Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా డెబ్భై ఏండ్ల పైచిలుకు జీవిత కాలంలో మొట్టమొదటిసారిగా నేను మోసకారిలా కనిపిస్తున్నాను. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే మోసకారి హిందువులా ఉన్నాను. గత ఏడు దశాబ్దాలుగా నాకు హిందువు అన్న గుర్తింపు ఉన్నట్లుగానే భావించాను. హిందూ తల్లిదండ్రులకు జన్మించాను. హిందువు అనే భావనతోనే పెరిగాను. హిందూ జీవన శైలిని గౌరవిస్తాను. నేను దానికే సరిపోతానని భావిస్తాను. ఎలాంటి ఆంక్షలు గానీ నిబంధనలు గానీ లేవు. ఈ పరీక్షలో పాసవడానికి లేదా తప్పడానికి ఎలాంటి అదనపు గ్రేస్ మార్కులు సంపాదించ నక్కరలేదు. కానీ, అకస్మాత్తుగా, నేటి భారత దేశంలో హిందువుగా అర్హత పొందాలంటే ఈ వైఖరి మంచిది కాదని నాకు చెప్పారు. వ్యక్తిగత నమ్మకాల పునాదిని పునరాలోచించే అవసరమున్న చెడ్డ హిందువుగా నేను భావించబడుతున్నాను. లేదా, నిజమైన హిందువుగా నాకు అర్హత ఉందని తిరిగి నిరూపించు కునేందుకు... కఠినమైన ఓరియెంటేషన్ కోర్సును తీసుకోవాల్సి ఉంది.
ఏమిటీ అర్థం లేని చెత్త మాటలు! నా హిందూ గుర్తింపును ప్రత్యేకంగా చెప్పుకోవడానికి, లేదా ప్రత్యేక బ్యాడ్జిగా ధరించడానికి నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నా. అంతర్గతమని అనుకున్న దాన్ని ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎలాగంటే. లో దుస్తులను బహిరంగంగా ధరించాలనుకోం కదా! అలాగే ఇదీనూ. ఇతరులు చూసి ధృవీకరించడానికి లేదా ఆమోదించడానికిగానూ నా మతాన్ని బహిరంగంగా ప్రదర్శించాలంటే అసహ్యం, అసభ్యమని నేను భావిస్తున్నా. ఎలా ఉంటే నేను హిందువునని అంటారో అది పూర్తిగా తిరస్కరించాల్సిన అంశం. నా విశ్వాసం లేదా నమ్మకమనేది నాకు సంబంధించిన అంశం. కాబట్టి వెనక్కి తగ్గండి!
మన సభ్యతా ప్రమాణాలను పెంచుకోవాలని ఈ కొత్త సంవత్సరం లోనైనా మనం తీర్మానించుకుందామా ?
నైనీటాల్ లోని రామ్‌గఢ్‌లో మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కుటుంబీకుల ఇల్లు ఈ వారంలో విధ్వంసానికి గురైంది. ఆ ఇంట్లో బుల్లెట్లు (ఖాళీ తూటాలు, పని చేసే తూటా) కూడా కనుగొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేనేమీ దిగ్భ్రాంతి చెందలేదు. ఆగ్రహం వ్యక్తం చేయలేదు. జరగాల్సింది జరిగింది. అంతే. నేనేమీ సల్మాన్ ఖుర్షీద్ మద్దతుదారుని కాదు (మాకు బహిరంగంగానే అభిప్రాయ బేధాలున్నాయి). ఆయన తాజా పుస్తకాన్ని (సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్) నేను సమర్థించలేదు. అలాగని 'ఫెయిత్ నో ఎక్స్యూజ్' వంటి ఆయన ప్రకటనలతో ఏకీభవించడం లేదు. కానీ హిందూత్వ, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల మధ్య సమాంతర రేఖలు గీస్తున్న ఇటువంటి ఘటనలను అంటే సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై దాడి వంటి వాటిని మాత్రం కచ్చితంగా గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది. హిందూ మతానికి అసలైన పరిరక్షకులం తామేనని చెప్పుకుంటున్న వారిని, ఈ దాడిని సమర్థించేవారిని కొన్ని మౌలిక ప్రశ్నలు అడగాల్సి వుంది. నిజంగా, వారనుకుంటున్నట్లు నేను హిందువునే -అయినా విధ్వంసక చర్యలను, బెదిరింపు చర్యలను- నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
- 'టైమ్స్ ఆఫ్ ఇండియా' సౌజన్యంతో
- శోభా డే