Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా పీక్ స్టేజిలో ప్లేట్లు కొడితే అది పారిపోతుందని స్వయంగా ప్రధాని మోడీ చెప్పిండు. పోయిందా? పోలేదు. అవాస్తవమని తేలింది. లైట్లు ఆర్పేస్తే చీకట్ల చనిపోతుందని చెప్పిండు. బుగ్గలు బంద్ చేసినా అది పోనేపోలేదు. మరింత పెరిగింది. ప్రధాని మూఢత్వ ప్రచారాలపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టుగా బండీ మోడీ బాటలోనే పయనిస్తున్నాడు. ''తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నరు... తెలంగాణ తల్లి విముక్తి కాబోతున్నది... బీజేపీతోనే అది సాధ్యమని నాకు జ్యోతిష్యుడు చెప్పిండు. అయితే, మనమంతా పోరాడాలి. మీ అందర్నీ అడుగుతున్నా... త్యాగాలకు మీరు సిద్ధమా? రక్తాన్ని ధారపోసేందుకు సిద్ధమేనా? అట్లయితే కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత నాది'' అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజరు బల్లగుద్దిండు! మీ జ్యోతిష్యుడు చెప్పిండు గదా సార్! గట్లయితే ఇంట్ల కూసున్నా అధికారం రావాలి గదా? త్యాగాలకు సిద్ధపడటమెందుకు? రక్తాలు ధారబోసుడెందుకు? అది మూఢత్వమనీ తెలిసి కూడా రెచ్చగొట్టుడు ఎందుకు స్వామీ! పుసుక్కున మీరు చెప్పినట్టే బీజేపీ కార్యకర్తలు రక్తాలు ధారబోయగాలె జర చూడు సారూ. వాళ్ల కుటుంబాలు ఆగమైతవి. బజారునపడుతయి. మూఢత్వం బారి నుంచి బయటపడండి బండిగారూ.
- అచ్చిన ప్రశాంత్