Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 నవంబర్ రెండవ వారంలో తొలుతగా దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 వైరస్ యొక్క మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. నవంబర్ 24, 2021 నాడు దక్షిణాఫ్రికా అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ వేరియంట్ గురించి తెలియజేసింది. మొట్టమొదటి కోవిడ్-19 వైరస్ (తొలి వూహాన్ వైరస్) నిర్మాణంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో 37 మార్పులు జరిగినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వెల్లడైంది. ''ఒమిక్రాన్''గా గుర్తించిన ఈ వేరియంట్‌ను సాంకేతికంగా బి.1.1.529గా సంబోధిస్తారు. దక్షిణాఫ్రికాలో తొలుత నమోదుకాబడ్డ ఒమిక్రాన్ వేరియంట్ అతితక్కువ కాలంలోనే 70కి పైగా ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో డెల్టా వేరియంట్ వెనుకపట్టు పట్టి, దాని స్ధానంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరిగాయి. మనదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా దక్షిణ ఫ్రాన్స్‌లో మార్సే నగరంలో మరో కొత్త వేరియంట్12 కేసులు నమోదయినట్లు ఫ్రెంచి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేరియంట్లో ఒమిక్రాన్ కంటే ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్స్ ఈ వేరియంట్లో గుర్తించారు. ఐహెచ్‌యు వేరియంట్‌గా నామకరణం చేసిన ఈ వైరస్‌ను సాంకేతిక పరిభాషలో బి.1.640.2గా సంబోధిస్తారు. ఈ వేరియంట్లో వెల్లడైన N501Y, E484K మ్యుటేషన్ల ఫలితంగా ఇది ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందడమే గాక, వాక్సిన్ వలన ఏర్పడ్డ వ్యాధినిరోధక కణాలనుండి తప్పించుకోగలదనీ భావిస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ను ఎలా గుర్తిస్తారు?
ప్రాధమికంగా కోవిడ్-19 వైరస్‌ను RT-PCR అనే పరీక్ష ద్వారా గుర్తిస్తారన్నది మనందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా ఈ టెస్టులో కోవిడ్ వైరస్ నిర్మాణాన్ని కోడ్ చేసే 5 జీనోమిక్ భాగాలను గుర్తించే 5రకాల ప్రైమర్ లను ఉపయోగిస్తారు.ORF1ab, RdRp (RNA dependent RNA Polymerase), E (Envelope), N (Nucleocapsid), S(spike) అనే ఈ 5 భాగాలను గుర్తించేట్లు డిజైన్ చేసిన 5 రకాల ప్రైమర్లను =ు-ూజ= కిట్‌లో ఉపయోగిస్తారు. టెస్టులో కోవిడ్19 వైరస్ పాజిటివ్‌గా పరిగణించేందుకు అవసరమైన రెండు లేదా మూడు జీనోమ్ భాగాలు పాజిటివ్ వచ్చినప్పటికీ, ూ-స్త్రవఅవ భాగం నెగటివ్ వచ్చినప్పుడు (మ్యుటేషన్స్ వలన), ఒమిక్రాన్ వేరియంట్‌గా అనుమానిస్తారు. దీనినే ూ-స్త్రవఅవ సతీశీజూశీబ్గా పిలుస్తున్నారు. తుది నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కూడా పంపుతారు.
ఒమిక్రాన్ లక్షణాలేమిటి?
తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర, అలసట వంటి లక్షణాలు కనబ డవచ్చు. ఇప్పటివరకూ తెలిసిన సమాచా రాన్ని బట్టి సాధారణ సీజనల్ ఫ్లూ వంటి లక్షణాలే ఇందులోనూ కనబడతాయి.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మరియు వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది?
1. ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని తెలుస్తోంది. (high transmissibility).
2. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ప్రాధమిక సమాచారాన్ని బట్టి డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రధానంగా వ్యాపించి ఉన్న ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ స్ధానభ్రంశం చెంది దానికంటే తక్కువ ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం ఒక రకంగా ఊరట కావచ్చునేమో అని కూడా కొందరు నిపుణులు భావిస్తున్నారు.
3. ప్రపంచ దేశాలలో ఇప్పటికే కొంతమేరకు జరిగిన వాక్సినేషన్ ప్రక్రియ వలన ఒమిక్రాన్ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం తక్కువే ఉంటుందని చెప్పాలి. అయితే, ఇప్పటివరకూ కోవిడ్ వాక్సిన్ తీసుకోనివారిలో ఒమిక్రాన్ వ్యాధి వలన తీవ్రలక్షణాలు కనబడే అవకాశం 8రెట్లు ఎక్కువగా ఉంటుందని వెద్యనిపుణులు భావిస్తున్నారు. వాక్సిన్ వేసుకున్న వారిలో ఒమిక్రాన్ సోకినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యే పరిస్ధితి రాకుండా రోగనిరోధకవ్యవస్ధ (బి మరియు టి కణాలు) నిరోధించగల్గుతుందని (సవషశీబజూశ్రీఱఅస్త్ర) శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్లో చోటు చేసుకున్న మ్యుటేషన్ల ఫలితంగా వేక్సిన్ వేసుకున్న వారిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్ధ నుండి కూడా ఒమిక్రాన్ పాక్షికంగా తప్పించుకునే అవకాశం (immune evasion) ఉందని శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్19 వాక్సిన్ బూస్టర్ డోస్ ''ఒమిక్రాన్''ను నిరోధిస్తుందా?
