Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉర్దూలో గ్రూప్-1, గ్రూపు-2 తదితర పరీక్షలు నిర్వహిస్తే ఆ భాష వచ్చినోళ్లే పేపర్లు దిద్దుతరు, వాళ్లే పోస్టులన్నీ కొట్టుకుపోతరు. ఓవైసీ మెప్పు పొందేందుకే కేసీఆర్్ గిట్ల చేస్తుండు. సీఎం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని నష్టం జరుగుతున్నది' మహబూబ్నగర్ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు వ్యాఖ్యలివి. ఆయన కామెంట్లపై పలువురు ఆ రోజే సెటైర్లు విసిరారు. 'బండన్నా... యూపీలో కూడా ఉర్దూ ఆప్షన్ ఉంది కదా..?' అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గాలంత దీసిండు. అయినా ఓ డౌటనుమానం!! బోయినపల్లి సారు చెప్పినట్టు యూపీలో గట్లనే చేస్తున్నరు గదాన్నా? అక్కడి అసెంబ్లీ ఎలక్షన్లలో ఎంఐఎం వందకుపైగా సీట్లలో పోటీ చేసి బీజేపీయేతర ఓట్లను చీల్చి మీ (బీజేపీ) పార్టోళ్లను గద్దెనెక్కించింది నిజమేనంటూ లోకం కోడై కూస్తున్నది. బండన్నా... మరో ధర్మసందేహం, యూపీలో మీరు గట్ల చేస్తున్నరు కనుకనే తెలంగాణలో గిట్ల మాట్లాడుతున్నారని అనుకోవాల్నా..? అయినా ఏ విషయంలోనైనా చిన్న రంధ్రంలో వేలు పెట్టి పెద్దగ చేసి చూపెట్టడం మీకు పరిపాటే.. మీకు అలవాటే...
- అచ్చిన ప్రశాంత్