Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు వ్యవసాయ నల్లచట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతుల పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పదాయే. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తరహాలో వ్యవహారం నడిపిన మోడీ సర్కారుకు రైతులు కర్రుకాల్చి వాత పెట్టారు మరి! చివరకు చట్టాలను రద్దుచేస్తున్నామంటూ ప్రకటన చేయక తప్పిందికాదు తెల్లగడ్డం మోడీసారుకు. మాయలఫక్కీరులాగా సీజన్ బట్టి వేషభాషలను మారుస్తున్నడే వ్యంగ్యోక్తులు ఇటీవల మన పెద్దమనిషిపై తరచుగా రాబట్టే. పత్రికలోళ్లు కార్టూన్లు సైతం గియబట్టిరీ. గిది అందరికి తెలిసిన ముచ్చటే. చట్టాలు మంచివేనట, కానీ రైతులను మెప్పించలేకపోయారట! దాదాపు ఏడువందల మందిని పొట్టనబెట్టకున్న పెద్దమనిషి గుజరాత్ సీఎంగా ఉన్నప్పడు ఒకతీరు, పీఎం అయినాక ఇంకోతీరు మాట్లాడబట్టే. చేతలు అట్లనే ఉండబట్టే. రైతులతో పెట్టుకుంటే పరిస్థితి ఎంటుంటదో వాతపడ్డాకగానీ తెల్వకపాయే.
- బి.బసవపున్నయ్య