Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూఢవిశ్వాసాలు ఉండటానికి కారణం అజ్ఞానమనీ, అందుకు అవిద్యే కారణమనీ అన్నాడు రారు. ''హేతువాదానికి పొసగే విషయాన్ని ఒక పాపాయి చెప్పినా అంగీకరించాలి. బ్రహ్మ అంతటివాడు చెప్పినా హేతువాదానికి సరిపడని అంశాలను ఒప్పకూడదు'' అన్నాడు. హేతుబద్ధమూ, వైజ్ఞానికమూ అయిన విద్య అవసరమని భావించాడు. జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనిక, గణిత శాస్త్రాలు బోధించాలని కోరాడు. వితంతువుల ప్రాణాలను ఆచారం పేర అగ్నికి బలికాకుండా నిలిపి వేసే చట్టాన్ని తీసుకురావడంలో రారు చేసిన కృషి మరువలేని చారిత్రక విషయం.
అనాగరిక సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడి, బ్రిటిషు ప్రభుత్వంచేత ఆ దురాచారాన్ని రద్దు చేయించిన వ్యక్తిగా అందరికీ తెలిసిన సంస్కర్త రాజా రామమోహన రారు. దేశ దేశాల ప్రజలకు వివిధ అంశాలలో ఆదర్శప్రాయంగా నిలిచిన రాజా రామమోహన రారు 250వ జయంతి సందర్భమిది.
1770 నాటికి నేడు భారతదేశంగా చెప్పబడుతున్న దేశ చరిత్రలో అంధకార యుగం. హిందూ రాజుల పాలన అంతరించి ముస్లిం పాదుషాల పాలన కూడా ముక్కలవుతున్నది. ఆంగ్లేయ సామ్రాజ్యం స్థిరపడుతున్నది. అలాంటి పరిస్థితిలో జన్మించి జీవించిన వాడు రామమోహన రారు. 1772 మే 22న బెంగాల్‌లోని రాధానగర్ అనే గ్రామంలో పూల్ ఠాకూరాణి, రమాకాంత్ రారు అనే దంపతులకు రామ మోహనరారు జన్మించాడు. రారు ప్రాధమిక విద్య స్వగ్రామంలోనే పూర్తి చేసి బెంగాలీతో పాటు పార్శీ భాషను కూడా నేర్చుకున్నాడు. ముస్లిం రాజుల వద్ద పనిచేస్తున్న తండ్రి రారుని ఉన్నత చదువుల కోసం పాట్నా పంపాడు. అక్కడ అరబ్బీ నేర్చుకున్నాడు. ఖురాన్ చదివాడు. యాక్లిడ్, అరిస్టాటిల్ తత్వవేత్తల రచనలు చదివాడు. దాంతో రారులో తార్కిక శక్తి పెంపొందింది. అదే జీవితంలో రారును ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది. 16ఏండ్ల వయసులోనే హిందూ మతంలోని విగ్రహాల పూజలు, ఇతర మూఢాచారాలపై ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయడానికి రారు పూనుకున్నాడు. ఈ రచన విషయం తెలిసిన తండ్రి కొడుకు మీద కోపించి హెచ్చరించినా రారు పట్టించుకోక పోవడంతో రారుని ఇంటినుండి గెంటివేసాడు.
సంచార జీవితంతో ప్రాపంచిక జ్ఞానం: గమ్యంలేకుండా తిరగడం ప్రారంభించిన రారు టిబెట్‌కు వెళ్లాడు. అక్కడ బౌద్ధమతం వ్యాప్తిలో ఉంది. హిందూ, ముస్లిం, క్రైస్తవాలు దైవ విశ్వాసంపై ఆధారపడి రూపొందినవి కాగా బౌద్ధం, జైనం మాత్రం దేవుడిని నమ్మవు. శీలానికి విలువ ఇస్తాయి. అహింసకు పట్టం కడతాయి. అయినా టిబెట్‌లోని వారు బుద్ధ విగ్రహాలను ఆరాధించేవారు. అక్కడ ఆచరణ కంటే ఆచారాలు, ఆరాధనలే ఎక్కువగా కన్పించాయి. ఇదేమిటని ప్రశ్నించిన రారు అక్కడి లామాల క్రోధానికి గురయ్యాడు. అక్కడినుండి కాశీ చేరి అక్కడ పండితులను సేవించి సంస్కృతం నేర్చుకుని హిందూ వేదాంతాన్ని అధ్యయనం చేసాడు. కాశీ నుండి ముర్షిదాబాద్ వెళ్లాడు. ''ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక'' అనే గ్రంథాన్ని రారు అక్కడే రాసాడు. మూఢవిశ్వాసాలు ఉండటానికి కారణం అజ్ఞానమనీ, అందుకు అవిద్యే కారణమనీ అన్నాడు రారు.
