Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్గ శత్రువు కదలికలను పసిగట్టడంలో ఏమరుపాటుకు
తావీయకూడదనే విషయం మరిచి పోకూడదు. ఒక
ప్రాంతంలో, ఒక ఎన్నికలలో అధికారం చేజారి పోతుందని
అర్థం అయినందుకు వర్గ శత్రువు ఇంత క్రూరంగా
స్పందించారంటే, దేశ వ్యాప్తంగా విప్లవం సంభవించి
అధికారానికి, ఆస్తులకు శాశ్వతంగా దూరం అయ్యే
పరిస్థితి వస్తే వారి రియాక్షన్ ఏస్థాయిలో ఉంటుందో అర్థం
చేసుకోవచ్చు. చీమేని ఊచకోత ఘటన హృదయాన్ని
కలిచివేసింది. అక్కడి నుంచి భారంగా బయలుదేరి
కేరళను కుదిపేసిన యువజన పోరాట కేంద్రం, పాలకులు
ఐదుగురు నవ యువకుల ప్రాణాలను బలిగొన్న
కూతుపరంబ వైపు సాగింది మా పయనం.
చీమేనీ దారిలో మా వాహనం దూసుకుపోతున్నది. ఇసుక తో కూడిన ఎర్రనేల భూములు, కొండలు, లోయలు ఉన్న ప్రాంతం. జీడి మామిడి తోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రబ్బరు చెట్లు, పోక చెట్లు విరివిగా ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుంటూ చీమేని గ్రామంలోని కాలి, కూలిపోయి శిథిలావస్థలో ఉన్న ఒక గది, వసారా గల చిన్న ఇంటి ఆవరణ ముందు ఆగింది మా వాహనం. ఇదేమిటని మాతో వచ్చిన కామ్రేడ్‌ను అడగగానే ఇక్కడే కాంగ్రెస్ మూకలు పార్టీ ఆఫీసును తగులబెట్టి, ఐదుగురు కామ్రేడ్లను దారుణంగా నరికి చంపారని, కొంతమంది కాళ్ళు, చేతులు నరికారని చెప్పాడు. ఆయన చెప్పింది విని ఒళ్ళు జలదరించింది. మారణకాండ జరిగిన మరుభూమిలో నిలబడిన భావన కలిగింది.
భగ భగ మండే కొలిమిలో కూడా బతికి బయటపడిన వారిని చూడాలంటే మనం చీమేని చూడాల్సిందే. చీమేనీ ఊచకోత ఈతరం పదేపదే గుర్తు చేసుకోవాల్సిన చీకటి చరిత్ర. అహింస వాదులమని చిలక పలుకులు పలికే కాంగ్రెస్ సాగించిన హింసాకాండ. మార్చి 23, 1987 చీమేని మారణకాండ జరిగిన రోజు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సాయంత్రం వందల మంది కాంగ్రెస్ మూకలు సీపీఐ(ఎం) చీమేని స్థానిక కమిటీ ఆఫీసును చుట్టుముట్టి, నిప్పుపెట్టి, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐదుగురు సీపీఐ(ఎం) కార్యకర్తలను అత్యంత కిరాతకంగా నరికి చంపారు.
చీమేని అప్పుడు కాసరగోడ్ జిల్లాలోని త్రికరిప్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న గ్రామం. చీమేని, దాని పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ గూండాల ఆటస్థలం. కమ్యూనిస్టులను, పేదలను బెదిరించి అణచివేతకు గురిచేసిన కాలం అది. అప్పటి దారుణ మారణకాండకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ స్థానిక సీపీఐ(ఎం) పార్టీ కమిటీ కార్యాలయం చీమేని కాంగ్రెస్ నియోజకవర్గ కమిటీ కార్యాలయం పక్కనే ఉంది.
అక్కడి నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. బయటనుండి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఊహించకుండా లోపల పోలింగ్ సమీక్ష సమావేశానికి హాజరైన సీపీఐ(ఎం) కార్యకర్తలున్నారు. ఆఫీసు ఆవరణలో కొంతమంది పురుష, మహిళా కార్యకర్తలు, వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. వారు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దుండగులు ఆఫీసు బయట నిలబడిన వారిని గొడ్డళ్లతో, కత్తులతో నరకడం, కర్రలతో కొట్టడం ప్రారంభించారు. అకస్మాత్తు దాడి నుంచి బయట పడటానికి కొంత మంది పారిపోయి తప్పించుకున్నారు. మిగిలిన వారు పార్టీ కార్యాలయంలోకి పరిగెత్తారు. ఆఫీసు లోపలికి వెళ్ళిన వారు తలుపులు, కిటికీలు మూసుకున్నారు. అయినా దుండగులు వదలలేదు, కార్యాలయం కిటికీలు, తలుపులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్న వాళ్ళు బెంచీలు, టేబుల్స్ తలుపులకు సపోర్ట్‌గా పెట్టి గూండాలు లోనికి రాకుండా అడ్డుకొన్నారు. అయితే ఆ ప్రతిఘటన ఎక్కువ కాలం నిలవలేదు. దుండగులు కిటికీల తలుపులను ధ్వంసం చేశారు. ఆఫీసు లోపలి నుంచి బయటికి వచ్చే వారిని నరికివేయాలని మారణా యుధాలతో కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ తర్వాత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే దారుణం జరిగింది. లోపల ఉన్న కామ్రేడ్స్‌ను సజీవ దహనం చేయాలనే దురుద్దేశ్యంతో ఇంటి పైకప్పుకు ఉపయో గించే గడ్డి కట్టలు తెచ్చి పగిలిన కిటికీలోంచి కార్యాలయంలోకి విసిరేసి, కిరోసిన్‌ను గడ్డిపై పోసి నిప్పంటిం చారు. ఆఫీసులో మంటలు వ్యాపిం చాయి. లోపల ఉన్న కామ్రేడ్లు మత్యువును ముఖా ముఖిగా చూశారు. మంటలు చెలరేగుతున్నాయి. ఆఫీసు అగ్ని గుండంగా మారిపోయింది.
