Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గో ముఖం పులిరాజా
నీ గుట్టు బట్టబయిలే
చీకట్లను చిమ్మలేవు
నిస్సిగ్గుగా పట్టపగలే !
విశాఖ ఉక్కు మీద
ధ్యాస లేదు గానీ,
గుంటూరు జిన్నా టవరు
ఊసు ఏల నీకు ?
నీ భాషలోనే విషమున్నది
విద్వేషం ఎగజిమ్ముతున్నది
తిరుమల వాసుని కథలు
తిప్పి, తిప్పి చెబుతావూ
బీబీ నాంచారిని
ఏ ఖైదులో పెడతావూ?
క్రైస్తవ మన్రో దొర
పాత్రలేమి చేస్తావు?
మనో భావాల పేర
మంటలు రగిలిస్తావు
గాంధీ కళ్లద్దాలను
మ్యూజియం లో పెడతావు
గాడ్సే నల్లద్దాలకు
మందిరాలు కడతావు!
గాయాలు మానినాయి
మచ్చలే మిగిలాయీ!
సరికొత్త గాయాలకు
తెరలెందుకు తీస్తావూ?
కులం, మతంతోనే
కలగదుగా దేశభక్తి ?
హిట్లర్, ముస్సోలినీ
కాదిక్కడ చక్రవర్తి !
విభజించీ పాలించే
నీ వికృత తత్వం
ఐక్యంగా జీవించే
మా ప్రకృతి సత్యం
దేశమంటె ఓట్లు కాదు
దేశమంటె మనుషులోరు !
దేశమంటె మనుషులోరు ...
- నల్లి ధర్మారావు, 76609 67313