ఉద్యోగం సమయంలోనూ సమతాభావం పెంచుకున్న రారు: ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసాడు. అక్కడకు వచ్చే ఇంగ్లీషు పత్రికల ద్వారా ఐరోపా రాజకీయాలు తెలుసుకునేవాడు. తర్వాత కలకత్తా వచ్చి నౌకరీతో కాలం వెళ్ల బుచ్చడం ఇష్టం లేక ప్రజల్ని వివేకవంతులను చేయాలని సంకల్పించాడు. రచనలు, ప్రచురణలు, సభలు-పండిత గోష్టులు దినచర్యగా చేసుకున్నాడు. ''హేతువాదానికి పొసగే విషయాన్ని ఒక పాపాయి చెప్పినా అంగీకరించాలి. బ్రహ్మ అంతటివాడు చెప్పినా హేతువాదానికి సరిపడని అంశాలను ఒప్పకూడదు'' అన్నాడు. 1815లో కలకత్తాలో 'ఆత్మీయ సభ'ను నెలకొల్పాడు. జనంలో విజ్ఞానాన్ని పెంచి సంఘసంస్కారాన్ని కలిగించే కృషి సాగించాడు. కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. 1815లోనే 'వేదాంత సూత్రము'ను సంస్కృతం నుడి బెంగాలీ లోనికి అనువదించాడు. తర్వాత దాన్ని వంగ భాషలోనికి తర్వాత ఆంగ్లభాషలోకి మార్చాడు. 1817లో కంఠోపనిషత్తును, మాండూక్య ఉపనిషత్తును వంగ భాషలోకి తెచ్చాడు. 1823లో 'హిందూ స్త్రీలపై దురాక్రమణ' గ్రంథం రాసాడు.1827లో 'వజ్రరుచి' అనే మృత్యుజయుని సంస్కృత పుస్తకం ను ప్రచురించాడు. 1821లోనే 'కలకత్తా యూనిటేరియన్ సంస్థ' రామమోహన రారు మార్గదర్శకత్వంలో ఏర్పడింది. దాని లక్ష్యాలలో ''ఏవి విద్యవల్ల కలిగే లాభాలను వ్యాపింపచేస్తాయో, ఏది అజ్ఞానం, మూఢవిశ్వాసం, స్వమత దురాభిమానం, వెర్రి ఆవేశాలను నశింపచేస్తాయో, ఏవి నైతిక సిద్ధాంతాలను పరిశుభ్రపరుస్తాయో, ఏవి విశ్వ వ్యాపకమైన దయనూ, దానగుణాన్ని పెంపొందింప చేస్తాయో, అవన్నీటినీ నిర్మాణపరిధిలో చేర్చాడు. అసంఖ్యాకమైన సామాన్య ప్రజల పరిస్థితిని మెరుగు పరచటం, ప్రజలకు ఉపయోగకరమైన కళలను ప్రోత్సహించడం, శ్రమించే అలవాటును పెంపొందించడం సంస్థ లక్ష్యాలుగా ప్రకటించాడు. రారు ప్రాచీన గురుకుల విధానాన్ని, మత పురాణ సంస్కృత సాహిత్య బోధనను అభిమానించలేదు. ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకుని తిరగాలంటే హేతుబద్ధమూ, వైజ్ఞానికమూ అయిన విద్య అవసరమని భావించాడు. జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనిక, గణిత శాస్త్రాలు బోధించాలని కోరాడు.
