Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజానికి వినోదాన్ని, సందేశాన్ని ఇచ్చే సినిమారంగంలోనూ ఇటీవల విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి సుమా! ఇందులో కొత్తగా కనిపించేదేముంది అంతా విపరీతమే కదా! అనే డౌటనుమానం మీకు రావచ్చు. సినిమాలు రకరకాలు. వెండితెరమీద సినిమా వాళ్లు తీసే సినిమాలు ఒక ఎత్తు. ఇప్పుడు ఏపీ సీఎం సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న వైనం ముక్కుమీద వేలేసుకునేదే. దానికి తెరవెనుక కథ ఉందనే గుసగుసలు వినిపించబట్టే. అదేంటో అనే సందేహాం మీకు మళ్లీ రావచ్చు. రాకమునుపే మీకు చెప్పేస్తా. అదేమంటే జగన్‌ను తొలినాళ్లల్లో సినిమా వాళ్లు సీఎంగా గుర్తించలేదట. గదే ముచ్చటను బల్లగుద్దీనట్టు తెరతీసి మరీ ముఖం మీదే చెప్పేసిడంట. 'మా'ను పక్కనబెట్టి మరీ మంత్రాంగం నడుపుతున్న సూపర్, డూపర్ స్టార్లకు చిరుచెమటలు తప్పలేదంట. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అడగ్గానే టికెట్ల రేట్లు పెంచి మరీ సినిమా వాళ్లను సంతోషపెట్టేనాయే. గా ఏపీలో మాత్రం పప్పులు ఉడకకపాయే. మూడుచెరువుల నీళ్లు తాగించబట్టే. తీన్మార్ డ్యాన్స్‌లు చేసినా ఇంకా జీవో రాకపోయే. ఆచార్య, బాహుబలి, శ్రీమంతుడు పోయినా మంచిది నెలాఖరుల్లోగా సమస్యలు పరిష్కరిస్తా అని చెవుల్లో పూలుబెట్టిమరీ సాగనంపే. సమజదైనుకుంట. ఉంట మరీ!!
- బి.బసవపున్నయ్య