Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భూమి ఏ ఆకారంలో ఉంటుంది?' ఏ పోరడ్ని అడిగినా 'భూమి గుండ్రంగా ఉండును' అని ఠక్కున సమాధానం చెప్తడు. సైన్సూ అదే చెబుతున్నది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి చిన్నజీయర్‌స్వామి మాత్రం కొత్త సూత్రీకరణ చేసేశారు. నలుగురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. స్వామిజీల మాటలకు అర్థాలే వేరులే అనుకున్నారో ఏమోగానీ 'భూమి చతుర స్రాకారంలో ఉంటుంది' అని తేల్చేసి తలకాయ గిర్రున తిరిగేటట్టు చేసిండు. గాయనే 'సమాజంలో తారతమ్యాలు ఉంటాయంట. కులాలూ ఉండాలంట. ఏ కులపోళ్లు ఆ కుల పని చేసుకుంటూ కలిసిమెలిసి బతకాలంట' అని సెలవిచ్చేశారు. అబ్బా స్వామి మస్తు జెప్పిండ్ర బై కలిసిమెలిసి ఉండాలని చెప్పిండు గదా అనుకునేలోపే అరే గీనేందిర బై.. కుల రహిత సమాజం రావాలని అందరూ కోరుకుంటుంటే మళ్లీ ఎన్కటి ముచ్చట జెప్పబట్టే అనే ఆలోచన బుద్ధిజీవులందరికీ రాక తప్పదు. 'నూతన జాతీయ విద్యావిధానం గొప్పగా ఉంది. దేశ భవిష్యత్ కోసం స్వాగతిస్తున్నాం' అంటూ మోడీని ఆకాశానికి ఎత్తేసిందీ ఆ స్వామిజీనే. 'మహిళ వంటింట్లో గాడిద చాకిరీ చేయాలి. భర్తకు ఎదురుతిరుగొద్దంటూ' ఇటీవల ఓ పరీక్ష విషయంలోనూ కొందరు తలదూర్చేశారు. ఆవు మూత్రం తాగితే, ఆవుల పేడ ఒంటికి పూసుకుంటే కరోనా రాదంటూ మోడీ(మూఢ)భక్తులు సెలవిచ్చేసిన సంగతీ తెలిసిందే. ఓహో నూతన జాతీయ విద్యావిధానం సమర్థించేటోళ్లంతా గిట్లనే మాట్లాడుతారనే విషయం బోధపడక తప్పదు. గిసోంటి నూతన జాతీయ విద్యావిధానం దేశానికే ప్రమాదకరం. బుద్ధిజీవులంతా గట్టిన వ్యతిరేకించాల్సిందే.
- ప్రజ్వాన్షి