లోపలివారు తప్పించుకో వడానికి దారి వెతికారు. బయట దాడి చేసే గుండాలు నరికివేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోపల నిప్పుల గుండం కాలిపోతోంది. మంటలు, పొగ తట్టుకోలేక లోపలి వారు తలుపులు తీశారు. మంటల నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగులు తీసారు. పోగతో ఊపిరాడక, కండ్లకు మూసుకుని బయటకు పరిగెడుతూ వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే చుట్టుముట్టి ముక్కలుగా నరికారు. ఇది ఎంతటి దారుణమో ఆలోచించండి. అహింసావాదులమని నీతీ వాక్యాలు చెప్పే కాంగ్రెసోళ్లు సాగించిన క్రూరమైన వేట. వేటగాళ్లు కూడా ఇంత క్రూరంగా ఉండగలరా?
పి కుంజప్పన్, ఎం కొరాన్, అలువలప్పిల్ అంబు, చలీల్ ఖురాన్ లను పార్టీ కార్యాలయ ఆవరణ లోనే ముక్కలుగా నరికి చంపారు. గడ్డిలో చుట్టి కిరోసిన్ పోసి తగల బెట్టారు. పోలింగ్ బూత్ ఇన్చార్జ్గా ఉన్న స్థానిక కమిటీ సభ్యుడు కెవి కుంజికన్నన్ ఆఫీసుకు కొంత దూరంలో ఉన్న బస్టాండ్ వద్ద బస్ కోసం నిల్చున్నాడు. అతన్ని బస్టాండ్ నుంచి పట్టుకుని వచ్చి అంగుళం అంగుళం రాళ్ళతో కొట్టి చంపారు. చంపడానికి ముందు, అతని అవయవాలను ఛేదించారు. అనేక మందిని క్రూరంగా హింసించారు. తీవ్రంగా గాయపడి చెల్లా చెదురుగా పడివున్న వారిని దుండగులు చనిపోయారనుకొని వదిలేశారు. అందుకే కొందరు తప్పించుకోగలిగారు. సమీ పంలో పోలీసు చెక్‌పోస్టు ఉంది కానీ ఒక్క పోలీసు కూడా అటువైపు రాలేదు. ఆఫీసు ప్రాంగణం యుద్ధ రంగంలా వుంది. ముక్కలుగా నరకబడి, తగలబెట్టడిన అమరుల మతదేహాలు ఒకవైపు, కాళ్ళు చేతులు నరికబడి, కడుపులో కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి మత్యువుతో పోరాడుతున్న క్షతగాత్రులు మరోవైపు. తగలబడి పోతున్న ఆఫీసు. ఎంతటి అమానవీయ దశ్యం. అందుకే ఇఎంఎస్ దీనిని రెండవ జలియన్‌వాలాబాగ్ అన్నాడు. ఐదుగురు అమరుల అంతిమ యాత్ర చీమేని నుంచి కయ్యూరు వరకు సాగింది. కయ్యూర్లో అమరులందరికి ఒకే చోట అంత్యక్రియలు చేశారు. ఆ స్థలంలో అమరుల స్మారక స్థూపం నిర్మించారు. హత్యగావించబడిన ఆఫీసు ప్రాంగణం కాంగ్రెస్ మూకల మారణకాండను ఎత్తి చూపుతూ సజీవ సాక్ష్యంగా నేటికీ నిలిచి ఉంది. అక్కడ ఎలాంటి మార్పులు చేయకుండా పార్టీ దానిని అలాగే ఉంచింది.
ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కరుణాకరన్ నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే త్రికరిప్పూర్ నియోజకవర్గంలో నయనార్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.ఏ ఎర్రజెండాను చీమేని ప్రాంతంలో లేకుండా చేయాలని శత్రువు భయోత్పాతం సష్టించారో, ఆ ఎర్ర జెండానే నేడు చీమేని ప్రాంతంలో వాడవాడలా ఎగురుతోంది. చీమేని అమరుల త్యాగాలను రోజు స్మరిస్తోంది.
వర్గ శత్రువు కదలికలను పసిగట్టడంలో ఏమరుపాటుకు తావీయకూడదనే విషయం మరిచి పోకూడదు. ఒక ప్రాంతంలో, ఒక ఎన్నికలలో అధికారం చేజారి పోతుందని అర్థం అయినందుకు వర్గ శత్రువు ఇంత క్రూరంగా స్పందించారంటే, దేశ వ్యాప్తంగా విప్లవం సంభవించి అధికారానికి, ఆస్తులకు శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి వస్తే వారి రియాక్షన్ ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
చీమేని ఊచకోత ఘటన హృద యాన్ని కలిచివేసింది. అక్కడి నుంచి భారంగా బయలుదేరి కేరళను కుదిపేసిన యువజన పోరాట కేంద్రం, పాలకులు ఐదుగురు నవ యువకుల ప్రాణాలను బలిగొన్న కూతుపరంబ వైపు సాగింది మా పయనం.
- మహమ్మద్ అబ్బాస్