కవి, వాగ్గేయకారుడు, సంస్కర్తగా: హిందీలో ఉండే ద్రుపద్ పద్ధతిలో గీతాలను రారు స్వయంగా రచించి, సంగీతం కూర్చి సమావేశాల్లో పాడారు. వంగ భాషలోకి హిందీ గేయాలను తర్జుమా చేసాడు. భావ గాంభీర్యం ఉన్నా, సంగీతాడంబరం లేకుండా పాడుకోవడానికి వీలుగా రారు పాటలు రచించాడు. హిందువులు అనుసరిస్తున్న మత విధానం వారి రాజకీయ వ్యవహారాలను మెరుపరుచు కోవడానికి వీలుకల్పించడం లేదనే భావన రారుకి ఉండేది. కులాలు, మతాలు ప్రజలలో చీలికలు కల్పించి సమైక్యతను భంగ పరుస్తున్నాయని, జాతీయ మానవతావాద దృష్టి రూపొందాలని తలపెట్టాడు. రాజకీయ సంస్కరణల్లో న్యాయ పరిపాలనను, పత్రికా స్వాతంత్య్రాన్ని కోరాడు. ఆర్థిక విషయాలలో జమిందారీ వ్యవస్థ దోపిడీని అరికట్టాలని కోరాడు. 1893 శాశ్వత కౌలుదారీ చట్టంతో జమిందారులే లాభపడ్డారని, పేదరైతులు మరీ దిగజారి పోయారని, కౌలు రేట్లు తగ్గించాలని 1832లో ప్రభుత్వాన్ని కోరాడు. రైతులు తాము పండించిన దినుసులు, కూరగాయలు మార్కెట్లో అమ్మకానికి తెచ్చినపుడు జమిందార్లు నిర్దయగా పన్నులు వసూలు చేయటాన్ని రద్దుచేయాలని కోరాడు. ప్రతి ఏటా పాలనా ఖర్చులు పేర ఇక్కడి నుండి ఇంగ్లండుకు కోట్లాది రూపాయలు తరలించుకుపోవడాన్ని పట్టికలతో సహా చూపించి నిరూపించి ప్రచారం చేసాడు.
స్త్రీల హక్కుల కోసం: స్త్రీలు అణచివేయబడటం రద్దుకావాడానికి తోడ్పడే ఒక సాధనంగా తల్లితండ్రుల ఆస్థిలో స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా ఆస్థిలో హక్కు కావాలని రారు కోరాడు. అందుకు ఆయన పురాతన ధర్మశాస్త్రాలను ఉటంకించుతూ వ్యాసాలు రాసి పత్రికలలో ప్రచురింపచేసాడు. భర్త చనిపోతే అతనితోపాటు భార్యను కూడా చితిమంటలలో వేసి కాల్చివేసే సతీ సేరుతో సాగుతున్న దురాచారాన్ని వ్యతిరేకించి చట్టపరంగా రద్దు చేయించడానికి చేసిన కృషి ద్వారా రారుకి అమిత ఖ్యాతి వచ్చింది. సతీ ఆచారానికి సంబంధించిన చారిత్రక, పురాణ ఆధారాలను అద్యయనం చేసాడు. పాతివ్రత్యం, స్వర్గకాంక్ష, సామాజిక పరిస్థితుల పేరుతో మహిళలను బలవంతంగా చనిపోయిన భర్త చితిమంటల మీద పడేసి, కట్టేసి, మంటలలోకి విసిరేసి చంపడాన్ని అసహ్యించుకున్నాడు. స్వయానా రారు వదిన గారు అలా బలవడంతో చాలా మనోవేదనకు గురయ్యాడు. 1828లో ఇండియాకు గవర్నర్ జనరల్‌గా వచ్చిన విలియం బెంటింగ్కు సతీ దురాచారానికి సంబంధించిన విషయం తెలిపాడు. ఈ దురాచారాన్ని ఖండిస్తూ 800 మంది ప్రముఖుల సంతకాలు, 120 మంది పండితుల అభిప్రాయాలను తన పిటిషన్‌కు జతపరిచి అందచేసాడు. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదంతో 4 డిసెంబర్ 1829న సతీ ఆచరణను రద్దుపరిచారు. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు. కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూర్ఖులు మహిళల్ని రెచ్చగొట్టి నాడు కలకత్తాలో 5000 మంది మహిళలతో ప్రదర్శన చేయించారు. చాదస్త పండితులు రారు హిందూ మత సంస్కృతిని భంగపరుస్తునట్టుగా భావించి లండన్ కౌన్సిల్‌కు, డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదులు చేసారు. రారును వారు వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానాన్ని విని వారు ఆ ఫిర్యాదులను కొట్టి వేసారు. వితంతువుల ప్రాణాలను ఆచారం పేర అగ్నికి బలికాకుండా నిలిపి వేసే చట్టాన్ని తీసుకురావడంలో రారు చేసిన కృషి మరువలేని చారిత్రక విషయం. 1833 సెప్టెంబర్ 27న రాజా రామ మోహనరారు మరణించారు. 16వ ఏటనుండి చని పోయేంతవరకూ సాహిత్యారాధకుడు, సాంఘిక ప్రయోజన సాధకుడుగా జీవించాడు. రారు హేతువాది. గొప్ప సమతా వాది.
(మే 22 రాజారామ్మోహన్ రారు 250వ జయంతి సందర్భంగా)
- గుడిపాటి నరసింహారావు,
సెల్:9490098559