Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మూడ్‌ను తిప్పేసింది. అష్టకష్టాలు పడిన చిత్ర సీమ మళ్లీ పట్టాలెక్కింది. కొన్ని రీమేక్ చిత్రాల హవా నడుస్తున్నది. తాజాగా జనసేన అధ్యక్షులు, కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్‌లో మంచి పాలోయింగ్ ఉన్న పవన్ నటించిన చిత్రాల్లో బీమ్లానాయక్ రికార్డులు బ్రేకు చేస్తున్నదంటూ రివ్య్వూలు రాస్తున్నారు. సాధారణంగా థియోటర్లలో నాలుగు షోలు వేస్తారు. పవన్ అభిమానుల కోరిక మేరకు ఐదు షోలు కూడా వేస్తున్నారు. కథ చిన్నదైనా పెద్ద హిట్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ వినిపిస్తున్నది. చిత్ర యూనిట్ అంతా సక్సెస్‌ను ఎంజారు చేస్తున్నారు. బీమ్లా నాయక్ మలయాళం రిమేక్. ఇది తెలుగులో హిట్ కొట్టడంతో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలపై ఆరా తీస్తున్నారట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాఢ్‌ఫాదర్ చిత్రం కూడా మలయళం రీమేక్ అని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం మలయళంలో కలెక్షన్ల వర్షం కురిపించిందట. అందుకే తెలుగు భాషలో చేసేటప్పుడు మెగా స్టార్‌తోనే ఈ చిత్రం చేయాలని దర్శకుడు సిద్ధమయ్యారు. రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ చిత్రం కూడా మలయళంలో మంచి పాపులరైంది. దాన్ని కూడా రీమేక్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చిత్రసీమ భావిస్తున్నది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్వయాన తన బావమర్ది నార్ని నితిన్ చంద్రను త్వరలో తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారట. దానికి కూడా మలయాళంలో హిట్ అయిన చిత్రాన్నే ఎంచుకున్నారట. హిట్ సినిమాతో పరిచయం చేయడం ద్వారా ఆ సినిమా విజయవంతమైతే హీరోకు మంచి పేరొచ్చే అవకాశం ఉందనే నమ్మకంతో చాలా మంది హీరోలు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. రీమేక్...రిజల్ట్... ఓ నమ్మకం. ఇదే తాజాగా తెలుగు చిత్రసీమను నడిపిస్తున్నది.
- గుడిగ రఘు