Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ దేహంలో మెడపైనున్న ఆమె మెదడు పురుషులంత బాగా ఆలోచించలేదని పురుషులు చేసే గేలి తెలియని వారెవరు?
స్త్రీ దేహం పురుషుడి శరీరంకన్నా బలహీనమైనదనే
ముద్ర వేసిన సంగతి తెలియనిదెవరికి?
స్త్రీని మెల్లి మెల్లిగా తన స్థాయికన్నా తగ్గించేందుకు కృషి చేస్తూ పోయాడు సరే తన ప్రస్తావన లేకుండా ఏనాడైనా బతికాడా?
ఒక మగవాడు మరో మగవాడితో గొడవ పడినా
ఆడదాని ప్రస్తావన లేకుండా బూతులైనా తిట్టుకోలేని బలహీనత అతడిది.
ఒక మగవాడు వాడుకునే వస్తువుకైనా ఆడదాని దేహంలోని
ఏదో ఒక భాగం చూపకపోతే వ్యాపారమే ముందుకు సాగదు.
ఆడది లేని ఇల్లు శ్మశాన వైరాగ్యంలో మునిగి తేలుతుందట.
మగాడి జీవితం ఫలప్రదం కావాలంటే ఆడది కావాలట.
పిల్లలు బాగుపడాలంటే ఆడది కావాలట.
బంధువుల మధ్య సఖ్యత పెరగాలంటే ఆడది కావాలట.
పురుషుడు లేని నగరమైనా చూసాం కానీ ఆడది లేని ఊరు చూసామా?
ప్రకృతి లేని సృష్టి ఆడది లేని లోకం ఒకటి కాదా?
నాణేనికి బొమ్మాబొరుసైన ఆడా, మగ దేహాలన్నీ ఒక్కటి కావా?
కులాల వారిగా, మతాల వారిగా దేహ భాగాలూ అమరి ఉన్నాయా?
'స్త్రీ దేహం గర్భగుడి' అంటూ పవిత్రత ఆపాదించిన శ్యాంసింగరారు బహుశా ఆనాడు ఊహించి ఉండలేదేమో? గర్భగుడికి ఉండే పవిత్రతను ఆపాదించాలంటే ఆ స్త్రీ దేహం ముస్లిం స్త్రీ దేహమై ఉండకూడదని. బహుశా స్త్రీ దేహాలలో ముస్లిం స్త్రీ దేహం వేరని తెలియని అమాయకుడై ఉంటాడతడు.
ముస్లిం ఆడ తలకాయలకు ఇతర ఆడ నగ దేహాలను అతికించి వేలం పెడితే ఆ ఆడది అమ్ముడవుతుందా? ఆ మహిళను అవమానించినట్లేనా?
ఆ ముఖంలేని దేహపు హక్కుదారుకు ఆ మార్ఫింగ్‌పై ఏహక్కూ ఉండదా? భాగాలుగా విడిపోయిన ఆ దేహం వేలానికి పెట్టిన వాడి కులమో, మతమో కాదనే గ్యారెంటీ ఏమిటి?
ఒక వర్గాన్ని కించపరిచాలన్న తపన ఏ దిగజారుడుతనానికి
సూచికగా నిలుస్తున్నది?
ఎవరి పతనాన్ని పతాకానికి చేర్చింది?
దేశం ఇప్పటికే మన దేశం నుంచి విడిపోయిన చిన్న దేశమైన బంగ్లాదేశ్ జీడీపీ కంటే
కిందకి దిగజారింది.
ఇంకా ఎక్కడికో సక్సెస్ ఫుల్‌గా తీసుకు వెళదామనే నిబద్ధతతో ఉన్నట్లున్నారు.
అందుకే అసలు పనులు కాకుండా ఉద్వేగాలు రేపే పనులకు పూనుకుంటున్నారు.
తస్మాత్ జాగ్రత్త!!
- నస్రీన్‌ఖాన్
సెల్:9652432981