Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్ళు గెలుస్తూనే వున్నారు
ప్రజలు ఓడిపోతూ వున్నారు
మెదడును మార్చే మత్తు మందు చల్లి
వాళ్ళు గెలుస్తూనే వున్నారు
ప్రజలు వంచించబడుతూ వున్నారు
ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెంచుతూ
వాళ్ళు గెలుస్తూనే వున్నారు
ప్రజలు మోసపోతూ వున్నారు
విగ్రహాలెత్తు పెంచుతూ
వాళ్ళు గెలుస్తూనే వున్నారు
ప్రజలు దగా పడుతూ వున్నారు
ఏదో ఒక బూచిని చూపెడుతూ
వాళ్ళు గెలుస్తూనే వున్నారు
ప్రజలు మరల ఓడిపోతూ వున్నారు
కానీ అక్కడో ఇక్కడో
ప్రజలు ఒక్కటవుతున్నారు
రెప్పలపై మాయ పొరలు తెగ్గోసి
విజయం వైపు అడుగులు వేస్తూ వున్నారు!
- కెక్యూబ్, 9493436277