Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయనేది ఊహించడం కష్టమే. ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయనే సంగతి రాజకీయాలు తెలిసిన ప్రతిఒక్కరికీ ఎరుకైన ముచ్చటే కదా! ఫస్ట్ టర్మ్‌లో బీజేపీతో సఖ్యతగా ఉండి ముందస్తు ఎన్నికలకుపోయి జయకేతనం ఎగరేసిన సీఎం కేసీఆర్, సెకండ్ టర్మ్‌లో మాత్రం నామాల బొట్లు పెడుతుండటంతో అసహానంతో ఉన్నారు. ఢిల్లీ గేట్లు మూసేయడంతో ఖిన్నులవుతున్నారు. తాజా బడ్జెట్లోనూ రాష్ట్రానికి గుండు సున్నా చుట్టడంతో చేసేదిలేక మీడియా వేదికగా బీజేపీని, ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ పట్ల కమలనాధులు వివక్ష ప్రదర్శిస్తుండటం, పలుమార్లు ఢిల్లీవెళ్లి బతిమిలాడుకున్నా నయాపైసా విదిల్చకపోవడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారు. తెలంగాణకు సాధారణ నిధులతోపాటు ప్రత్యేకంగా అడిగిన పైకానికీ 'నో' చెబుతుండటంతో శనివారం ప్రధాని మోడీ పర్యటనకు సీఎం మొహం చాటేశారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేనట్టు, కేసీఆర్ ఎప్పుడూ ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం చేస్తాడో కూడా అంతుబట్టని ముచ్చటే!
-బి.బసవపున్నయ్య