Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక గుడిని చేరాలంటే
ఎన్ని వైన్‌షాపులు దాటాలో
గాంధి బొమ్మ మసక బారింది
బాలాజి బ్రాందీ షాప్ లాండ్ మార్క్ అయ్యింది....
ఎక్కడ వున్నావంటే
వీaఅరఱశీఅ ష్ట్రశీబరవలో అంటాడు
ఎప్పుడు కలుస్తవంటే
Vశీససa నడుగు చెబుతుంది
ఎందుకు వూగుతున్నవు అడిగితే
ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సమాధానం.....
పల్లె పల్లేన చెట్టు చెట్టునా
జుంబో గ్లాస్లు బీర్ బాటిల్లు
గల్లీ గల్లీన బెల్ట్ షాపులు
విస్కీ విరాజిల్లుతుంది దేశమంతా.....
తాగిచ్చి కుర్చీ లో కూచుని
గొంతు పిండి వసూలు చేస్తుంది
ఖజానా నింపడానికి ఖలేజాతో ఆట
ఆరోగ్యం వాళ్ల ఖర్మ ఆదాయం ప్రభుత్వ దాహం
ఇప్పుడు ఎథిక్స్ ఎందుకు
ఎకానమీ ఏలుతున్న రోజులు మరి.....
తాగడం జూaరరఱశీఅ చేశారు హీరోలు
తాగించడం అధికారుల పెద్ద బాధ్యత
కల్చర్ అని కార్పొరేట్ ముద్దుగా పోష్ గా
తలో చేయి వేసి మత్తులో ముంచడమే పని
కొత్త సంవత్సరం రావాలంటే
ఎన్ని ప్రాణాలు (రోడ్డుకు) బలి ఇవ్వాలో
న్యూ ఇయర్ పార్టీకి వెళ్లిన కోడుకులను
మార్చురీ లో గుర్తు పట్టడానికి నరక యాతన...
- దాసరి మోహన్
9985309080