రకటించారు. ఇక్కడ మంచి పరిణామం ఏమిటంటే రాబోయే ఎన్నికలలో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని, ఓడించాలని రైతులు పిలుపునిచ్చారు. దేశంలో కొన్ని చోట్ల మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఆచరించారు. ఇది నూతన రాజకీయ సంస్కృతికి దారి కావాలి. రేపటి నవ భారత నిరాఅవార్డుకైనా రివార్డుకైనా అర్హత ఉండాలి
పద్మశ్రీ అవార్డు గ్రహితలే పోరాడి సాధించుకున్న భారత స్వాతంత్య్రాన్ని ఒక భిక్షగా కించపరుస్తుండటం ఓ మహా విషాదం. ఆ పోరాటంలో క్షమాభిక్ష కోరిన వారి వారసుల నుంచి అంతకన్న ఏం ఊహించగలం. సాగు చేసిన వారికి కదా సాధకబాధకాలు తెలిసేది. ప్రాణత్యాగాల ఫలితమైన వలస పాలన విముక్తికి పార్లమెంటరీ వ్యవస్థలో పదవులకూ తేడా తెలియని తెరమీది ముఖాలే ప్రముఖులు అయినప్పుడు ఈ దుస్థితి దాపురిస్తుందేమో! పద్మశ్రీ అవార్డు పొందిన మైకంలో, మైకులో ఏమైనా మాట్లాడొచ్చు అనుకున్నారేమో, నటి కంగనా రనౌత్ ఏ కంగా దేశ స్వాతంత్య్రానికి అర్థాన్నే మార్చేశారు. అవార్డు ప్రదానం చేసినవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భారత స్వాతంత్రపు తేదీలనే మార్చేస్తున్నారు! ఇది క్షమించరాని నేరం. 2014లోనే దేశానికి స్వాతంత్య్రమొచ్చిందని చెప్పిన నటి మరి అంతకు ముందే ఏర్పాటు చేయబడిన అవార్డును ఎలా స్వీకరించారో? భక్తికి, దాసోహానికి, విమర్శకు ఒక హద్దు ఉండాలి. అది తమ ఉనికిని భూస్థాపితం చేసేలా ఉండకూడదు. భవిష్యత్తును ప్రసన్నం చేసుకోవడానికి పూర్వాశ్రమాన్ని హతమార్చు కోవడం ఎంత దారుణం. స్వాతంత్ర ఉద్యమ చరిత్రను కించపరిచేలా మాట్లాడింది తెలియని అమాయకత్వంతో కాదు. అది అహంకారం మాత్రమే కాదు. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మంది ప్రాణ త్యాగాలను కించపరచడం మాత్రమే కాదు. అది బాధ్యత, భయం-భక్తి లేని తనం. ఒకరి మెప్పు కోసం ఎంతటి మాట కైనా తెగబడే తెంపరి తనం. ''పర్యావసనాలు ఏమి ఉంటాయో కూడా నాకు తెలుసు'' అంటూ మాట్లాడటం ఎంత అహంకారం! ఇది పెంచి ప్రోత్సహించబడుతున్న పోకడ. మంద బిగువు చూసుకుని మొరిగే ఇలాంటి వారి సంఖ్య పెరిగితే ఇప్పుడున్న ఈ మాత్రపు స్వాతంత్య్రం కూడా ఖచ్చితంగా పోయే ప్రమాదమున్నది. ఈనాటి దౌర్భాగ్యమేమంటే, దేశమంటే ఒక రాజకీయ పక్షం కాదని, దేశమంటే ఒక మతం కాదనీ, దేశభక్తి అంటే ఒకరిని అసహ్యించుకోవడం అంతకన్నా కాదని దేశ అత్యున్నత అవార్డు గ్రహీతలకు చెప్పాల్సి రావడం. ''టైమ్స్ నౌ'' నిర్వహించిన సదస్సులో నటి కంగా రౌనౌత్ చేసిన ఈ అశుద్ధ వాక్కులపైన.. కార్యక్రమ ప్రాసారానంతరం రేగిన వివాదానికి వీపు చరుచుకుని టైమ్స్ నౌ సంస్థ ''ఈ వ్య్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు'' అని ట్వీట్ చేయడం నిరుపయోగమైనది.
నిజానికి ఇప్పుడు భారత చరిత్రను కించపరుస్తున్న ఇలాంటి వాళ్ళకి తప్ప వేరెవ్వరికీ స్వాతంత్య్రం లేదు. దేవుడి పేరుమీద, ఆవు పేరు మీద, సంస్కృతి పేరుమీద ఇతరులపై తెగబడుతున్న దాడులకు అంతేలేని రోజులివి. రాజకీయ ప్రతిపక్షాలను ఒక శత్రు మూకలకింద జమగట్టేసి నిరంతరం భౌతిక, ఆర్థిక, మానసిక దాడులు చేస్తున్న సందర్భాలివి. ప్రశ్నించే విలేకరులను అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ (యూఏపీఏ) కింద అరెస్టు చేస్తున్నారు. గత ఏడేండ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పత్రికా విలేఖర్లు నిర్బంధాలకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పంతొమ్మిదేండ్ల మహిళ అత్యాచారాన్ని, పోలీసులు చేసిన అసంబద్ద దహానాన్ని ప్రశ్నించినందుకూ సిద్దికీ కప్పన్ అనే విలేఖరిని, ఈ మధ్య కాలపు త్రిపుర అల్లర్లను ప్రశ్నించినందుగాను శ్యాం మీరాసింగ్ అనబడే విలేఖరితో బాటు అనేక మందిని యూఏపీఏ చట్టం క్రింద జైల్లో వేయడం స్వాతంత్య్రంలేని దేశాల్లో మాత్రమే జరిగే సంఘటనలు. శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నంగావిస్తున్న ప్రొఫెసర్లు సుధాభరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, వరవరరావు లాంటి మేధావులను ట్రయల్ లేకుండా జైల్లో పెట్టడాన్ని ఏ స్వాతంత్య్ర దేశంలోనూ మనం చూడం.
