Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీటి అయోగ్ తాజాగా విడుదల చేసిన 'నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, యంపిఐ (జాతీయ బహుమితీయ పేదరిక సూచిక)' వివరాల ప్రకారం దేశంలోని బీహార్, ఝార్ఘండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పేదరికం అధికంగా ఉందనే కఠిన వాస్తవాలు బయట పడ్డారు. వివిధ రాష్ట్రాల పేదరిక సూచిక ప్రకారం అత్యధికంగా బీహార్‌లో 51.91శాతం, ఝార్ఘండ్‌లో 42.16శాతం, యూపీలో 37.79శాతం, యంపీలో 36.65శాతం, మేఘాలయాలో 32.67శాతం పేదల జనాభాలో తొలి ఐదు స్థానాల్లో ఉన్నట్లు వెల్లడైంది. పేదరికం అత్యల్పంగా కేరళలో 0.71శాతం, గోవాలో 3.76శాతం, సిక్కిమ్‌లో 3.82శాతం, పంజాబ్‌లో 5.59శాతం ప్రజలు మాత్రమే కనిష్టంగా పేదరికంలో ఉన్నారని తేలింది. పేదరిక సూచిక పట్టికలో 20వ స్థానంలో 12.31శాతంతో ఆంధ్రప్రదేశ్, 18వ స్థానంలో 13.74శాతంతో తెలంగాణ నిలవడం గమనించారు.
'ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిష్యేటివ్'తో పాటు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్' రూపొందించిన మార్గనిర్దేశకాల ప్రకారం భారతదేశంలోని రాష్ట్రాల్లో 'బహుమితీయ పేదరిక సూచీ (యంపిఐ)'లను నిర్ణయించారు. జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, విద్య అనబడే అంశాలను ఆధారం చేసుకొని పోషకాహారం, బాల కౌమారదశ మరణాల రేటు, మాతా శిశ రక్షణ, పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు, వంట ఇంధనం, పారిశుధ్యం, తాగు నీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు అనబడే 12 ఇండికేటర్స్‌ను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఐరాసలోని 193 సభ్యదేశాలు 2015లో తీర్మానించిన 17 'సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030'లతో పాటు 169 టార్గెట్ల ఆధారంగా పేదరిక సూచీలను నిర్ణయించామని నిటి అయోగ్ బాధ్యులు వివరిస్తున్నారు.
రాష్ట్రాల్లో బహుమితీయ పేదరిక సూచీ
పేదరిక సూచిక పట్టీలో బీహార్ (51.91శాతం), ఝార్ఘండ్ (42.16శాతం), యూపీ (37.79శాతం), యంపీ (36.65శాతం), మేఘాలయ (32.67శాతం), అసోం (32.67శాతం), చత్తీస్‌ఘర్ (29.91శాతం), రాజస్థాన్ (29.46శాతం), ఒడిసా (29.35శాతం), నాగాలాండ్ (25.23శాతం), అరుణాచల్ ప్రదేశ్ (24.27శాతం), పశ్చిమబెంగాల్ (21.43శాతం), గుజరాత్ (18.60శాతం), మణిపూర్ (17.89శాతం), ఉత్తరాఖండ్ (17.72శాతం), త్రిపుర (16.65శాతం), మహారాష్ట్ర (14.85శాతం), తెలంగాణ (13.74శాతం) కర్నాటక (13.16శాతం), ఆంధ్రప్రదేశ్ (12.31శాతం), హర్యానా (12.28శాతం), మిజోరాం (9.80శాతం), పంజాబ్ (5.59శాతం), తమిళనాడు (4.89శాతం), సిక్కిం (3.82శాతం), గోవా (3.76శాతం), కేరళ (0.71శాతం) చోటు దక్కించుకున్నాయి. అతి తక్కువ పేదరికంలో 7 రాష్ట్రాలు, తక్కువ పేదరికంలో 10 రాష్ట్రాలు, మధ్యస్థ పేదరికంలో 7 రాష్ట్రాలు, ఎక్కువ పేదరికంలో 3 రాష్ట్రాలు, అతి ఎక్కువ పేదరికంలో ఒక్క బీహార్ రాష్ట్రం నిలిచాయని నీతి ఆయోగ్ వర్గీకరించింది.
కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదరిక సూచీ
కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలిలో 27.36శాతం, జమ్ము కాశ్మీర్ లడక్‌లో 12.58శాతంతో అధిక పేదరికం ఉండగా డయ్యూ డమన్లో 6.82శాతం, చండీఘర్‌లో 5.97శాతం, ఢిల్లీలో 4.79శాతం, అండమాన్ నికోబార్‌లో 4.30శాతం, లక్ష్యద్వీప్‌లో 1.82శాతం, పుదుచ్చెరిలో 1.72శాతం పేదరికం నమోదైందని తేలింది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పేదరికం
ఆంధ్రప్రదేశ్‌లో బహుమితీయ పేదరిక సూచిక (యంపిఐ)లో కర్నూలు జిల్లా 20.69శాతంతో 1వ స్థానంలో నిలువగా, 19.00శాతంతో విజయనగరం, 15.63శాతంతో ప్రకాశం, 15.10శాతంతో విశాఖపట్నం, 14.01శాతంతో శ్రీకాకుళం, 13.24శాతంతో అనంతపూర్, 11.67శాతంతో నెల్లూరు, 10.34శాతంతో చిత్తూరు, 9.96శాతంతో కడప, 9.11శాతంతో పశ్చిమ గోదావరి, 8.98శాతంతో కష్ణ, 8.55శాతంతో తూర్పు గోదావరి, 8.31శాతంతో గుంటూరు జిల్లా చివరి 13వ స్థానంలో నిలిచాయి.
తెలంగాణ జిల్లాల్లో పేదరికం
తెలంగాణ జిల్లాల్లో పేదరికంలో (యంపిఐ) 27.43శాతంతో 1వ స్థానంలో ఆదిలాబాద్ నిలువగా, 26.11శాతంతో మహబూబ్ నగర్, 21.44శాతంలో నిజామా బాద్, 17.90శాతంతో మెదక్, 15.30శాతంతో నల్గొండ, 13.75శాతంతో ఖమ్మం, 12.45 శాతంతో వరంగల్, 9.20శాతంతో కరీంనగర్, 5.83శాతంతో రంగారెడ్డి, 4.27 శాతంతో చివరి 10వ స్థానంలో హైదరాబాద్ జిల్లా నిలిచాయి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 994970003