Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అన్ని రంగాల్లోనూ దేశాన్ని బీజేపీ నాశనం చేస్తున్నది. దేశం ఎక్కడకు పోతున్నది? మత విద్వేషం మంచిదా? ఏం సాధించగలం? విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడమేంటి? విద్వేషాలతో పెట్టుబడులు వస్తాయా?' ప్లీనరీలో సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు. గా స్పీచ్ వింటున్నోళ్లంతా అబ్బా ఎంత మంచిగ మాట్లాడుతున్నడు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది పొందుతున్న బీజేపీ పార్టీని తూర్పారబడుతున్నడు అనుకునే లోపే చావు కబురు చల్లంగా చెప్పిండు. 'వాణ్ని దించి వీణ్ని, వీణ్ని దించి వాణ్ని గద్దెనెక్కించే పద్ధతులకు నేను వ్యతిరేకం. బీజేపీ పార్టీని గద్దె దించడం నా లక్ష్యం కాదు' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. కాసేపు ఆగాక 'ఇప్పుడు దేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా, ప్రత్యామ్నాయ ప్రజల అజెండా కావాలి' అని మాట్లాడిండు. ఓ పక్క బీజేపీతో పోరాడుతా అంటడు..గంతల్నే గద్దె దింపనంటడు...కొద్దిసేపటికే ఆ విధానాలను తిప్పికొట్టే ప్రత్యామ్నాయ ప్రజల ఎజెండా కావాలంటడు..? ఈ మూడెట్ల సాధ్యమవుతారు? ఇగ జీవితంలో ఎవడికి కేసీఆర్ అర్థం కాడుర బై అనుకుంటున్నరు జనాలు. సీఎం కేసీఆర్ పైపైకి గంభీరాలకు పోతూ లోలోపల బీజేపీతో చెలిమి చేస్తున్నడా? కేంద్ర మంత్రులు కేసీఆర్ పాలనను పొగడటం..రాష్ట్ర నాయకులు దునుమాడటం, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను పొగిడేయటం..రాష్ట్ర నేతలను మాటలతో చెడుగుడు ఆడుకోవటం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవార్డుల మీద అవార్డులు ఇచ్చేయడం లాంటి పరిణామాలను చూస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటేనా? లేక నిజంగా ప్రత్నామ్నాయ ఎజెండాతో ముందుకెళ్తారా? దేశ రాజకీయాల్లో ఒంటరి పోరుచేయగడా? తుస్సుమంటాడా? ఇంతకూ సీఎం కేసీఆర్ ఆ గట్టునుంటాడా? ఈ గట్టునుంటాడా? అర్థంకాక సవాలక్ష ధర్మ సందేహాలు ఇప్పుడు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
- ప్రశాంత్