ఏ వాక్సిన్ అయినా తీసుకున్న కొన్ని నెలలకు లేదా సంవత్సరాలకు ఆ వ్యాధిని నివారించేందుకు ఏర్పడ్డ రోగనిరోధక కణాల క్రియాశీలత తగ్గుతుంది. సాధారణంగా ఏ వాక్సిన్ బూస్టర్ డోసు అయినా సన్నగిల్లిన రోగనిరోధక కణాల క్రియాశీలతను కొంతవరకూ పెంచుతుందన్న విషయం సాంకేతికంగా కరెక్టే. కానీ వైరస్‌లో మ్యుటేషన్స్ ఫలితంగా రోగనిరోధక కణాలనుండి తప్పించుకునే శక్తి కొత్త వేరియంట్స్ కు ఉండే అవకాశాన్ని కాదనలేం.
మనమేం చేయాలి?
1. ప్రస్తుతానికి (ఈ వ్యాసం రాసే సమయానికి) ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత, కాంప్లికేషన్స్ గురించి పూర్తి స్పష్టత రాలేదు. ఇంతలోగా ×నఖ అనే మరో కొత్త వేరియంట్ ఫ్రాన్సులో వెలుగు చూసింది. ఏదేమైనప్పటికీ వేగంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్స్ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని, వీటి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. వివాహాలు, వేడుకలు, సభలు, మతపరమైన లేదా రాజకీయ సంబంధిత ర్యాలీలు, సమీకరణలు వంటి జన సందోహాలకు దారితీసే చర్యల్ని నియంత్రించాలి.
2. Covid Appropriate Behaviour (కోవిడ్ అనుగుణ ప్రవర్తన): సాధ్యమైనంత వరకూ సామూహిక ప్రయాణాల్ని నియంత్రించడం, తప్పనిసరిగా, సరైన పద్ధతిలో ఫేస్ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచుగా చేతుల్ని శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకపోవడం, కరచాలనం చేయకపోవడం వంటివి తప్పనిసరిగా అనుసరించాలి.
3. వాక్సిన్ తీసుకోని వారు తక్షణమే వాక్సిన్ తీసుకోవాలి.
4. అనుమానిత వ్యాధి లక్షణాలు కనబడ్డ వెంటనే పరీక్ష చేసుకోవాలి. రిపోర్టును బట్టి అవసరమైన వైద్య సలహా తీసుకోవాలి.
5. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐసోలేషన్‌లో ఉండాలి. ప్రభుత్వ లేదా స్వచ్చందసంస్ధల హైల్ప్ లైన్ సలహాలు తీసుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు డాక్సిసైక్లిన్, ఐవర్‌మెక్టిన్, విటమిన్-సి, జింక్, పారాసి టమాల్, లివోసెట్రిజిన్ వంటి మందులు వాడాలి. ఇంట్రావీనస్ యాంటిబాడీస్ లేదా కొత్తగా ఆమోదం పొందిన మాల్నుపిరావిర్, పాక్స్లోవిడ్ వంటి టాబ్లెట్స్ అవసరమైనవారు మాత్రమే డాక్టర్ సూచనమేరకు వాడాలి. అవసరమైనట్లయితే డాక్టర్ సలహా మేరకు CBP,CRP వంటి కొన్ని ప్రాధమిక రక్త పరీక్షలు చేసుకోవాలి. ఆందోళనతో ప్రతి ఒక్కరూ ఛాతీ సి.టి.స్కాన్ చేసుకోవల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ శాచురేషన్, టెంపరేచర్ రోజుకు రెండు లేదా మూడు సార్లు చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ శాచురేషన్ 94శాతం కంటే తక్కువగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. ఇంటిలోపలనే 6నిమిషాల నడక పరీక్ష (6minutes walk test) చేసుకోవచ్చు. నడవకముందు ఉన్న ఆక్సిజన్ శాచురేషన్ కంటే 6ని.లు నడచిన తర్వాత ఉన్న ఆక్సిజన్ శాచురేషన్ 3శాతం కంటే తగ్గితే డాక్టర్ ను సంప్రదించాలి. అవసరమైన సందర్భాలలో మాత్రమే హాస్పిటల్లో చేరవల్సివుంటుంది.
6. ప్రత్యేకించి బి.పి, షుగర్, స్ధూలకాయం, ఆస్తమా వంటి సహవ్యాధులు (comorbidities) ఉన్న హై రిస్కు వ్యక్తులు మరింత జాగ్రత్తగా నివారణ చర్యలు పాటించాలి. వ్యాధికి సరైన మందులు వాడుతూ ఖచ్చితమైన నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అనుమానించిన తక్షణమే వైద్యసలహా తీసుకోవాలి.
7.వ్యాధి గురించి అనుమానాలు, అపోహలు పెంచుకోకుండా శాస్త్రీయమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించాలి. అహేతుకమైన ప్రచారాలు, అశాస్త్రీయ ప్రాపగాండాలను దూరంగా ఉంచాలి.
- డాక్టర్ కె శివబాబు