Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన భారతదేశంలోని రాజకీయ, సామాజిక మార్పులను అధ్యయనం చేశారు. హిందుత్వ భావనలోని లక్షణాలను ముందుగా విశ్లేషించి, దాని పిండం ఫాసిజం అని తేల్చారు. మార్కి ్సస్ట్ భావజాలం, వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సమావేశాలు సదస్సుల్లో మాట్లాడారు.. అన్నిటినీ కలిపి చూస్తే, ఐజాజ్ నిస్సందేహంగా అద్భుతమైన మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, ప్రముఖ ఆలోచనాపరుడు.
ఇరవయ్యో శతాబ్దపు ద్వితీయార్థ భాగంలో గొప్ప మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలలో ఒకడు. ఐజాజ్ అహ్మద్. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. పన్నెండేండ్ల వయసులో కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లారు. కాలేజీ విద్య అక్కడే సాగింది. పాకిస్థాన్‌లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించిన సమయం అది. అక్కడ వామపక్ష ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ టీచర్‌గా చేరారు ఆయన గాలిబ్‌పై మొదటి వ్యాసం రాశారు. అక్కడి నుంచి విమర్శనాత్మక సాహిత్య వ్యాసాల పరంపర మొదలైంది. అనతి కాలంలోనే అమెరికన్ అకడెమిక్ కమ్యూనిటీలో మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక అధ్యయనంపై కూడా గట్టి పట్టు సంపాదించారు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలపై ఆధారపడిన విమర్శనాత్మక సాహితీ విమర్శకుడిగా పేరొందారు. భారతదేశానికి రాకముందు, ఆయన 'ఇన్ థియరీ: క్లాసెస్, నేషన్స్ అండ్ లిటరేచర్' అనే పుస్తకాన్ని రాశారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత వచ్చిన ప్రసిద్ధ మార్క్సిస్ట్ గ్రంథంగా ఇది నిలిచింది. మార్క్సిజం అప్రస్తుతమని, మనకు కొత్త సిద్ధాంతాలు అవసరమని వాదించే పోస్ట్ మాడర్నిజం వంటి అన్ని పోస్ట్-మార్క్సిస్ట్ సిద్ధాంతాలను ఇది ఖండించింది. 80, 90 దశకాలలో పశ్చిమ దేశాలలో పోస్ట్ మోడర్నిజాన్ని విద్య, అకడమిక్ క్యాంపస్‌లలో పోస్ట్ మాడర్నిజం ఒక ఆధిపత్య భావజాలంగా చలామణిలో ఉంది. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ పోస్ట్ మోడర్నిజంలోని లోపాలు, బలహీనతలను ఎత్తిచూపడం ద్వారా మార్క్సిజాన్ని సమకాలీన సందర్భా లతో ముడిపెట్టడం ద్వారా ఐజాజ్ అహ్మద్ చేసిన కృషి ప్రశంస నీయం. ఇజాజ్ ఇండియా లోనే ఉండాలనుకున్నారు. భారతదేశం లో జన్మించిన ఆయన తనను తాను భారతీయుడిగా భావించా రు. 1991 నుండి 2014 వరకు ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశంలో గడిపారు. ఈ కాలంలో గొప్ప రచనలు చేశారు. సోవియట్ అనంతర ప్రపంచంలో సామ్రాజ్యవాదంలేదని వాదించిన కాలం అది. సామ్రాజ్యవాదం లేని ఏకధ్రువ ప్రపంచ భావన బలంగా ఉన్న కాలం అది. సామ్రాజ్యవాదం ప్రపంచంపై ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నదో బయటపెడుతూ ఆయన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు.. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపైన, అలాగే ఇతర సామ్రాజ్యవాద దండయాత్రల గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ఆధునిక సామ్రాజ్యవాద లక్షణాలను ఐజాజ్ అద్భుతంగా వివరించాడు.
ఆయన భారతదేశంలోని రాజకీయ, సామాజిక మార్పులను అధ్యయనం చేశారు. హిందుత్వ భావనలోని లక్షణాలను ముందుగా విశ్లేషించి, దాని పిండం ఫాసిజం అని తేల్చారు. భారతదేశంలోని హిందుత్వ ధోరణిని ఇటాలియన్ ఫాసిజంతో పోల్చారు. జర్మనీ వంటి ఆధునిక పెట్టుబడిదారీ దేశం కానప్పటికీ ఇటలీలో ఫాసిజం మొలకెత్తింది. ఇటలీలో ఫాసిజం అభివృద్ధికి దారితీసిన అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలు భారతదేశంలో ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైనప్పుడు ఆయన 'అయోధ్య శిథిలాల మీద' అనే వ్యాసం రాశారు. తక్కువ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశంలో కూడా ఫాసిజం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఫాసిజం పుడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పాలకవర్గం లేదా బూర్జువావర్గం ఫాసిజం వైపు మొగ్గు చూపుతుంది. అయితే, ఫాసిజం ఇటలీ వంటి తక్కువ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో పుట్టిందని, దాని సంకేతాలు భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐజాజ్ ఎత్తి చూపారు.
ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క వ్యవస్థాగత సంక్షోభానికి, ప్రపంచవ్యాపితంగా మితవాద శక్తులు తలెత్తుతుండడానికి మధ్య లింకును వివరించారు.. ఈ అంశంపై అనేక వ్యాసాలు పుస్తకాలు రాశారు. ఫ్రంట్‌లైన్ పత్రికలో ఆయన వ్యాసాలు పరంపరగా వచ్చాయి. మార్క్సిస్ట్ భావజాలం, వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సమావేశాలు సదస్సుల్లో మాట్లాడారు.. అన్నిటినీ కలిపి చూస్తే, ఐజాజ్ నిస్సందేహంగా అద్భుతమైన మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, ప్రముఖ ఆలోచనాపరుడు.
ఐజాజ్ అహ్మద్ చిన్నతనంలో పాకిస్థాన్ పౌరుడిగా మారవలసి వచ్చింది. భారత ప్రభుత్వం ఇక్కడి చటాల వల్ల ఆయనకు పౌరసత్వం లభించలేదు. వీసా సాయంతో భారత్‌లో కొంత కాలం ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దీర్ఘకాలిక వీసాపై ఉండేందుకు అనుమతించబోమని చెప్పడంతో 2014లో అమెరికాకు వెళ్లి, కాలిఫోర్నియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా మళ్లీ మారారు. గత ఎనిమిదేండ్లుగా, ఐజాజ్ తన మాతృభూమి నుండి తనను తాను ప్రవాసిగా ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న సమయంలో చివరి దాకా రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం తరగతులు బోధించడం వంటివి కొనసాగించిన ఐజాజ్ అహ్మద్ ధన్యజీవి.
- ప్రకాశ్ కరత్