Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం చెల్లిన
మూఢ భక్తి
మరల మరల
ప్రాణం
పోసుకుంటున్నది
పాలకులే
పనిగట్టుకుని
ఊడలు
దించుతున్నారుగామరి
ద్వేషభక్తినే
దేశభక్తిగా
శ్వాసించే
ఆధునిక అఘోరాలు
అవతరించారు కదా
ప్రతి జేరంగ జేబుకు
ప్రతిగా ఓ ఛత్రపతి
ప్రభవిస్తాడట!
ఎప్పటి కాలం?
ఎప్పటి యోథులు?
అన్నం పెట్టే
అన్నదాతల
హత్యలు రూపుమాపేందుకు
ఎవరు ప్రభవిస్తారు మరి?
శకటాలతో తొక్కించిన
రైతన్నల రక్తపు మరకలు
ఎప్పుడు ఆరతాయి?
మరుభూములుపై
పైరు పచ్చపొలాలు
ఎప్పుడు జీవన గీతికలు
పాడుతాయి?
ప్రజాహాని కల్గించే
వికృత చర్యల్ని
ప్రశ్నించే తత్వం
ప్రజాస్వామ్యపు
ఆనవాలైంది కదా..
రాజుల కాలం చెల్లిందిగా
ఏం చేద్దాం?
నాటకాలు నక్క వినయాలు
పాదపూజలు, మొసలి కన్నీళ్ళు
తేలుతున్న కాలమిది.
గంగామాత ఒడిలో
తేలిన కరోనా శవాల లెక్కలూ
తేలుతున్నాయి.
తిండి బట్ట వసతే కాదు
ప్రాణ రక్షణా
కనీస అవసరమైంది నేడు
సామాజికతనం లేని
అఘోరా నిఘంటువులో
(నర)భక్షకుడే రక్షకుడట..!
పదవీ కైవసమే
పరమార్థమైన
మూఢభక్తి ఓట్ల వేటలో
ప్రజా క్షేమమూ తేలుతున్నది
అదిగో అటు చూడు...
ఉద్యమాల రైతన్న
ఉదయించే సూర్యునిలా
జగమంతా ప్రభవిస్తున్నాడు.
గంగామాత కిరణాలు
అరుణారుణమై మెరుస్తున్నాయి.
- కె. శాంతారావు
9959745723