2014 తర్వాత మహౌన్న త్యాగాల ఫలితమైన దేశ స్వాతంత్య్రాన్ని కించపరిచినా ఏమీ చేయరన్న భరోసాని నేటి పాలకులు ఇచ్చారు. ఇలాంటి పోకడులున్న చోట అనుచరులంతా అణకువగా ఉంటారనీ ప్రజా స్వామ్యం ఫరఢవిల్లుతుందనీ ఆశించడం అత్యాశే. భారత ప్రజాస్వామ్యం దిగజారుతున్నదని గుటేన్బర్గ్ విశ్వవిద్యాలయాని కి చెండిన వి-డెమ్ అనే సంస్థ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలపై రిపోర్టును వెలువరిస్తే ఎగిరిపడిన పాలకులు, దేశ పౌరులే ఇలా వక్రభాష్యాలు చేస్తుంటే నోరు మెదపక పోవడాన్ని ఏమనాలి? ఈ రకమైన పోకడ ప్రజల సౌభ్రాతృత్వాన్ని మట్టుబెడుతుంది. దీనిని పునరుద్ధరించాలంటే సహనశీలురైన ఎంతమంది గాంధీలు జన్మించాలో! దేశానికి స్వాతంత్య్రం లేకపోవడమంటే అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా అమెరికాతో క్వాడ్ అనే ఒక కూటమిగా ఏర్పడినప్పటికీ, భారత్‌కు తెలియకుండానే అవుకస్ అనే మరో కూటమికి ఆజ్యం పోయడం. అమెరికా ఆజ్ఞలతో ఇజ్రాయెల్‌తో మరో పది సంవత్సరాల మిలిటరీ ఒప్పందానికి తెర తీయడం. నయా ఉదార వాద విధానల్లో మునగటంతో ఎగుమతులకన్న దిగుమతులు పెరగాయి. కరోనానంతరం పరిణామాలు, పొరుగుదేశాలతో కవ్వింపులతో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరుగుతోంటే ఏమీ చేయలేని ఆర్థిక స్వాతంత్య్రాన్ని నేడు కోల్పోయాం.
స్వాతంత్య్రానీ, దానికోసం పోరాడిన వాళ్ళనీ, ఆనాడు వేసిన ఆర్థిక పునాదులనూ వక్రీకరించడం లేదా తప్పుగా ప్రచారం చేయడం నేడు పనిగట్టుకుని నడుపుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని యావత్ భారతదేశం మొన్ననే జరుపుకుంది. కానీ గాంధీ నెహ్రూల స్థానాలను చరిత్రలో మసకబార్చడానికి నేటి రాజకీయులు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. కంగనా వ్యాఖ్యలూ ఈ కోవలోనివే. నేతల జయంతి అంటే వారి యొక్క దార్శనికతను గుర్తు చేసుకోవడమే. నెహ్రూ కేవలం దేశానికి మొదటి ప్రధాని మాత్రమే కాదు. స్వతంత్ర భారత్‌కు ఆర్థిక పునాదులను వేసిన దార్శనికుడు. నేడు స్వాతంత్రోద్యమానికీ, నెహ్రూ దార్శనికతకూ సవాలు ఏర్పడింది. నేటి పాలకులకు సంబంధించిన పూర్వ నాయకులెవరూ స్వాతంత్రోద్యమ చరిత్రలో లేకపోయేసరికి దేశానికి స్వతంత్రం తెచ్చిన నెహ్రూ-గాంధీలను కించపరుస్తున్నారు. మరోవైపు ఆర్థిక భారత నిర్మాణానికి ప్రభుత్వ రంగాల సృష్టితో పునాదులు వేసిన నెహ్రూ ముందు చూపును తక్కువ చేస్తూ మరో ప్రచారం జరుగుతోంది. 1950వ దశకంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, చమురు సంస్థలు, ఇనుము ఉక్కు కర్మాగారాలు వంటి వాటిని జాతీయం చేయకుంటే దేశానికి ఆర్థిక పునాదులు ఏవి? నెహ్రూ కేవలం ప్రభుత్వ రంగాల సౄష్టికర్తగా మాత్రమే చూడడానికి వీలు లేదు. నెహ్రూ శాస్త్రీయ అవగాహ నకు ప్రతీక. ప్రభుత్వ కార్యకలాపాల్లో మతపరమైన పోకడలకు అవకాశం ఉండకూడదని చెప్పడమే కాక చేసి చూపించిన ఘనత ఉన్నది. కానీ నేటి కాలంలో శాస్త్రీయ అవగాహన కన్నా మూఢ నమ్మకాలకు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టే వ్యక్తి పూజలో మునిగి తేలుతూ చరిత్రను దహనం చేయచూస్తున్నారు. ఇది గర్హనీయం.
సెల్: 9951300016
- జి. తిరుపతయ్య్మణానికి దిక్సూచి కావాలి. ఇది నేటి చారిత్రక అవసరం.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140