Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమిటా చూపులు?
అదేదో క్యాన్వాసు గుడ్డపై
ఆధునికత్వం విసిరిన
మోడ్రన్ ఆర్ట్ విదిలింపనుకున్నావా?
డిజిటల్ స్క్రీన్‌పై
కోట్ల బడ్జెట్ పెట్టిన
సినీ బిజినెస్ ఇన్వెస్టుమెంటనుకున్నావా?
రాబోయే ఎలెక్షన్లకై
కొత్త జెండా డిజైననుకున్నావా?
ప్రశ్నించే భవిష్యత్ అది... ఆ రక్తం రైతన్నది!
పగిలింది గుండె కాదు
చచ్చింది చచ్చి పోతున్నది మనిషో, జంతువో కాదు
కుళ్ళిపోతుందని
ఎలాగైనా పాతేయటానికి
అది ఆకలి తీర్చే వృత్తివిద్య!
అసలీ లోకాన్నే బతికించే మూల కక్ష్య!!
అది గాయపడితే
వచ్చిన మరక అది...
గాయం కనబడలేదనకు
కారణం కనుగొనేందుకు వెదుకు
గాయాలవకుండా ఉండేందుకు
ఉపాయాలు వెదుకు
రైతు ఎదిగేందుకు మార్గం వెదుకు
అతనానందంగా ఉండేందుకు
ఎన్ని పథకాలైనా తీసుకురా ముందుకు!!
- డాక్టర్ గాదిరాజు మధుసూదన రాజు