Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో హిందువులు లెక్కలేనన్ని బౌద్ధారామాలు కూల్చేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించారు. ఒకప్పుడు భారత దేశంలో హిందూ మత పెద్దలు (అప్పుడు వైదిక మతం. హిందూ అనే పదం ఎక్కడా లేదు) అశోక చక్రవర్తి కృషి ఫలితంగా దేశమంతా వ్యాపించిన బౌద్ధమతాన్ని చూసి, ప్రజల్లో దానికున్న ఆదరాభిమానాలు చూసి ఎక్కడ తమ మతం అంతరించిపోతుందో, తమ ప్రాభల్యం ఎక్కడ తగ్గిపోతుందోనని గజగజా వణికిపోయారు. అశోక చక్రవర్తి మనవడు మౌర్య వంశపు చిట్టచివరి రాజు బృహద్రధుడ్ని ఆయన సేనాధిపతి అయిన పుష్యమిత్రుడు అనే బ్రాహ్మణుడు హత్య చేసి అధికారాన్ని లాక్కుని పాటలీపుత్రకు తానే రాజుగా ప్రకటించుకుని శృంగ వంశాన్ని స్థాపించాడు.
క్రీ.పూ. 187 నుండి క్రీ.పూ. 151 వరకు 36 ఏండ్లు పాలించిన పుష్యమిత్రుడు బౌద్ధమతం మీద ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కాడంటే, బౌద్ధ సన్యాసుల్ని అత్యంత కర్కశంగా హింసించి, కనిపించినవారినల్లా ఊచకోతలు కోశాడు. నరరూప రాక్షసుడిలా వారిని చీల్చి చండాడటమే కాక బౌద్ధ మతస్థుల తలలు నరికి తెచ్చినవారికి భారీ ఎత్తున బహుమతులు ఇచ్చేవాడు. బ్రాహ్మణ మతాన్ని పటిష్టం చేయడానికి దేశ విదేశాల్లో బౌద్ధ, జైన మత వ్యతిరేకులతో ఏకమై, అప్పటివరకూ ఉన్న పురాణాలు కొత్త కథలతో తిరగరాసి, మను ధర్మశాస్త్రం వంటి పాశవిక రచనలకు శ్రీకారం చుట్టి బౌద్ధాన్ని దేశంలో దుర్మార్గంగా అణచివేశారు. బౌద్ధ ఆరామాలన్నింటినీ ధ్వంసం చేసి వాటి స్థానంలో హిందూ దేవుళ్ళకు గుళ్ళు కట్టారు.
ఇప్పుడు భూలోక వైకుంఠంగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బౌద్ధ ఆరామమే. అక్కడ ఉన్నది ''బాలా'' (స్త్రీ) అనే బౌద్ధ సన్యాసిని విగ్రహం అనడానికి చారిత్రిక ఆధారాలు చాలా ఉన్నాయి. ఉత్తర భారతీయులు ఆ విగ్రహాన్ని ఇప్పటికీ ''బాలాజీ'' అనే అంటారు. అప్పట్లో హిందూ మతంలో మూడు కేటగిరీలు ఉండేవి. శాక్తేయులు (శక్తిని అంటే అమ్మవారిని పూజించేవారు), శైవులు (శివ భక్తులు), వైష్ణవులు (విష్ణు భక్తులు), ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళు మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్పని ఎప్పుడూ కొట్టుకు చస్తుండేవారు. తిరుమలలో ఉన్న బౌద్ధ సన్యాసిని విగ్రహాన్ని మొదట శాక్తేయులు ఆక్రమించుకుని చాలా కాలం అమ్మవారిగా (స్త్రీ దేవతగానే) పూజలు చేశారు. (తిరుపతిలో ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతుంది అక్కడి పూజా విధానం అంతా స్త్రీ దేవతకు చేసేదే)
తిరుమలను తర్వాత శైవులు ఆక్రమించుకుని ఆ విగ్రహాన్ని ఈశ్వరుడిగా ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి రామానుజాచార్యులు ఒక రసవత్తరమైన డ్రామా ఆడి తిరుమలలో ఉన్న విగ్రహం శివుడిది కాదు విష్ణువుదని నమ్మించాడు. అప్పటి వరకూ ఆ విగ్రహాన్ని ఈశ్వరుడిగా పిలిచిన జనం ఒక్కసారిగా దేవుడు మారిపోయేసరికి ఏమనాలో తెలియక ''వెనకటి ఈశ్వరుడు'' అనేవారు. రానురాను అదే ''వెంకటేశ్వరుడు'' అయ్యిందని చరిత్ర చెబుతోంది. జ్ఞానవాపిలో దొరికినది శివలింగమో కాదో తేల్చాలంటే ఆర్కియోలాజి డిపార్ట్మెంట్ కొంత శ్రమ పడాల్సి ఉంటుందేమో కానీ తిరుపతిలో విగ్రహానికి నగలన్నీ తొలగించి చూస్తే చాలు అది స్త్రీ విగ్రహం అని, బౌద్ధ సన్యాసి విగ్రహమని చాలా చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. మరి మసీదులు పరిశీలించి, వాటిని కూల్చి గుళ్ళు కట్టాలని తీర్పులిచ్చే న్యాయస్థానాలు ఇలాంటి గుళ్ళు కూల్చి ఆరామాలు కట్టాలని కూడా తీర్పులిస్తాయా..?
- వనజ