Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా ముందు తాము చేసి మిగతా వాళ్లకు ఇదిగో అని చూపెట్టడం ఒక ఆదర్శం. ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థలను క్రమంగా బలోపేతం చేస్తూ ఆ రెండింటినీ పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందజేసే క్రమంలో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ముందువరుసలో ఉన్నది. ఢిల్లీలోని ఆఫ్ ప్రభుత్వమూ ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నదీ, దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదీ బీజేపీ పార్టీనే. కానీ బీజేపీ సర్కార్లు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నవి. అందులో భాగంగానే యూనివర్సిటీల ప్రయివేటీకరణ అనేది జగమెరిగిన సత్యం. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో చిన్న పిల్లలు చనిపోయిన విషయమూ తెలిసిందే. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి. ఇదీ బీజేపీ పరిపాలనా విధానం. గసోంటి పార్టీ నేతలు తెలంగాణలో మాత్రం ఉచిత విద్య, వైద్యం అందిస్త రంట. గీ మాట వింటుంటే దయ్యాలే వేదాలను వళ్లిస్తు న్నట్టు లేదూ! నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా బీజేపీ తెలం గాణ నేతలు మాట్లాడుతుంటే జనాలంతా..గాడ జేయనోళ్లు గీడ జేస్తరా? అని డౌటు పడుతుండ్రు. బండీ గిదేం తొండి!.
- ప్రజ్వాన్షి