Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊసరవెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితు లకు అనుగుణంగా రంగులు మారు స్తుందనేది మనకు అందరికీ తెలిసిన ముచ్చటే కదా. అలాగే మన దేశంలో ఒక పెద్దాయన ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వేషం మారుస్తూ ఉంటాడు. ఏ ఏరాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రం వేషధారణకు దిగిపోతాడు. దసరా బుల్లోడు మాదిరి. ఆయన్ను అందరూ ఇప్పుడు ఎలక్షన్ బుల్లోడు అని కూడా అంటున్నా రనుకోండి. ఏ కార్యక్రమం జరిగినా దాన్నీ ప్రచారం కోసం వాడుకోవడంలో ఆయన మహా దిట్ట. మొన్న బెంగాల్ ఎన్నికల ముందు గడ్డాలు మీసాలు పెంచుకున్నా నిన్న రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తరాఖండ్ టోపీ పెట్టుకున్నా, మణిపూర్ కండువా కప్పుకున్నా అందుకే నట! ఆయన ప్రవర్తన గతంలో కూడా అనేక సార్లు ఇదే తీరున ఉన్నది. ఇప్పుడు గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబట్టే. మొన్నటికి మొన్న 'చునావ్' ప్రచారానికి పంజాబ్‌కు పోతే బ్రిడ్జీ మీద నిలబెట్టి మరీ వెనక్కి పంపిరాయే. దిమ్మ తిరిగి బాక్స్ బద్దలైంది. రైతాంగ ఉద్యమ ప్రభావం దేశమంతా ఉందని తన సెంట్రల్ వేగుల ద్వారా పసిగట్టిన గా పెద్దాయన గిప్పుడు గిట్ల దినానికో వేషం వేస్తుంటే ఊసరవెల్లులే దిమ్మెరపో తున్నాయట! పరిస్థితి ఎటు బోయి ఎటొచ్చెగదరా సామీ!!
- బి.బసవపున్నయ్య